![Alia Bhatt, Ranbir Kapoor Wedding Date Changed to April 20th - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/12/ALIA.jpg.webp?itok=jH2y5-Ns)
Alia Bhatt, Ranbir Kapoor Wedding Date Postponed: ఎట్టకేలకు బాలీవుడ్ లవ్‌బర్డ్స్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి హజరయ్యే బాలీవుడ్ సెలబ్రెటీలు వీరేనని, అందులో దీపికా పదుకొనె కూడా ఉందంటూ బీ-టౌన్‌లో గుసగుసలు కూడా మొదలయ్యాయి. ఇక వధువరులు ధరించే పెళ్లి బట్టలు, నగలు దగ్గరి నుంచి వీరి వివాహ వేదిక వరకు అన్నింటిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఏప్రిల్ 13న మహెందీ, హల్దీ వేడుకలు జరగనుండగా.. ఏప్రిల్ 14 లేదా 15వ తేదీల్లో పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: బన్నీ అలా అంటాడని ఊహించలేదు: ఉపేంద్ర
అయితే వీరి పెళ్లి తేదీపై మాత్రం ఖచ్చితమైన సమాచారం లేదు. అంతేకాదు ఈ వార్తలపై ఇప్పటికీ ఈ జంట కానీ కుటుంబ సభ్యులు కానీ స్పందించలేదు. ఈ క్రమంలో ఈ లవ్‌బర్డ్స్ తమ పెళ్లి తేదీని వాయిదా వేసుకుందంటూ తాజాగా వార్తలు గుప్పుమన్నాయి. ఎలాంటి హడావుడి లేకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటీకి ఎలాగోలా అది బయటకు వచ్చిది. అంతేకాదు పెళ్లి ముహుర్తం నుంచి అరెంజ్‌మెంట్స్ వరకు అన్ని మీడియా చెవిన పడ్డాయట. దీంతో ఇరు కుటుంబాలపై ఒత్తిడి పడే అవకాశం ఉందని, అలాగే సెక్యురిటీ దృష్ట్యా కూడా పెళ్లి తేదీని ఏప్రిల్ 20కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
చదవండి: పెద్దపల్లి జిల్లాగోదావరి ఖనిలో నాని మూవీ షూటింగ్
స్వయంగా ఈ కొత్త పెళ్లి తేదీపై అలియా కజిన్(స్టెప్ బ్రదర్) రాహుల్ క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన రాహుల్ అలియా-రణ్‌బీర్ పెళ్లి విషయంపై స్పందించాడు. ‘నిజానికి వీరి పెళ్లి ఏప్రిల్ 14, 15 తేదీలలో జరపాలని అనుకున్నారు. అంతా బాగుంటే ఈ తేదీల్లోనే వారి పెళ్లి జరగాల్సింది. అయితే దీనిపై ఎంత గొప్యత పాటించిన ఇది బయటకు వచ్చింది. దీంతో సెక్యురిటీ దృష్ట్యా మహెందీ, హల్ది, నుంచి మిగిలి కార్యక్రమాలన్నింటిలో మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో పెళ్లి ఏప్రిల్ 20వ తేదీన జరిగే అవకాశం ఉంది’ అని అతడు చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment