
ప్రేమ పక్షులు దీపికా పదుకొనే, రణవీర్ సింగ్‌ల వివాహానికి సబంధించిన వార్తలు ఇప్పటికే చాలా సార్లు వినిపించాయి. తాజాగా మరో సారి ఈ జంట ఒక్కటవ్వబోతుందన్న వార్త తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ జోడి ఈ ఏడాదిలోనే ఒక్కటవ్వాలని భావిస్తున్నారట.
దీపికా తల్లిందండ్రులు పెళ్లి తేదిని ఖరారు చేసినట్లు ఓ జాతీయ పత్రిక పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్, డిసెంబర్‌ల మధ్య ఉన్న నాలుగు తేదీలను చూశారని, వాటిలో ఒక తేదిని ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం. పెళ్లి కోసమై ఈ అమ్మడు తన చెల్లి, అమ్మతో కలిసి షాపింగ్ కూడా మొదలు పెట్టిందట.
ఈ విషయంపై రణవీర్ ఓ మీడియా సమావేశంలో స్పందిస్తూ.. ‘ఈ విషయం ఎవరు బయటపెట్టారో నాకు తెలియదు. కానీ మా ఆలోచన మాత్రం అదే. పెళ్లి సంబంధించిన పనులను మొదలుపెట్టాం. వీలైనంత తొందరలో మా పెళ్లి జరుగుతుంది. కానీ ఇంకా డేట్ ఫిక్స్ కాలేద’ని తెలిపారు.
కాగా దీపికా పదుకోనె త్వరలో విశాల్ భరద్వాజ్ చిత్రంలో నటించనుంది. రణవీర్ సింగ్.. జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్న 'గుల్లీ బాయ్’ తో పాటు రోహిత్ శెట్టి దర్శకత్వంలో సింబా చిత్రాల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment