
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ నాలుగో సీజన్ ‘డ్రా’తో మొదలైంది. కేరళ బ్లాస్టర్స్, అట్లెటికో డి కోల్‌కతా జట్ల మధ్య శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. ఆట ముగిసే సమయంలో కేరళ, కోల్‌కతా జట్లకు గోల్ చేసే అవకాశం త్రుటిలో చేజారింది. కోల్‌కతా ప్లేయర్ బ్రాంకో సూపర్ కిక్‌తో దాదాపు గోల్ అయినట్లే అనిపించినా... గోల్‌పోస్ట్‌ను తాకి బంతి బయటకు వెళ్లిపోయింది.
మ్యాచ్‌కు ముందు బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హుషారెత్తించే నృత్యాలతో హోరెత్తించారు. శనివారం జరిగే మ్యాచ్‌లో నార్త్‌ఈస్ట్ యునైటెడ్‌తో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment