పరుగుల రాణి | Katrina Kaif to star in the PT Usha biopic | Sakshi
Sakshi News home page

పరుగుల రాణి

Published Thu, Apr 25 2019 2:25 AM | Last Updated on Thu, Apr 25 2019 2:25 AM

Katrina Kaif to star in the PT Usha biopic - Sakshi

బాలీవుడ్‌కు బయోపిక్స్‌ ఫీవర్‌ ఇప్పట్లో తగ్గేలా లేదు. లేటెస్ట్‌గా మరో బయోపిక్‌కి శ్రీకారం జరగనుందనే వార్త వినిపిస్తోంది. పరుగుల రాణి పీటీ ఉషా జీవితం ఆధారంగా ఓ చిత్రం తయారు కానుందట. పీటీ ఉష పాత్రలో కత్రినా కైఫ్‌ నటిస్తారని సమాచారం. బయోపిక్‌ జానర్‌లో ఇప్పటి వరకూ యాక్ట్‌ చేయలేదు కత్రినా.

ఉషా జీవితం ఆధారంగా దర్శకురాలు రేవతి యస్‌. వర్మ ఓ కథను తయారు చేయడం, కత్రినాతో పలు చర్చలు జరపడం కూడా జరిగాయట. ఈ బయోపిక్‌లో నటించడానికి కత్రినా ఆసక్తిగా ఉన్నారని బాలీవుడ్‌ టాక్‌. ఇందులో నటించడానికి కత్రినాకు కావాల్సిన ట్రైనింగ్‌ని పీటీ ఉషా దగ్గరుండి పర్యవేక్షించనున్నారని తెలిసింది. పరుగు పందెంలో ఎన్నో మెడల్స్‌ గెలిచిన ఉషా జీవితం నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్‌ అయితే బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్లు కూడా పరుగులు పెట్టడం ఖాయం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement