pt usha
-
ఐఓఏలో వైరం... ఎస్జీఎం చక్కదిద్దేనా?
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లోని సహచరులతో ఏర్పడిన వైరంతో ఇబ్బంది పడుతున్న ఐఓసీ అధ్యక్షురాలు పీటీ ఉష ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)ను ఏర్పాటు చేసింది. ఈ నెల 25న జరగబోయే ఈ మీటింగ్‌లో సమస్యలు, విబేధాలు, ఇతరత్రా అంశాలపై చర్చిద్దామని ఆమె పేర్కొంది. ‘వివాదానికి దారి తీసిన అంశాలు, అసాధారణ సమస్యలు... ఇలా అన్నింటిపై చర్చించేందుకు ఎస్జీఎం నిర్వహించాలని నిర్ణయించాను. ఈ నెల 25న ఆఫీస్ బేరర్లు, స్టేక్ హోల్డర్లంతా హాజరు కావాలని కోరుతున్నాను. ఈ ఎస్జీఎం హైబ్రిడ్ మీటింగ్. అంటే నియమావళిలోని ఆర్టికల్ 8.3 ప్రకారం ఎవరైనా సభ్యులు ప్రత్యక్షంగా హాజరు కాలేని పరిస్థితి ఉంటే ఆన్లైన్ మీటింగ్ ద్వారా కూడా పాల్గొనవచ్చు. దీనికి సంబంధించిన లింక్ ఐఓఏ వెబ్సైట్లో ఉంటుంది’ అని ఉష ఐఓఏ సభ్యులకు ఈ–మెయిల్ పంపారు. ముఖ్యంగా ఒలింపిక్ సంఘానికి సీఈఓగా రఘురామ్ అయ్యర్‌ను నియమించడాన్ని ఎగ్జిక్యూటివ్ (ఈసీ) సభ్యులు ఏమాత్రం జీరి్ణంచుకోలేకపోతున్నారు. తాము ఎంతగా వ్యతిరేకించినా ఆయనకు పదవిని కట్టబెట్టడంపై ఈసీ సభ్యులంతా గుర్రుగా ఉన్నారు. కోశాధికారి సహదేవ్ యాదవ్‌పై వచ్చిన తీవ్రమైన అవినీతి ఆరోపణలు కూడా చర్చనీయాంశమైంది. ఈ లుకలుకలతో ఐఓఏ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. మరోవైపు ఐఓఏను ఒక ప్రొఫెషనల్ దృక్పథంలో నడిపించేందుకు సీఈఓ అవసరం ఎంతో ఉందని ఉష వాదిస్తోంది. అయ్యర్‌కు సీఈఓ పదవేమీ పూర్తిగా కొత్తేం కాదు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలతో పాటు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ లీగ్, అల్టీమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)లకు సీఈఓ పనిచేసిన విశేషానుభవం రఘురామ్ అయ్యర్ సొంతం. ఐఓఏ నిర్వహించే ఎస్‌జీఎంలో స్పోర్ట్స్ కోడ్‌పై కూడా చర్చ జరిగే అవకాశముంది. గరిష్ట వయోపరిమితిపై ప్రధానంగా చర్చిస్తారు. -
పీటీ ఉషపై వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణలు
భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషపై భారత స్టార్ రెజ్లర్‌గా వెలుగొందిన వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణలు చేసింది. తనకు తెలియకుండానే తనతో దిగిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారని.. నాకేదో అండగా ఉన్నట్లుగా ప్రచారం చేసుకున్నారని ఆరోపించింది. తన విషయంలో చాలా రాజకీయాలు నడిచాయని.. అందువల్లే తన మనసు విరిగిపోయిందని తెలిపింది.అనూహ్య రీతిలో అనర్హత వేటుఅందుకే విరక్తిపుట్టి ఇక కుస్తీకి స్వస్తి పలకాలనే కఠిన నిర్ణయానికి వచ్చానంటూ వినేశ్ ఉద్వేగానికి లోనైంది. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో రెజ్లింగ్ మహిళల 50 కిలోల విభాగంలో వినేశ్ ఫొగట్ ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, స్వర్ణ పతక బౌట్‌కు ముందు అనూహ్య రీతిలో ఆమెపై వేటు పడింది. నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉన్న కారణంగా ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది.నో మెడల్ఫలితంగా.. వినేశ్‌కు స్వర్ణం లేదంటే రజతం ఖాయమనుకున్న భారతీయుల కల చెదిరిపోయింది. అయితే, ఫైనల్ చేరే వరకు తన ప్రయాణం నిబంధనలకు అనుగుణంగానే సాగింది కాబట్టి.. కనీసం సంయుక్త రజతమైనా ఇవ్వాలని వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ను ఫర్ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. అనేక వాయిదాల అనంతరం వినేశ్ ఫొగట్ అభ్యర్థనను కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఒక్క గ్రాము బరువు ఎక్కువగా ఉన్నా పోటీ నుంచి తప్పుకోవాల్సిందేనని.. అలాంటి పరిస్థితిలో పతకం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది.ఆస్పత్రిలో ఉండగా పీటీ పరామర్శఇదిలా ఉంటే.. ఫైనల్‌కు ముందు బరువు తగ్గేందుకు తీవ్రంగా శ్రమించిన వినేశ్ ఫొగట్ అస్వస్థకు గురై ప్యారిస్ ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలో భారతీయులంతా సోషల్ మీడియా వేదికగా ఆమెకు అండగా నిలబడగా.. ఐఏఓ అధ్యక్షురాలు పీటీ ఉష సైతం హాస్పిటల్‌కు వెళ్లి వినేశ్‌ను పరామర్శించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉష నెట్టింట షేర్ చేసింది.నాడు ఢిల్లీ వీధుల్లో పోరాటంఅయితే, వినేశ్ గతంలో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న అప్పటి బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల ఉద్యమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్‌తో కలిసి ఢిల్లీ వీధుల్లో పోరాటం చేసింది. ఈ నేపథ్యంలో ప్యారిస్‌లో వినేశ్‌పై అనర్హత వేటు పడగానే అటు బీజేపీ పెద్దలు, పీటీ ఉష, కేంద్రం నియమించిన న్యూట్రీషనిస్టులపై ఆమె అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు.వినేశ్దే బాధ్యత అన్నట్లుగా ఈ నేపథ్యంలో ఉష స్పందిస్తూ.. బరువు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సదరు అథ్లెట్లదేనని.. ఇందులో తాము చేయడానికి ఏమీ లేదంటూ కుండబద్దలు కొట్టింది. ఈ పరిణామాల క్రమంలో రెజ్లింగ్‌కు స్వస్తి పలుకుతున్నాని ప్రకటించిన వినేశ్ ఫొగట్.. ఇటీవలే రాజకీయాల్లో ప్రవేశించింది. బజరంగ్ పునియాతో కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైంది.అందుకే నా గుండె పగిలిందిఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. పీటీ ఉష తనకు కష్టసమయంలో ఎలాంటి సహాయం చేయలేదని ఆరోపించింది. ‘‘పీటీ ఉష మేడమ్ ఆస్పత్రిలో నన్ను చూడటానికి వచ్చారు. ఒక ఫొటో తీసుకున్నారు. రాజకీయాల్లో ఇలాంటివి సహజమేనని మీరు అనవచ్చు. అయితే, ప్యారిస్ క్రీడాగ్రామంలోనూ రాజకీయాలు నడిచాయి.అందుకే నా గుండె పగిలింది. రెజ్లింగ్ వదలొద్దు అని చాలా మంది నాకు చెబుతూ ఉంటారు. కానీ ఇంకా ఆటలో కొనసాగడం వల్ల నాకేం ఒరుగుతుంది? అక్కడ ప్రతీదీ రాజకీయమే. మనం ఆస్పత్రిలో పడి ఉన్నపుడు బయట ఏం జరుగుతుందో తెలియదు కదా.పీటీ ఉషది నాటకంనా జీవితంలో అత్యంత దుర్భర సమయంలో ఓ వ్యక్తి వచ్చి నాతో ఫొటో దిగి.. నాకు అండగా ఉన్నానన్న ప్రచారం కోసం దానిని సోషల్ మీడియాలో పెట్టడం సరైందేనా? మద్దతు పలకడం కాదది.. అండగా ఉన్నట్లు నటించడం. నిజానికి మెడల్ కోసం నా తరఫున ఒలింపిక్ సంఘం దేశం పేరుతో పిటిషన్ వేయాలి. కానీ నాకెవరూ అండగా లేకపోవడంతో నా పేరు మీదనే కేసు ఫైల్ చేశాను’’ అని కాంగ్రెస్ నేత, 30 ఏళ్ల వినేశ్ ఫొగట్ పీటీ ఉషను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాగా పీటీ ఉష రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న విషయం తెలిసిందే. బీజేపీ ఆమెను ఈ పదవికి నామినేట్ చేసింది.చదవండి: నా ఓటమికి సంతోషించేవాళ్లు దేశ ద్రోహులే: వినేశ్ ఫోగట్ -
వినేశ్ విషయంలో మా తప్పేమీ లేదు: పీటీ ఉష
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ అనర్హత అంశంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తప్పొప్పులను ఎంచుతూ వినేశ్ అనుకూల, ప్రతికూల వర్గాలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా భారత ఒలింపిక్ సంఘం(IOA) వైద్య బృందం తీరుపై విమర్శలు వస్తున్నాయి. వినేశ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వినేశ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు.. పార్లమెంటులోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య వినేశ్ అంశమై రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో IOA అధ్యక్షురాలు పీటీ ఉష కీలక వ్యాఖ్యలు చేశారు. తమ వైద్య బృందాన్ని సమర్థిస్తూ.. వినేశ్, ఆమె కోచ్‌దే తప్పు అన్నట్లుగా పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. ఈ మేరకు.. ‘‘రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బాక్సింగ్, జూడో వంటి క్రీడల్లో బరువు నియంత్రణ అంశం అనేది పూర్తిగా సదరు అథ్లెట్, అతడు లేదంటే ఆమె కోచ్ బాధ్యత.ఈ విషయంలో IOAచే నియమితులైన చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పర్దీవాలా, ఆయన బృందానికి ఈ విషయంతో ఎటువంటి సంబంధం లేదు. IOA మెడికల్ టీమ్, డాక్టర్ పార్దీవాలాపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. వీటిని నేను పూర్తిగా ఖండిస్తున్నా.వాస్తవాలు తెలుసుకోకుండా IOA వైద్య బృందాన్ని బాధ్యుల్ని చేస్తూ.. వారిని తప్పుబట్టడం సరికాదు. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొన్న ప్రతీ భారత అథ్లెట్‌కు వారికంటూ సొంత సహాయక సిబ్బంది ఉంది. ఎన్నో ఏళ్లుగా వారితోనే ఈ అథ్లెట్ ప్రయాణం చేస్తున్నారు. రెండు నెలల క్రితమే IOA మెడికల్ టీమ్‌ను నియమించాం.పోటీల సమయంలో ఆటగాళ్లు గనుక గాయపడితే.. వారికి చికిత్స అందించడం మాత్రమే వీరి ప్రాథమిక విధి. తమకంటూ సొంతంగా న్యూట్రీషనిస్ట్, ఫిజియోథెరపిస్ట్లేని అథ్లెట్లకు కూడా వీరు సేవలు అందిస్తారు’’ అని పీటీ ఉష ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినేశ్ ఫొగట్ బరువు విషయంలో వినేశ్తో పాటు ఆమె కోచ్‌లదే పూర్తి బాధ్యత అని చెప్పుకొచ్చారు.కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024 మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో హర్యానా రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. తద్వారా ఈ క్రీడాంశంలో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించి భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. అయితే, ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఫైనల్‌కు ముందు బరువు తూచగా.. నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఫలితంగా వినేశ్ ఫొగట్ ఫైనల్లో పాల్గొనకుండా అనర్హత వేటు పడింది. ఈ క్రమంలో కనీసం సంయుక్త రజతమైనా ఇవ్వాలని వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌కు అప్పీలు చేసింది. ఇందుకు సంబంధించిన తీర్పు ఆగష్టు 13న వెలువడనుంది. -
నిజమైన విజేతవు నీవే బంగారం!
క్రీడలే జీవితంగా భావించే వారు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ఒలింపి క్స్‌లో పతకం సాధించాలని కోరుకొంటారు. పతకం కోసం అహరహం శ్రమిస్తూ సంవ త్సరాల తరబడి సాధన చేస్తూ ఉంటారు. అయితే... గెలుపు, ఓటమితో సంబంధం లేని ఓ సాంకేతిక కారణంతో స్వర్ణపతకం చేజారితే... కనీసం రజత పతకమైనా దక్కకుంటే అంతకుమించిన విషాదం మరొకటి ఉండదు. ప్రస్తుత ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల కుస్తీ 50 కిలోల విభాగంలో భారత మల్లయోధురాలు వినేశ్ పోగట్‌కు అదే పరిస్థితి ఎదు రయ్యింది. వంద గ్రాముల అదనపు బరువు కొండంత దురదృష్టాన్ని, గుండెబరువును మిగిల్చింది.ఒలింపిక్స్‌లో పతకం మినహా ప్రపంచ కుస్తీలోని అన్ని రకాల పోటీలలో పతకాలు సాధించిన ఘనత వినేశ్‌కు ఉంది. 49 కిలోలు, 50 కిలోలు, 53 కిలోల విభాగాలలో పాల్గొంటూ చెప్పుకోదగ్గ విజయాలు, ఎన్నో పతకాలు సాధించిన ఘనత ఉంది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ పోటీలలో సైతం స్వర్ణ, కాంస్య పతకాలు సాధించిన వినేశ్‌కు ఒలింపిక్స్ పతకం మాత్రం గత పుష్కరకాలంగా అందని ద్రాక్షలా ఉంటూ వచ్చింది.2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటూ గాయంతో వైదొలిగిన వినేశ్ 2020 టోక్యో ఒలింపి క్స్‌లో మాత్రం స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయింది. ఇక 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి కొద్దిమాసాల ముందు వినేశ్ న్యాయం కోసంముందుగా రోడ్లు, ఆ తరువాత న్యాయస్థానాల మెట్లు ఎక్కి పోరాడాల్సి వచ్చింది.అంతర్జాతీయ కుస్తీ పోటీలలో పాల్గొంటూ, దేశానికి పతకాలతో ఖ్యాతి తెస్తున్న ఏడుగురు మహిళా వస్తాదులపై బీజెపీ మాజీ ఎంపీ, జాతీయ కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్, ఆయన పరివారం లైంగిక వేధింపులకు పాల్పడటానికి నిరసనగా భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ లాంటి దిగ్గజ వస్తాదులతో కలసి వినేశ్ గొప్ప పోరాటమే చేసింది. చివరకు ఢిల్లీ పోలీసుల కాఠిన్యాన్ని రుచి చూడాల్సి వచ్చింది. న్యాయస్థానాల జోక్యంతో బ్రిజ్ భూషణ్ అధ్యక్షపదవిని వీడక తప్పలేదు.మొక్కవోని దీక్షతో, మోకాలి శస్త్ర చికిత్సను సైతం భరించి, పోరాడి ప్యారిస్ ఒలింపిక్స్ 50 కిలోల విభాగంలో పాల్గొనటానికి అర్హత సంపాదించింది. 53 కిలోల విభాగంలో తనకు అవకాశం లేకపోడంతో యాభై కిలోల విభాగంలో పాల్గొనటం కోసం బరువు తగ్గించుకొని మరీ ప్యారిస్‌లో అడుగుపెట్టింది. మహిళా కుస్తీ 50 కిలోల విభాగం పోటీల తొలిరోజున 50 కిలోల బరువుతోనే జపాన్, ఉక్రెయిన్, క్యూబా బాక్సర్లను చిత్తు చేయడం ద్వారా ఫైనల్లో అడుగు పెట్టింది. వినేశ్ ఫైనల్స్ చేరడంతో బంగారు పతకం ఖాయమనే శతకోటి భారత క్రీడాభిమానులు ఆశ పడ్డారు. కానీ జరిగింది వేరు. అంతర్జాతీయ కుస్తీ సమాఖ్య నిబంధనల ప్రకారం పోటీలు జరిగే ప్రతి రోజూ వివిధ విభాగాలలో పోటీకి దిగే వస్తాదుల బరువును చూసిన తరువాతే పోటీకి అనుమతిస్తారు. అయితే...పోటీల తొలిరోజున 50 కిలోల బరువున్న వినేశ్... స్వర్ణపతం కోసం పోటీపడే రోజున మాత్రం 100 గ్రాముల బరువు అదనంగా ఉండడంతో అనర్హత వేటు వేశారు. బరువును నియంత్రించుకోడం కోసం ఫైనల్‌కు ముందురోజు రాత్రి వినేశ్, ఆమె శిక్షకులు చేయని ప్రయత్నం అంటూ ఏమీలేదు. తెల్లవార్లూ నడకతో, సైక్లింగ్ చేస్తూ, విపరీతమైన వేడితో ఉండే ఆవిరి గదిలో వినేశ్ గడిపింది. చివరకు బరువు తగ్గించుకోవటం కోసం శిరోజాలను సైతం కత్తిరించుకొన్నా ప్రయోజనం లేకపోయింది. వంద గ్రాముల అదనపు బరువు కారణంగా బంగారు పతకం కోసం పోటీ పడే అవకాశాన్ని కోల్పోడంతో పాటు... కనీసం రజత పత కానికి సైతం నోచుకోలేకపోయింది. అదనపు బరువు నిబంధన కారణంగా వినేశ్‌కు బంగారు పతకం పోరులో పాల్గొనే అవకాశాన్ని నిరాకరించడం గుండె కోతను మిగిల్చింది. వినేశ్తో పాటు కోట్లాది క్రీడాభి మానులు, యావత్ భారతజాతి తల్లడిల్లిపోయింది.అదనంగా ఉన్న 100 గ్రాముల బరువే తనకు ఒలింపిక్స్ పతకం సాధించే అవకాశం లేకుండా చేయటాన్ని జీర్ణించుకోలేని వినేశ్ అర్ధంతరంగా రిటై ర్మెంట్ ప్రకటించింది. వినేశ్‌కు న్యాయం చేయాలంటూ అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘానికి భారత కుస్తీ సమాఖ్య అప్పీలు చేసింది. ఫైనల్ బరిలో దిగకుండానే సర్వం కోల్పోయిన వినేశ్‌కు కనీసం రజత పతకమైనా ఇవ్వాలంటూ మొరపెట్టుకొన్నారు. రజత పతకాలు ఇద్దరికీ ఇచ్చినా ఇబ్బంది రాదని అంటున్నారు.వినేశ్‌కు ప్రధాని, కేంద్ర క్రీడామంత్రి; భారత ఒలింపిక్స్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో పాటు పలు వురు క్రీడాదిగ్గజాలు, సింధు లాంటి ఒలింపియన్లు అండగా నిలిచారు.ప్రతిభకు, బరువుకు సంబంధం ఏంటని పలు వురు నిపుణులు, ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. 100 గ్రాముల అదనపు బరువుతో ప్రత్యర్థికి జరిగే నష్టమేంటని నిలదీస్తున్నారు. హార్మోనుల అసమతౌల్యత వల్ల మహిళల బరువు తరచూ మారిపోతూ ఉంటుందని, ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని మినహా యింపు ఇవ్వాలంటూ సూచిస్తున్నారు.భారత ఒలింపిక్స్ సంఘం మొరను అంతర్జా తీయ ఒలింపిక్స్ సంఘం ఆలకించినా... ఆలకించ కున్నా, కనీసం రజత పతకం ఇచ్చినా, ఇవ్వకున్నా... నిజమైన విజేతగా కోట్లాది మంది క్రీడాభిమానుల గుండెల్లో వినేశ్ పోగట్ నిలిచిపోతుంది.వ్యాసకర్త సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ మొబైల్: 84668 64969 -
నీరజ్ చోప్రా మంచి మనసు.. శ్రీజేశ్కు అరుదైన గౌరవం
భారత హాకీ జట్టు గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్కు అరుదైన గౌరవం దక్కింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024 ముగింపు వేడుకల్లో భారత బృంద పతకధారిగా అతడు వ్యవహరించనున్నాడు. కాంస్య పతకాల విజేత, షూటర్ మనూ భాకర్‌తో కలిసి ఫ్లాగ్‌బేరర్ హోదాలో ముందుండి నడవనున్నాడు.భారత ఒలింపిక్ సంఘం ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. రెండు దశాబ్దాలుగా భారత హాకీకి వెన్నెముకగా ఉన్న శ్రీజేశ్ ఈ గౌరవానికి అర్హుడని పేర్కొంది. ఈ విషయం గురించి జావెలిన్ త్రోయర్, రజత పతక విజేత నీరజ్ చోప్రాతో చర్చించామని.. అందుకు అతడు సంతోషంగా ఒప్పుకొన్నాడని తెలిపింది. ఈ క్రమంలో శ్రీజేశ్ పేరును ఫ్లాగ్‌బేరర్‌గా ఎంపిక చేసినట్లు పేర్కొంది.పతకాల ఖాతా తెరిచిన మనూ భాకర్కాగా షూటర్ మనూ భాకర్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత పతకాల ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. తొలుత మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచిన ఈ హర్యానా షూటర్.. సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మరో కాంస్యం కైవసం చేసుకుంది. తద్వారా ఒలింపిక్స్ ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.ఈ క్రమంలో ఆమెను ఫ్లాగ్‌బేరర్‌గా ప్రకటించింది భారత ఒలింపిక్ సంఘం. మరోవైపు.. టోక్యోలో స్వర్ణం గెలిచిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ప్యారిస్‌లో రజతంతో సరిపెట్టుకున్నాడు. అయినప్పటికీ.. వరుస ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు గెలిచిన నాలుగో భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఈ నేపథ్యంలో మనూతో పాటు ఫ్లాగ్‌బేరర్‌గా ఈ హర్యానా ఆటగాడు ఉంటాడని అంతా భావించారు.అయితే, వరుసగా భారత హాకీ జట్టు రెండోసారి కాంస్యం గెలవడంలో కీలక పాత్ర పోషించిన గోల్ కీపర్ శ్రీజేశ్ వైపు ఒలింపిక్ సంఘం మొగ్గుచూపింది. ప్యారిస్‌లో రిటైర్మెంట్ ప్రకటించిన ఈ కేరళ క్రీడాకారుడు.. భారత క్రీడా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా సముచిత గౌరవం ఇవ్వాలని భావించింది.శ్రీజేశ్ పట్ల నీరజ్‌కు ఉన్న గౌరవానికి నిదర్శనంఈ విషయం గురించి భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ.. ‘‘ముగింపు వేడుకల్లో శ్రీజేశ్‌ను ఫ్లాగ్‌బేరర్‌గా నియమించాలనుకుంటున్నామని నీరజ్ చోప్రాతో చెప్పాను. అందుకు బదులిస్తూ.. ‘మేడమ్.. ఒకవేళ పతకధారిగా ఎవరు సరైనవ్యక్తి అని మీరు గనుక నన్ను అడిగితే.. నేను కూడా కచ్చితగా శ్రీ భాయ్ పేరునే చెపుతా’ అన్నాడు.శ్రీజేశ్ పట్ల నీరజ్‌కు ఉన్న గౌరవానికి ఇది నిదర్శనం. క్రీడా స్ఫూర్తితో తను ఇందుకు అంగీకరించాడు’’ అని హర్షం వ్యక్తం చేశారు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్‌కు నాలుగు కాంస్యాలు(షూటింగ్లో మూడు, హాకీ 1), ఒక రజత పతకం(పురుషుల జావెలిన్ త్రో) దక్కింది. ఇక ఆగష్టు 11న ఒలింపిక్స్ ముగింపు వేడుకలు జరుగనున్నాయి. ఇక ఆరంభ వేడుకల్లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ వెటరన్ ప్లేయర్ శరత్ కమల్ భారత బృంద పతకధారులుగా వ్యవహరించిన విషయం తెలిసిందే.చదవండి: అర్షద్ కూడా మా బిడ్డ లాంటివాడే: నీరజ్ చోప్రా తల్లిదండ్రులు -
వినేశ్ ఊహించలేదా!.. జుట్టు కత్తిరించి, రక్తం తీసినా.. తప్పెవరిది?
50 కిలోల 100 గ్రాములు... వెయింగ్ స్కేల్‌పై వినేశ్ ఫొగాట్ బరువు కనిపించింది! అంతే... అక్కడే ఆశలు నేలకూలాయి. మరో మాటకు తావు లేకుండా అనర్హత... బంగారు పతకం కోసం కన్న కలలు అక్కడే కల్లలయ్యాయి... ఆ 100 గ్రాములను తగ్గించేందుకు మరికొంత సమయం కావాలంటూ భారత బృందం చేసిన అభ్యర్థనను నిర్వాహకులు లెక్క చేయనేలేదు.అసాధారణ ఆటతో ఫైనల్ వరకు చేరి తన ఒలింపిక్ పతక లక్ష్యాన్ని నిజం చేసుకున్న ఫొగాట్‌కు తుది సమరానికి కొన్ని గంటల ముందు ఆ పతకం కూడా దక్కదని తేలిపోయింది. రెజ్లింగ్‌లో భారత మహిళ తొలిసారి ఫైనల్‌కు చేరడంతో పసిడి పతకాన్ని ఆశించిన మన అభిమానులకు కూడా అది దక్కదని అర్థమైపోవడంతో అన్నింటా నిరాశ అలముకుంది. ఆమె మూడు మ్యాచ్‌ల కష్టాన్ని కూడా నిర్వాహకులు లాగేసుకోవడం ఎవరూ ఊహించని విషాదం.ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ 50 కేజీల కేటగిరీలో ఫైనల్ చేరిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ బరిలోకి దిగకుండానే తప్పుకోవాల్సి వచ్చింది. ఫైనల్‌కు కొన్ని గంటల ముందు జరిగే ‘వెయింగ్’లో వినేశ్ బరువు 50 కిలోల 100 గ్రాములుగా తేలింది. నిబంధనల ప్రకారం అనుమతించిన బరువుకంటే ఏమాత్రం ఎక్కువ బరువు ఉన్నా ఆటోమెటిక్‌గా అనర్హత వేటు పడుతుంది.ఫైనల్ కోసమే కాకుండా ఓవరాల్‌గా ఆమె గెలిచిన మూడు బౌట్లను కూడా గుర్తించకుండా వినేశ్‌ను నిర్వాహకులు డిస్క్వాలిఫై చేశారు. సెమీస్‌లో వినేశ్ చేతిలో ఓడిన యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్ (క్యూబా) ఫైనల్ చేరింది. దాంతో ఎలాంటి పతకం లేకుండా చివరి స్థానంతో ఫొగాట్ నిష్క్రమించింది. వినేశ్ అనర్హత నేపథ్యంలో అసలు ఏం జరిగింది... ఎలాంటి పరిణామాలు సంభవించాయో చూస్తే...కేటగిరీని మార్చుకొని... కెరీర్ ఆరంభం నుంచి కొన్నాళ్ల క్రితం వరకు కూడా వినేశ్ 53 కేజీల విభాగంలో పోటీ పడింది. అయితే ఢిల్లీలో వివాద సమయంలో కొంత కాలం ఆటకు దూరమయ్యాక అందులో మరో ప్లేయర్ రావడంతో కేటగిరీ మార్చుకుంటూ 50 కేజీలకు తగ్గింది. ఇందులోనే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. తొలి రోజు ఏం జరిగింది...పోటీలకు ముందు బరువు తూచే సాధారణ ప్రక్రియ ‘వెయింగ్’లో వినేశ్ బరువు 49.90 కిలోలుగా వచ్చింది. అక్కడే కాస్త ప్రమాదం కనిపించినా, 50కి లోపు ఉండటంతో సమస్య రాలేదు. మూడు బౌట్లు ఆడి వరుస విజయాలతో ఫొగాట్ ఫైనల్ చేరింది. ఆ తర్వాత ఏమైంది... పోటీ పడే క్రమంలో విరామాల మధ్య ఆహారం, నీళ్లు తీసుకోవడంతో ఆమె సహజంగానే బరువు పెరిగింది. సెమీస్ తర్వాత ఇది 52.70 కేజీలుగా ఉంది. బుధవారం ‘వెయింగ్’లోగా 2.70 కేజీలు తగ్గించాల్సిన అవసరం వచి్చంది.ఏం చేశారు...?వినేశ్తో పాటు ఆమె న్యూట్రిషనిస్ట్, భారత చీఫ్ మెడికల్ ఆఫీసర్ దిన్షా పర్దివాలా తదితరులు కలిసి రాత్రికి రాత్రే బరువు తగ్గించే ప్రయత్నం చేశారు. ఎలాంటి ఆహారం, నీరు ఇవ్వకపోవడంతోపాటు 12 గంటల వ్యవధిలో వివిధ రకాల ఎక్సర్సైజ్లు, ఆవిరి స్నానాలువంటి వాటితో వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే బరువు తగ్గించాలని చూశారు. చెమట రావడం తగ్గిపోవడంతో జుట్టు కూడా కత్తిరించారు. ఒకదశలో రక్తం తగ్గించాలని కూడా భావించారు. అయితే వీటన్నింటి కారణంగా వినేశ్ దాదాపుగా కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చినా అన్నింటికీ సిద్ధమైంది. అన్నింటికీ సిద్ధపడ్డా... సందేహంగానే వినేశ్ ‘వెయింగ్’కు సిద్ధం కాగా... చివరకు 50 కేజీలకంటే మరో 100 గ్రాములు ఎక్కువగానే వచి్చంది. కొంత సమయం ఉంటే అదీ తగ్గించే వాళ్లమని మెడికల్ ఆఫీసర్ పర్దివాలా వెల్లడించారు. ఒక్కసారి అనర్హురాలని తేలడంతో ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ఫ్లూయిడ్స్‌తో ఆమెకు చికిత్సను అందించారు. తప్పెవరిది? ప్లేయర్ సాధారణంగా తన ఆటపైనే దృష్టి పెడతారు. ఆమెతో పని చేసే వైద్యబృందం ఇలాంటి విషయాలను చూసుకోవాలి. పోటీలు జరిగే సమయంలో జాగ్రత్తగా ఆహారం అందించాలి. ముఖ్యంగా బౌట్ల మధ్య ఆమెకు ఇచి్చన ఆహారం విషయంలో బరువు పెరిగే అంశాలను చూసుకోవాల్సింది. ఒలింపిక్స్‌లాంటి ఈవెంట్లో ఇవి ఎంతో ముఖ్యం. అయితే ఎంత పెరిగినా సెమీఫైనల్ బౌట్ తర్వాత చూసుకోవచ్చు... ఎలాగైనా తగ్గించవచ్చనే అతి విశ్వాసమే దెబ్బ కొట్టిందని అర్థమవుతుంది. ఈ విషయంలో వైద్య బృందాన్ని తప్పు పట్టవచ్చు. రజతం కూడా ఇవ్వరా! 2016 రియో ఒలింపిక్స్ తర్వాత రెజ్లింగ్ పోటీలను రెండు రోజులు నిర్వహిస్తున్నారు. అప్పటి వరకు ఒకసారి తొలి మ్యాచ్‌కు ముందు బరువు చూశాక కొందరు బలమైన ఆహారాన్ని తీసుకుంటూ తర్వాతి రౌండ్లలో చెలరేగారు. రెజ్లింగ్, బాక్సింగ్, జూడో తదితర యుద్ధ క్రీడల్లో సమ ఉజ్జీల మధ్యే పోరాటం జరగాలని, ఎక్కువ బరువు ఉన్నవారికి ఎలాంటి అదనపు ప్రయోజనం దక్కరాదనే కారణంతో రూల్ మార్చారు. నిబంధనల ప్రకారం రెండు రోజులూ బరువు చూస్తారు.రెండో రోజు 15 నిమిషాల సమయంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. అందుకే ప్లేయర్లు 48 గంటల పాటు కడుపు మాడ్చుకొని అయినా సరే బరువు పెరగకుండా జాగ్రత్త పడతారు. సెమీస్ వరకు గెలిచింది కాబట్టి రజతం ఇవ్వవచ్చనే వాదన కొందరు లేవనెత్తారు. కానీ నిబంధనల ప్రకారం ఏ దశలో బరువు లెక్క తప్పినా అన్ని బౌట్ల ఫలితాలను రద్దు చేస్తారు. బరువు తగ్గే అవకాశం లేదని అర్థం కాగానే గాయం సాకుతో ఫైనల్‌కు ముందు ఓటమిని ఒప్పుకొని తప్పుకోవాల్సిందని కూడా అభిమానులు అనుకున్నారు.కానీ అదీ నిబంధనలకు విరుద్ధం. అంతకుముందు మ్యాచ్‌లలో పోటీ పడుతూ మధ్యలో గాయమైతే తప్ప ప్లేయర్ రెండో వెయింగ్‌లో తప్పనిసరిగా బరువు చూపించాల్సిందే. అలా చేయకపోయినా అనర్హత వేటు పడుతుంది కాబట్టి వినేశ్‌కు ఆ అవకాశమూ లేకపోయింది.వినేశ్ ఊహించలేదా! సాధారణంగా ఆటగాళ్లు తమ శరీర బరువుకు దగ్గరలో ఉండే వెయిట్ కేటగిరీల్లో పోటీ పడతారు. అలా అయితే సన్నద్ధత సులువవుతుంది. పోటీలు లేని సమయంలో వినేశ్ 56–57 కేజీల బరువుంటుంది. ఏదైనా టోర్నీ రాగానే ఆ సమయంలో ఎలాగైనా కష్టపడి తన బరువును తగ్గించుకుంటూ వచ్చి ఆటకు సిద్ధమైపోయేది. ఈసారి కూడా అలాగే ఆశించి ఉండవచ్చు.కానీ బుధవారం ఉదయం అది సాధ్యం కాలేదు. అంచనాలు తప్పడంతో 100 గ్రాముల తేడా వచ్చేసింది. ఇతర అంతర్జాతీయ టోర్నీల్లో 2 కిలోల వరకు సడలింపు ఉంది. ఆ టోర్నీల్లో అయితే 52 కేజీలు వచ్చినా సమస్య రాకపోయేది. కానీ ఒలింపిక్స్ నిబంధనలు చాలా కఠినంగా ఉండి అలాంటి సడలింపు లేదు. భారత్‌లో నిరసన... వినేశ్ ఉదంతంపై భారత పార్లమెంట్లో కూడా తీవ్ర చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం దీనిపై నిరసనను తెలియజేయాలని, ఆమెకు న్యాయం చేయాలని సభ్యులు కోరారు. మరోవైపు వినేశ్తో ఉన్న వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు.పారిస్‌లో పీటీ ఉష నేతృత్వంలో ఐఓఏ అధికారికంగా ఫిర్యాదు చేసినా... అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య మాత్రం ‘అన్నీ నిబంధనల ప్రకారమే’ అంటూ అన్నింటినీ కొట్టిపారేసింది. మాజీ బాక్సర్, 2008 బీజింగ్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత విజేందర్ సింగ్... ఇందులో ఏదో కుట్ర జరిగిందని ఆరోపించాడు. అసాధారణంగా సాగిన వినేశ్ ఎదుగుదలను చూసి ఎవరైనా ఏదైనా చేసి ఉంటారని, 100 గ్రాములు అనే విషయం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించాడు. -
Vinesh Phogat: స్పందించిన ఒలింపిక్ సంఘం.. కీలక వ్యాఖ్యలు
మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ అనర్హత వేటుపై భారత ఒలింపిక్ సంఘం(IOA) అధ్యక్షురాలు పీటీ ఉష స్పందించారు. ఇలాంటి పరిణామాన్ని అస్సలు ఊహించలేదని వాపోయారు. ఇలాంటి కఠిన సమయంలో భారత ఒలింపిక్ సంఘంతో పాటు ప్రభుత్వ మద్దతు కూడా ఉంటుందని వినేశ్‌కు ధైర్యం చెప్పానన్నారువినేశ్ ఫొగట్ విషయంలో భారత రెజ్లింగ్ సమాఖ్య న్యాయం కోసం యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్‌కు అప్పీలు చేసిందని పీటీ ఉష పేర్కొన్నారు. వినేశ్ విషయంలో తప్పక పోరాడతామని స్పష్టం చేశారు. వినేశ్ ఫొగట్‌ను నిర్ణీత బరువుకు తీసుకువచ్చేందుకు.. భారత వైద్య బృందం ఎంతగా శ్రమించిందో తనకు తెలుసనన్న ఉష.. రాత్రంతా ఆమె వర్కౌట్లు చేస్తూ గడిపిందని పేర్కొన్నారు. పోటీకి తనను తాను సన్నద్ధం చేసుకునేందుకు వినేశ్ ఎంతో కఠిన శ్రమకోర్చిందని చెప్పుకొచ్చారు. తాను స్వయంగా ఒలింపిక్ విలేజ్‌కు వెళ్లి వినేశ్ ఫొగట్‌ను కలిశానని.. దేశమంతా తన వెంటే ఉందని భరోసా ఇచ్చినట్లు పీటీ ఉష తెలిపారు.వినేశ్ స్థానంలో ఫైనల్‌కు ఆమెకాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. అయితే, బుధవారం స్వర్ణ పతక పోటీలో పాల్గొనాల్సి ఉండగా.. అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు వేశారు నిర్వాహకులు. 50 కేజీల కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందన్న కారణంగా వినేశ్ పతక ఆశలు ఆవిరైపోయాయి. ఈ నేపథ్యంలో సెమీస్‌లో వినేశ్ ఫొగట్ చేతిలో ఓడిన క్యూబా రెజ్లర్ యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్ ఫైనల్‌కు అర్హత సాధించినట్లు ఒలింపిక్స్ నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనల్లోని ఆర్టికల్ 11 ప్రకారం.. వినేశ్ స్థానంలో లోపెజ్కు ఈ అవకాశం దక్కినట్లు తెలిపారు. ఇక ప్రిక్వార్టర్స్ , క్వార్టర్స్‌లో వినేశ్ చేతిలో ఓడిన జపాన్ యూ సుసాకీ, ఉక్రెయిన్ ఒక్సానా లివాచ్ కాంస్య పతక పోరులో తలపడతారని పేర్కొన్నారు. #WATCH On Vinesh Phogat's disqualification, President of the Indian Olympic Association (IOA) PT Usha says, "Vinesh's disqualification is very shocking. I met Vinesh at the Olympic village polyclinic a short while ago and assured her complete support of the Indian Olympic… pic.twitter.com/hVgsPUb03y— ANI (@ANI) August 7, 2024 -
Olympics: హృదయం ముక్కలైన వేళ!.. ఎనిమిది సార్లు ఇలాగే..
ప్రతీ ఒక్క అథ్లెట్ అంతిమ లక్ష్యం ఒలింపిక్స్ పతకం సాధించడమే అనడంలో సందేహం లేదు. ఆశయాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా ధీటుగా నిలబడి కలను పండించుకుని.. మెడల్స్ మెడలో వేసుకునే వారు ‘విజేతలు’గా ప్రశంసలు అందుకుంటారు.అయితే.. గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా ఆవగింజంత అదృష్టం లేక ఆఖరి మెట్టుపై బోల్తా పడి నిరాశతో వెనుదిరిగిన వాళ్లు ‘పరాజితులు’గా మిగిలిపోతారు. ప్యారిస్ ఒలింపిక్స్-2024 నేపథ్యంలో.. అలా పతకం గెలిచే దిశగా వచ్చి ఓటమితో ముగించిన భారత క్రీడాకారుల గురించి తెలుసుకుందాం.ఫుట్‌బాల్ జట్టుమెల్బోర్న్ ఒలింపిక్స్-1956లో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టుకు ఇలాంటి పరాభవం ఎదురైంది. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను క్వార్టర్ ఫైనల్లో 4-2తో ఓడించిన భారత్ సెమీస్‌కు దూసుకువెళ్లింది.నాడు మన ఆటగాడు నివిల్లే డిసౌజా ఆసీస్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టి ఈ ఘనత సాధించిన తొలి ఆసియా ఫుట్‌బాలర్‌గా నిలిచాడు.సెమీ ఫైనల్లోనూ ఇదే జోరును కొనసాగిస్తాడని భావించిన వాళ్లకు నిరాశే ఎదురైంది. యుగోస్లేవియాతో సెమీస్‌లో భారత్ ఆరంభంలో గట్టిపోటీనిచ్చినా ద్వితీయార్థ భాగంలో అనూహ్యంగా పుంజుకుంది ప్రత్యర్థి. ఫలితంగా భారత్ ఓటమిపాలైంది.ఈ క్రమంలో కాంస్యం కోసం బల్గేరియా జట్టుతో పోటీపడ్డ భారత ఫుట్‌బాల్ టీమ్ 0-3తో ఓడి పతకాన్ని చేజార్చుకుంది.‘ఫ్లైయింగ్ సిఖ్’ హృదయం ముక్కలైన వేళ..రోమ్ ఒలింపిక్స్-1960లో భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ తృటిలో కాంస్య పతకం కోల్పోయాడు. 400 మీటర్ల పరుగు పందెంలో.. ప్రత్యర్థుల వేగాన్ని అంచనా వేసే క్రమంలో చూపు తిప్పిన మిల్కాకు అదే శాపమైంది.ప్రత్యర్థిని గమనించే క్రమంలో వేగం తగ్గించిన మిల్కా.. సెకనులో పదో వంతు తేడాతో వెనకబడి నాలుగోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తన జీవితంలో అత్యంత చేదు జ్ఞాపకంగా ఈ అనుభవం మిగిలిపోయింది.ఆ తర్వాత రెండేళ్లకు ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు గెలిచినా ఒలింపిక్ పతకం చేజారిన తీరును తాను మరువలేనని దివంగత మిల్కా సింగ్ గతంలో ఓం సందర్భంలో తెలిపారు. భారత మహిళా హాకీ జట్టు చేజారిన మెడల్1980లో తొలిసారిగా భారత మహిళా హాకీ జట్టు విశ్వ క్రీడల్లో పాల్గొంది. ఆ యేడు మాస్కోలో జరిగిన ఒలింపిక్స్‌కు నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్ వంటి మేటి జట్లు దూరంగా ఉన్నాయి.నాడు యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లికన్స్(యూఎస్ఎస్ఆర్) అఫ్గనిస్తాన్‌పై దురాక్రమణకు పాల్పడిన తీరును నిరసిస్తూ.. క్రీడల్లో పాల్గొనకుండా బాయ్‌కాట్ చేశాయి. ఈ క్రమంలో భారత మహిళా జట్టుకు పెద్దగా పోటీ లేకుండా పోవడంతో పతకంతో తిరిగి వస్తుందనే ఆశ చిగురించింది.అయితే, యూఎస్ఎస్ఆర్తో చివరగా తలపడ్డ భారత్ 1-3తో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.పరుగుల రాణికి చేదు అనుభవంలాస్ ఏంజెల్స్-1984 ఒలింపిక్స్‌లో ఉషపైనే భారత్ ఆశలు పెట్టుకుందిపెట్టుకుంది. అయితే, మిల్కా సింగ్ మాదిరే ఆమె కూడా తృటిలో పతకం చేజార్చుకుంది.400 మీటర్ల హార్డిల్స్ పోటీలో సెకనులో వందో వంతు తేడాతో వెనుకబడ్డ ఈ ‘పయ్యోలీ ఎక్స్‌ప్రెస్’ హృదయం ముక్కలైంది. రొమేనియాకు చెందిన క్రిస్టియానా కోజోకరో మూడోస్థానంలో నిలవగా.. పీటీ ఉష పతకం లేకుండా రిక్త హస్తాలతో వెనుదిరిగింది. టెన్నిస్‌లో చేజారిన కాంస్యంలాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరోసారి భారత్ కాంస్యానికి చేరువగా వచ్చింది. అయితే, పాత కథే పునరావృతమైంది.ఈసారి టెన్నిస్ మెన్స్ డబుల్స్‌లో భారత్‌కు పరాభవం ఎదురైంది. లియాండర్ పేస్- మహేశ్ భూపతి ద్వయం క్రొయేషియా జోడీ మారియో ఆన్సిక్- ఇవాన్ జుబిసిక్తో జరిగిన మారథాన్ మ్యాచ్‌లో 6-7 6-4 14-16 తేడాతో ఓడిపోయారు.కాంస్యం కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో ఓటమి ఎదురుకావడంతో నిరాశగా నిష్క్రమించారు. అంతకు ముందు సెమీస్‌లో జర్మనీ జంట నికోలస్ కీఫర్- రైనెర్ షట్లర్ చేతిలో పరాజయం పాలై ఫైనల్స్ చేరే సువర్ణావకాశం చేజార్చుకున్నారు పేస్- భూపతి.ఇక ఇదే ఒలింపిక్స్‌లో భారత మహిళా వెయిట్ లిఫ్టర్ కుంజరాణి దేవీ సైతం 48 కేజీల విభాగంలో ఫైనల్ అటెంప్ట్‌లో డిస్క్వాలిఫై అయింది.మొత్తంగా 190 కిలోలు ఎత్తిన కుంజరాణి బ్రాంజ్ మెడలిస్ట్ ఆరీ విరాథ్వార్న్(థాయిలాండ్) కంటే పది కేజీలు తక్కుగా లిఫ్ట్ చేసినందుకు పతకానికి దూరమైంది.లండన్ ఒలింపిక్స్‌లోనూ ఇలాగేఈసారి షూటింగ్లో భారత్ పతకానికి చేరువగా వచ్చింది. జోయ్‌దీప్ కర్మాకర్ మెన్స్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో ఫైనల్ చేరాడు. బ్రాండ్ మెడల్ విజేత కంటే 1.9 పాయింట్లు వెనుకబడి కాంస్యం గెలిచే అవకాశం పోగొట్టుకున్నాడు.మరో‘సారీ’ ఇదే ‘కర్మ’ భారత్ నుంచి ఒలింపిక్స్‌లో తొలిసారిగా జిమ్నాస్టిక్స్ విభాగంలో తలపడిన మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్. రియో డి జెనిరో-2016 ఒలింపిక్స్‌లో అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ త్రిపుర అమ్మాయి.. నాలుగో స్థానంలో నిలిచింది.కాంస్యం గెలిచిన అమ్మాయి.. దీపా స్కోరు చేసిన పాయింట్లకు వ్యత్సాసం 0.150 కావడం గమనార్హం.టోక్యోలోనూ కలిసిరాలేదుదాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత టోక్యో ఒలింపిక్స్-2020లో భాగంగా భారత మహిళా హాకీ జట్టు మరోసారి పతకం గెలిచే అవకాశం ముంగిట నిలిచింది.క్వార్టర్ ఫైనల్లో అనూహ్య రీతిలో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టిన రాణీ రాంపాల్ బృందంపై ప్రశంసల జల్లు కురిసింది.అయితే, కీలకమైన సెమీస్‌లో అర్జెంటీనా చేతిలో ఓటమి తప్పలేదు. దీంతో స్వర్ణం ఆశ చేజారినా.. కాంస్యం గెలుస్తారనే నమ్మకం మాత్రం చావలేదు.అయితే, గ్రేట్ బ్రిటన్ జట్టు భారత్ ‘కంచు’ ఆశలపై నీళ్లు చల్లింది. 4-3తో ఓడించి కాంస్యాన్ని ఎగురేసుకుపోయింది. ఈ ఓటమితో భారత జట్టుతో పాటు వంద కోట్లకు పైగా భారతీయుల హృదయాలూ ముక్కలయ్యాయి.ఇదే ఒలింపిక్స్‌లో గోల్ఫర్ అదితి అశోక్ కూడా ఇలాగే నాలుగో స్థానంతో సరిపెట్టుకుని చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోయింది.ఇప్పటి వరకు ఎన్ని పతకాలంటే..విశ్వ క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 35 పతకాలు గెలిచింది. భారత హాకీ పురుషుల జట్టు 1928- 1956 మధ్య కాలంలో వరుసగా ఆరుసార్లు పసిడి పతకాలు గెలిచింది.ఆ తర్వాత 1964, 1980లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఇక మళ్లీ షూటర్ అభినవ్ బింద్రా, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మాత్రమే భారత్‌కు పసిడి అందించారు.చదవండి: పక్షవాతాన్ని జయించి.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో టీమిండియా స్టార్! -
Paris Olympics: మేరీ కోమ్ రాజీనామా.. కారణం ఇదేనన్న పీటీ ఉష
భారత దిగ్గజ బాక్సర్, వరల్డ్ మాజీ చాంపియన్ మేరీ కోమ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో ఇండియా చెఫ్ డీ మిషన్ బాధ్యతల నుంచి వైదొలిగారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా మేరీ కోమ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష ధ్రువీకరించారు. తనను చెఫీ డీ మిషన్ బాధ్యతల నుంచి తప్పించాలంటూ మేరీ కోమ్ లేఖ రాసినట్లు వెల్లడించారు. ఈ మేరకు.. ‘‘దేశానికి సేవ చేసే ఏ అవకాశాన్నైనా నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తాను. ఈ బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వర్తించడానికి మానసికంగా సంసిద్ధమయ్యాను. కానీ ఇప్పుడు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. నా వ్యక్తిగత కారణాల దృష్ట్యా మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇలా చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ ఇంతకంటే నాకు వేరే మార్గం కనిపించడం లేదు. ఒలింపిక్స్‌లో నా దేశం తరఫున ఆడే అథ్లెట్లందరికీ ఎల్లవేళలా మద్దతుగా ఉంటాను’’ అని 41 ఏళ్ల మేరీ కోమ్ పీటీ ఉషకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొననున్న భారత జట్టుకు మెంటార్‌గా సేవలు అందించేందుకు చెఫ్ డీ మిషన్‌గా మేరీ కోమ్‌ను నియమించింది ఒలింపిక్ అసోసియేషన్. మార్చి 21న ఇందుకు సంబంధించి ప్రకటన చేసింది. అయితే, తాజాగా మేరీ కోమ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో మేరీ కోమ్ రాజీనామానకు ఆమోదించామని.. ఆమె స్థానంలో కొత్త వారిని త్వరలోనే నియమిస్తామంటూ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉష ప్రకటించారు. కాగా మణిపూర్‌కు చెందిన మేరీ కోమ్.. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచారు. 2021 లండన్ ఒలింపిక్స్‌లో ఈ లెజెండరీ బాక్సర్ కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. -
2036 ఒలింపిక్స్‌కు భారత్ బిడ్ వేయాలి: పీటీ ఉష
హాంగ్జౌ: ఆసియా క్రీడల చరిత్రలోనే భారత క్రీడా బృందం ఈసారి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, అత్యధికంగా 107 పతకాలు సాధించడంపట్ల భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష ఆనందం వ్యక్తం చేసింది. ‘ఆసియా క్రీడల్లో రికార్డుస్థాయి ప్రదర్శన తర్వాత భారత క్రీడాకారులు వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌పై దృష్టి సారించాలి. మన క్రీడాకారులు, కోచ్‌లు, జాతీయ క్రీడా సమాఖ్యలు శ్రమిస్తే పారిస్ ఒలింపిక్స్‌లో మన పతకాల సంఖ్య కచ్చితంగా రెండంకెలు దాటుతుంది. ఇక మనం కూడా ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం బిడ్ వేయాల్సిన సమయం ఆసన్నమైంది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం భారత్ పోటీపడాలి’ అని 59 ఏళ్ల పీటీ ఉష వ్యాఖ్యానించింది. కేవలం ఒకట్రెండు క్రీడాంశాల్లో కాకుండా వేర్వేరు క్రీడాంశాల్లో భారత్‌కు పతకాలు రావడంపట్ల రాజ్యసభ సభ్యురాలైన ఉష ఆనందాన్ని వ్యక్తం చేసింది. -
Indian Wrestlers' Protest: విమర్శలపాలై.. ఆలస్యంగానైనా వచ్చిన ఉష! కానీ చేదు అనుభవం!?
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై తాము చేసిన లైంగిక ఆరోపణల విషయంలో మహిళా రెజ్లర్లు తమ వాదనలకు సంబంధించి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే తాము ఈ సమాచారాన్ని గురువారం సీల్డ్ కవర్లో అందిస్తామని ఏడుగురు రెజ్లర్లు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన బెంచీ దీనికి అంగీకరించింది. ఈ అఫిడవిట్ కాపీని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు కూడా అందించేందుకు తాము సిద్ధమని, అయితే దీనిని బహిరంగపర్చవద్దని రెజ్లర్ల తరఫు న్యాయవాది కోరారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది కాబట్టి విచారణాధికారికి మాత్రం దీనిని అందించవచ్చా అని మెహతా అడగ్గా... అభ్యంతరం లేదని బెంచీ సభ్యులు స్పష్టం చేశారు. గత శుక్రవారం బ్రిజ్‌భూషణ్‌పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. హామీ ఏమీ లేదు! భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష ఎట్టకేలకు రెజ్లర్లను కలిసింది. గత వారం రెజ్లర్ల నిరసన కారణంగా దేశం పరువు పోతోందంటూ వ్యాఖ్య చేసి విమర్శలపాలైన ఉష తాజా భేటీ ఆసక్తిని రేపింది. వారితో ఏం చర్చించిందనే అంశంపై పూర్తి స్పష్టత లేకున్నా... అధికారికంగా ఐఓఏ అధ్యక్షురాలి హోదాలో ఉష నుంచి రెజ్లర్లకు ఎలాంటి హామీ మాత్రం లభించలేదు. పీటీ ఉషకు చేదు అనుభవం ‘ఆలస్యంగానైనా ఉష ఇక్కడకు రావడాన్ని స్వాగతిస్తున్నాం. తాను గతంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఐఓఏ అధ్యక్షురాలికంటే ముందు తాను అథ్లెట్‌నని ఆమె చెప్పారు. మాకు న్యాయం కావాలని, రెజ్లింగ్ మేలు కోసమే ఇదంతా చేస్తున్నామని చెప్పాం. మా పరిస్థితి చూస్తే బాధేస్తుందంటూ సంఘీభావం తెలిపారు. అయితే తక్షణ పరిష్కారం గురించి మాత్రం ఆమె ఏమీ చెప్పలేదు’ అని రెజ్లర్లు వెల్లడించారు. మరోవైపు ఉషపై ఒక మహిళ దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఉషపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెంపదెబ్బ కొట్టినట్లుగా ఒక వీడియో కనిపిస్తున్నా... దానిపై స్పష్టత లేదు. మరోవైపు బుధవారం రాత్రి రెజ్లర్లు నిరసన చేస్తున్న జంతర్ మంతర్ వద్దకు ఢిల్లీ పోలీసులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అక్కడి నుంచి రెజ్లర్లను తరలించడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, రెజ్లర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చదవండి: ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ అథ్లెట్.. 32 ఏళ్ల టోరి బోవి హఠాన్మరణం The Castiest frauds asked their Castiest goons to attack Legendary PT Usha at Jantar Mantar Whole Wrestling protest at jantar mantar is a propaganda and all of them are Liars and frauds pic.twitter.com/Fysm2yAp7d — Khushi Singh (@KhushiViews) May 3, 2023 -
దేశ ప్రతిష్టతను దిగజారుస్తున్నారు.. పీటీ ఉష ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తమకు న్యాయం చేయాలంటూ దేశ రాజధానిలో ఐదు రోజులుగా నిరసన కొనసాగిస్తున్న అగ్రశ్రేణి రెజ్లర్లకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నుంచి అనూహ్య స్పందన ఎదురైంది. వారి తీరును తప్పుపడుతూ ఐఓఏ అధ్యక్షురాలు, దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వారు వీధుల్లోకి వెళ్లకుండా ఉండాల్సిందని ఆమె సూచించింది. ‘లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు ఐఓఏలో ఒక కమిటీతో పాటు అథ్లెటిక్స్ కమిషన్ కూడా ఉంది. వారంతా వీధుల్లోకి వెళ్లకుండా మా వద్దకు రావాల్సింది. కానీ వారు అలా చేయలేదు. కొంత క్రమశిక్షణ కూడా అవసరం. వారు చేస్తున్న పని ఆటకు మంచిది కాదు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు మంచి పేరు ఉంది. ఇలాంటి నిరసనల వల్ల దేశం పరువు పోతోంది. ఈ తరహా ప్రతికూల ప్రచారం దేశానికి మంచిది కాదు. ఏదైనా చట్టప్రకారం ఉండాలి. వారంతా ధర్నాలో కూర్చొని రాజకీయ పార్టీల మద్దతు కోరడం నన్ను తీవ్రంగా నిరాశపరుస్తోంది’ అని పీటీ ఉష అభిప్రాయపడింది. ఉష మాటలపై స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘ఆమె స్వయంగా ఒక అథ్లెట్. పైగా మహిళ కూడా. మేం ఆమె మద్దతు కోరుకున్నాం. కానీ ఆమె నుంచి ఇలాంటి తీవ్రమైన స్పందన ఊహించలేదు. రెజ్లర్ల చర్య వల్ల భారత్ పరువు పోతోంది అని భావిస్తే గతంలో తన అకాడమీలో కొందరు గూండాలు తనను వేధిస్తున్నారంటూ ఆమె అందరి ముందు ఏడవలేదా. అప్పుడేం జరిగింది’ అంటూ బజరంగ్ గుర్తు చేశాడు. వారికీ అవకాశమిచ్చాం: క్రీడల మంత్రి ఠాకూర్ రెజ్లర్ల సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ నిష్పక్షపాతంగా విచారణ జరుపుతోందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. తమ వైపు నుంచి అన్ని విషయాలను వెల్లడించేందుకు రెజ్లర్లకు తగినంత అవకాశం ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. మూడు నెలల క్రితం తొలిసారి వారు నిరసన జరిపినప్పుడు తాను స్వయంగా 12 గంటల పాటు వారితో చర్చలు జరిపానని... విచారణ కమిటీ 14 సార్లు సమావేశాలు నిర్వహించి ఆటగాళ్లు తమ బాధలు చెప్పుకునే అవకాశం ఇచ్చిందని ఠాకూర్ అన్నారు. -
బీచ్‌లో పరిగెడితే ఆట పట్టించారు.. కట్‌చేస్తే 'పరుగుల రాణి'గా
దాదాపు నాలుగున్నర దశాబ్దాల కిందటి మాట.. పయ్యోలి బీచ్‌లో ఆ అమ్మాయి పరుగు తీస్తుంటే అంతా ఆశ్చర్యంగా చూసేవారు. ఆమె ఎటు వైపు వెళితే అటు వైపు వారు ఆమెను అనుసరించేవారు. కొందరు చిన్న పిల్లలయితే ఆట పట్టించేవారు కూడా. షార్ట్స్‌లో ఒకమ్మాయి పరుగెత్తడం అదో వింతగా అనిపించింది. అసలు ఆ సమయంలో ఎవరూ క్రీడలను సీరియస్‌గా పట్టించుకోనేలేదు. తర్వాతి రోజుల్లో ఆ అమ్మాయి భారత అథ్లెటిక్స్‌కు కొత్త దారి చూపించింది. ఎవరూ అందుకోలేని రీతిలో చిరస్మరణీయ ఘనతలు నమోదు చేసింది. దాదాపు ఇరవై ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో స్ప్రింటర్‌గా, హర్డ్‌లర్‌గా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీనేజర్లు దూసుకొచ్చిన సమయంలోనూ 35 ఏళ్ల వయసులో కొత్త జాతీయ స్ప్రింట్ రికార్డును నెలకొల్పగలిగింది. అంటే ఆ ప్లేయర్ సత్తాను అర్థం చేసుకోవచ్చు. ఆ స్టార్ పేరే పిళవుళకంది తెక్కెరపరంబిల్ ఉష.. అందరికీ తెలిసిన పీటీ ఉష. పరుగెత్తుతూ కనిపించిన ప్రతి అమ్మాయికి ఒక దశలో సర్వనామంగా మారిపోయిన పేరు. అథ్లెటిక్స్‌లో ప్రతిభావంతులను గుర్తించడంలో కోచ్ మాధవన్ నంబియార్‌కు మంచి పేరుంది. ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసిన ఆయన వద్ద క్రమశిక్షణ కూడా అదే తరహాలో ఉండేది. అలాంటి వ్యక్తి ఒక అమ్మాయిలో అపార, సహజ ప్రతిభ ఉందని గుర్తించాడు. దానికి తన శిక్షణ, క్రమశిక్షణ తోడైతే అద్భుతాలు సాధించవచ్చని గ్రహించాడు. నిజంగా కూడా అదే జరిగింది. ఆయన ఎంపిక చేసిన పీటీ ఉష ఆయన అంచనాను వాస్తవంగా మార్చింది. నంబియార్–ఉషల కోచ్–ప్లేయర్ జోడీ సూపర్ సక్సెస్‌గా నిలిచింది. ఆ సమయంలో ఉష వయసు తొమ్మిదేళ్లు. పాఠశాలలో జరిగిన రన్నింగ్ రేస్‌లో తనకంటే మూడేళ్లు పెద్ద అయిన సహచర విద్యార్థులను అలవోకగా ఓడించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. రాబోయే కొన్నేళ్లలో ఈ అమ్మాయి దేశం గర్వించదగ్గ అథ్లెట్ అవుతుందన్న విషయం అప్పుడు ఎవరికీ తెలీదు. కానీ కొద్ది రోజుల తర్వాత కేరళ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ స్కూల్ మొదటి మ్యాచ్‌లో చేరిన ఉష రివ్వుమని దూసుకుపోయింది. కోళికోడ్ జిల్లా కూతలిలో పుట్టిన ఉష ఆ తర్వాత సమీపంలోనే పయ్యోలిలో స్థిర పడింది. అక్కడి నుంచే అగ్రస్థానానికి ఎదిగిన ఆమె ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస్’ పేరుతో తన పేరుకు, ఊరి పేరుకు శాశ్వత కీర్తిని కల్పించుకుంది. అవార్డులు, రివార్డులు, డాక్టరేట్లు ఎన్ని అందుకున్నా ఏనాడూ వివాదంగా మారకుండా, దరిచేరనివ్వకుండా అందరికీ ఆత్మీయురాలిగా, స్ఫూర్తిగా నిలుస్తూనే ఆమె కెరీర్‌ను ముగించింది. అలా మొదలు.. రాష్ట్రస్థాయి విజయాల తర్వాత ఉష ఆట స్థాయి మరింత పెరిగింది. 14 ఏళ్ల వయసులో ఇంటర్ స్టేట్ జూనియర్ మీట్లో పాల్గొన్న ఉష 4 స్వర్ణ పతకాలు గెలుచుకొని అందరి దృష్టి తనపై పడేలా చేసింది. కేరళ కాలేజ్ మీట్లోనైతే ఏకంగా 14 పతకాలు ఆమె ఖాతాలో చేరాయంటే ఆధిపత్యం ఎలాంటిదో ఊహించవచ్చు. మరో ఏడాది తర్వాత జాతీయ క్రీడల్లో రెండు స్వర్ణాలతో ఉష మెరిసింది. ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఏ పోటీలు ఉన్నా సరే.. అది ఇంటర్ స్టేట్ మీట్ కానీ, ఓపెన్ నేషనల్ చాంపియన్‌షిప్ కానీ.. అథ్లెట్లు ఇక రెండో స్థానం కోసమే పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చేసిందంటే ఉష ఆధిపత్యం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఉష సన్నిహితులు, కోచ్‌లు ఎట్టకేలకు ఎదురు చూసిన క్షణం 1980లో వచ్చింది. మాస్కో ఒలింపిక్స్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో 16 ఏళ్ల ఉషకు చోటు దక్కింది. తద్వారా ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె నిలిచింది. ఈ మెగా ఈవెంట్లో 100 మీటర్ల పరుగులో ఉష ఫైనల్స్‌కు చేరడంలో విఫలమైనా.. తొలి ఒలింపిక్స్‌లో తగినంత అనుభవాన్ని ఆమె దక్కించుకుంది. ఆసియా క్వీన్‌గా.. అంతర్జాతీయ వేదికపై ఉష గొప్పగా చెప్పుకోగలిగే తొలి విజయం 1983లో వచ్చింది. 19 ఏళ్ల వయసులో అమితోత్సాహంతో ఆసియా చాంపియన్‌షిప్ (కువైట్ సిటీ)లో పాల్గొన్న ఉష 400 మీటర్ల పరుగులో స్వర్ణపతకంతో మెరిసింది. అది మొదలు 1998 (ఫుకోకా) వరకు దాదాపు 15 ఏళ్ల పాటు ఆసియా చాంపియన్‌షిప్‌లో ఉష హవా కొనసాగింది. ఈ మధ్య కాలంలో ఆమె ఈ ఈవెంట్లో ఏకంగా 14 స్వర్ణ పతకాలు గెలుచుకోవడం విశేషం. దీంతో పాటు మరో 6 రజతాలు, 3 కాంస్యాలు కూడా సాధించడంలో ఉష సఫలమైంది. మొత్తం 23 పతకాలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఆమె నిలిచింది. ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో వరుసగా నాలుగు పర్యాయాలు ఉష పతకాలు గెలుచుకోవడంలో సఫలమైంది. కెరీర్ ఆరంభ దశలో 1982 ఢిల్లీ ఆసియా క్రీడల్లో 100 మీ., 200 మీ. పరుగులో రెండు రజత పతకాలు సాధించి ఉష ఆసియా వేదికపై మొదటి సారి తన ముద్రను చూపించింది. 1990 బీజింగ్ ఆసియా క్రీడల్లో మూడు రజతాలు గెలుచుకున్న ఉష.. కెరీర్ చివర్లో 1994 హిరోషిమా ఏషియాడ్‌లో కూడా మరో రజతాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే వీటన్నింటినీ మించి ఉష పేరును భారత్‌లో ఇంటింటికీ చేర్చిన ఘనత, అథ్లెటిక్స్‌లో అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచిన ఘట్టం 1986 సియోల్ ఆసియా క్రీడలే. ఈ పోటీల్లో ఉష ఏకంగా నాలుగు స్వర్ణ పతకాలు సాధించి సంచలనం సృష్టించింది. 200 మీ., 400 మీ. పరుగుతో పాటు 400 మీ. హర్డిల్స్, 4X400 మీ. రిలేలో ఆమె పరుగు పసిడి కాంతులు అందించింది. 100 మీటర్ల పరుగులో త్రుటిలో స్వర్ణం చేజారగా వచ్చిన రజతంతో ఐదో పతకం ఉష మెడలో వాలింది. ముగింపు ప్రస్థానం.. లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ ప్రదర్శనను మరో నాలుగేళ్ల తర్వాత 1988 సియోల్ ఒలింపిక్స్‌లో ఉష పునరావృతం చేయలేకపోయింది. ఆ తర్వాత వరుస గాయాలు ఇబ్బంది పెట్టడంతో 1990లోనే ఆమె రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే కబడ్డీ మాజీ ఆటగాడైన భర్త శ్రీనివాసన్ ప్రోత్సాహంతో మళ్లీ ప్రాక్టీస్ చేసి ట్రాక్‌పై అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్స్‌లో పతకాలతో తనేంటో చూపించింది. చివరకు 2000 సిడ్నీ ఒలింపిక్స్‌కు కొద్ది రోజుల ముందు ఆటకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పింది. ఒలింపిక్స్ పతకం మినహా తాను అన్నీ సాధించానని, వాటితో సంతృప్తి చెందానని ఉష వెల్లడించింది. సెకన్ లో 1/100 వంతు తేడాతో.. ఉష కెరీర్లో ఎప్పటికీ మరచిపోలేని క్షణం 1984 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో వచ్చింది. సరిగ్గా చెప్పాలంటే ఒక వైపు ఆనందం, మరో వైపు బాధ కలగలిసిన సమయం అది. ఆ సమయంలో ఉష అత్యుత్తమ ఫామ్‌లో, అద్భుతమైన ఫిట్నెస్తో ఉంది. ఒలింపిక్స్‌లో ఆమెకు పతకం ఖాయం అనిపించింది. 400 మీటర్ల హర్డిల్స్‌లో 55.42 సెకన్లతో ఆమె భారత్ తరఫున అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసింది. అయితే సెకనులో వందో వంతు తేడాతో కాంస్యపతకం చేజారింది. ఫాల్స్ స్టార్ట్ చేసినా దానిని అధిగమించి చివరి 100 మీటర్ల పరుగును స్ప్రింట్ తరహాలో పరుగెత్తినా, ఫినిష్ లైన్ వద్ద తన ఛాతీ భాగాన్ని ముందుకు వంచడంలో విఫలం కావడంతో ‘ఫోటో ఫినిష్’లో నాలుగో స్థానమే దక్కింది. ‘అది నా అత్యుత్తమ ప్రదర్శన. అతి స్వల్ప తేడాతో నేను ఒలింపిక్స్ పతకం కోల్పోయానంటే నమ్మలేకపోతున్నాను. ఆ రేస్ తర్వాత చాలా ఏడ్చేశాను’ అని ఉష తర్వాత చెప్పుకుంది. చెరగని రికార్డు 1985లో జకార్తాలో జరిగిన ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్‌షిప్‌లో ఉష ఏకంగా ఐదు స్వర్ణాలు (100మీ., 200మీ., 400మీ., 400మీ.హర్డిల్స్, 4X400మీ. రిలే) గెలుచుకుంది. ఒకే ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో అత్యధిక స్వర్ణాలు గెలిచిన మహిళగా ఉష రికార్డు నమోదు చేసింది. అది ఇప్పటికీ ప్రపంచ రికార్డుగానే ఉండటం విశేషం. - మహమ్మద్ అబ్దుల్ హాది -
‘నా అకాడమీని ఆక్రమిస్తున్నారు’
తిరువనంతపురం: అథ్లెటిక్ దిగ్గజం, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష కన్నీళ్ల పర్యంతమైంది. కోజికోడ్‌లోని తన అకాడమీలో ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడి భద్రతపై కూడా ఉష తన బాధను వెల్లడించింది. ‘నా అకాడమీ మధ్యలోనే అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. మేం బౌండరీ నిర్మించుకునేందుకు కూడా అడ్డు పడుతున్నారు. అదేమని అడిగితే దురుసుగా మాట్లాడుతూ బెదిరిస్తున్నారు. దీనిపై కేరళ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశా ను. ఆయన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. నా అకాడమీలోని 25 మంది మహిళా అథ్లెట్లలో 11 మంది ఉత్తరాదికి చెందినవారు. వారి భద్రత మాకు ముఖ్యం’ అని ఉష పేర్కొంది. సుమారు 30 ఎకరాల ఈ అకాడమీ స్థలాన్ని కేరళలోని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉషకు 30 సంవత్సరాల కాలానికి లీజుకు ఇచ్చింది. గత జూలైలో రాజ్యసభకు నామినేట్ అయిన తర్వాత తనపై ఇలాంటి వేధింపులు పెరిగాయని ఉష చెబుతోంది. దురదృష్టవశాత్తూ ప్రతీ రాజకీయ పార్టీ తనను మరో పార్టీ సానుభూతిపరురాలిగా చూస్తోందని, అయితే తనకు ఎలాంటి రాజకీయాలు తెలియవని ఉష తన బాధను ప్రకటించింది. -
ఐవోఏకు లేఖ.. పీటీ ఉష చెంతకు పంచాయతీ
ఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళన మూడోరోజు కొనసాగింది. ఈ వ్యవహారంపై గురువారం కేంద్రంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆందోళనను మరింత ఉదృతం చేసిన రెజ్లర్లు శుక్రవారం భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉషకు లేఖ చేశారు. రెజ్లింగ్ సమాఖ్యలో జరుగుతున్న అవకతకవలు, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెజ్లర్లు పీటీ ఉషకు రాసిన లేఖలో ప్రధానంగా నాలుగు డిమాండ్లను నివేధించారు. కాగా ఐవోఏ ప్రెసిడెంట్ పీటీ ఉష ఈ వ్యవహారంపై స్పందించింది. ఈ అంశం తనకు బాధ కలిగించిందని.. బాగా డిస్టర్బ్ చేసిందన్నారు. రెజ్లర్లు రాసిన లేఖ తనకు అందిందని.. దీనిపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఐవోఏ ముందు రెజ్లర్లు ఉంచిన నాలుగు ప్రధాన డిమాండ్లు ► లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు తక్షణమే కమిటీని ఏర్పాటు చేయాలి. ► డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవికి బ్రిజ్‌భూషణ్ వెంటనే రాజీనామా చేయాలి. ► భారత రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేయాలి ► డబ్ల్యూఎఫ్ఐ కార్యకలాపాలను కొనసాగించేందుకు రెజ్లర్లను సంప్రదించి ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేయాలి @PMOIndia @AmitShah @ianuragthakur @PTUshaOfficial pic.twitter.com/PwhJjlawPg — Vinesh Phogat (@Phogat_Vinesh) January 20, 2023 రాజీనామా చేసే ప్రస్తకే లేదు: బ్రిజ్ భూషణ్ అంతకముందు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు.. ఎంపీ బ్రిజ్ భూషణ్ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఇదంతా కేవలం రాజకీయ కుట్రలో భాగమే అని ఆరోపించిన ఆయన రాజీనామా చేసే ప్రస్తక్తే లేదని తేల్చి చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడినట్లు వస్తున్న వార్తలను బ్రిజ్ భూషణ్ కొట్టిపారేశారు.ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ప్రెస్మీట్లో మాట్లాడనున్నట్లు తెలిపారు. హర్యానాకు చెందిన 300 మంది అథ్లెట్లు తమ వద్ద ఉన్నారని బ్రిజ్ మీడియాకు తెలిపారు. చదవండి: ‘సాయ్’ స్పందన సరిగా లేదు రెజ్లర్ల మీటూ ఉద్యమం..చర్చలు విఫలం!.. ఉత్కంఠ -
ఎంపీ విజయసాయి రెడ్డికి కీలక బాధ్యతలు
-
రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్లుగా ఎంపీ విజయసాయిరెడ్డి, పీటీ ఉష నియమితులయ్యారు. రాజ్యసభలో ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్ ప్రకటించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి, పిటీ ఉషను ఎంపీలు అభినందించారు. తొలిసారిగా నామినేటెడ్ ఎంపీని ప్యానెల్ వైస్ చైర్మన్‌గా నియమించినట్లు ఛైర్మన్ వెల్లడించారు. చదవండి: Lok Sabha: రాష్ట్రాల అప్పుల వివరాలు ఇవిగో.. -
చరిత్ర సృష్టించిన దిగ్గజ అథ్లెట్.. కీలక పదవిలో పీటీ ఉష! ఏకగ్రీవ ఎన్నిక
PT Usha: దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా ఎన్నిక కానుంది. 58 ఏళ్ల ఉష ఆదివారం అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసింది. నామినేషన్ల సమర్పణకు ఆదివారమే ఆఖరి రోజు. అయితే, ఉష మినహా మరెవరూ ఈ పదవికి నామినేషన్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఐఓఏ ప్రెసిడెంట్‌గా పీటీ ఉష ఏకగ్రీవ ఎన్నిక ఖాయమైంది. ఇక ఈ పదవి అధిరోహించనున్న మొదటి మహిళగా ఈ దిగ్గజ అథ్లెట్ చరిత్ర సృష్టించడం విశేషం. అయితే ఐఓఏలోని మిగతా 12 పదవుల కోసం 24 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వచ్చే నెల 10న ఐఓఏ ఎన్నికలు జరుగుతాయి. పరుగుల రాణి.. తృటిలో పతకం చేజారినా కాగా కేరళకు చెందిన పీటీ ఉష సుమారు రెండున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘంగా ‘పరుగు’ప్రయాణాన్ని కొనసాగించింది. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ప్రపంచ వేదికలపై భారత్ సత్తా చాటిచెప్పింది. ఇక 25 ఏళ్ల కెరీర్లో పలు జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో మొత్తంగా 102 పతకాలను గెలుచుకుంది ఉష. అయితే, లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ (1984)లో 400 మీటర్ల హర్డిల్స్‌లో త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే.. క్రీడా రంగంలో తన వంతు సేవ చేసిన ఉష.. ఇటీవలే రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs NZ: అసలేం చేస్తున్నారు.. టీమిండియాను భ్రష్టు పట్టించకండి: నెహ్రా ఘాటు వ్యాఖ్యలు! కోచ్‌గా లక్ష్మణ్.. ICC WC Super League: వర్షం చేసిన మేలు! టాప్‌లో టీమిండియా.. లంకకు షాకిచ్చి ముందుడుగు వేసిన అఫ్గనిస్తాన్ -
ఎంపీగా పరుగుల రాణి ప్రమాణం.. సంతోషంగా ఉందంటూ ప్రధాని ట్వీట్
ఇటీవలే రాజ్యసభకు నామినేట్ అయిన పరుగుల రాణి, మాజీ అథ్లెట్ పీటీ ఉష ఇవాళ (జూలై 20) ఉదయం పార్లమెంట్ భవనంలో ప్రమాణం చేశారు. రాజ్యసభ స్పీకర్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీని పీటీ ఉష కలిశారు. ఈ సందర్భంగా వారు కలిసి దిగిన ఫోటోను ప్రధాని ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. పార్లమెంట్లో పీటీ ఉషను కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. Glad to have met PT Usha Ji in Parliament. @PTUshaOfficial pic.twitter.com/maRxU3cfYb — Narendra Modi (@narendramodi) July 20, 2022 కాగా, దక్షిణాదికి చెందిన నలుగురు ప్రముఖులను భారతీయ జనతా పార్టీ ఇటీవలే పెద్దల సభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. పీటీ ఉష (కేరళ)తో పాటు తమిళనాడు నుంచి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయారాజా, కర్ణాటక నుంచి ధర్మస్థల ఆలయ పాలక మండలి అధినేత, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్గడే, ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ కథా రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌లను బీజేపీ రాష్ట్రపతి కోటాలో ఎగువసభకు నామినేట్ చేసింది. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తర్వాత క్రీడా విభాగం నుంచి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయిన వ్యక్తి పీటీ ఉషనే కావడం విశేషం. చదవండి: పెద్దల సభకు పరుగుల రాణి -
పెద్దల సభకు పరుగుల రాణి
ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ప్రపంచ వేదికలపై భారత్ సత్తా చాటిన అథ్లెట్ పీటీ ఉష. చిరుత కూడా చిన్నబోయే వేగం ఉష సొంతం. ట్రాక్‌పై ఆమె అడుగు పెట్టిందంటే పందెం కోడె! అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో ఉష ప్రతిభ ఎన్నో పతకాలను తెచ్చిపెట్టింది. అమ్మాయిలకు చదువెందుకనే ఆ రోజుల్లో ఆటల పోటీల్లోకి వెళ్లడమంటే సాహసం. అలాంటి పరిస్థితుల్లో ‘పయ్యోలి’అనే పల్లెటూరులో నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది. ప్రపంచవేదికపై ‘పరుగుల రాణి’గా నిలిచింది. పతకాలతో ‘గోల్డెన్ గర్ల్’గా మారింది. ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస్’గా ఎదిగింది. ఆమె పరుగు ఎందరో అమ్మాయిలకు ప్రేరణ. ఊరి పేరునే.. ఇంటిపేరుగా మార్చుకున్న పయ్యోలి తెవరపరంపిల్ ఉష (పీటీ ఉష) 1976 నుంచి 2000 వరకు రెండున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘంగా ‘పరుగు’ప్రయాణాన్ని కొనసాగించింది. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 4–400 మీటర్ల రిలే, 400 మీటర్ల హర్డిల్స్‌లో అలుపెరగని పరుగుతో దిగ్గజ అథ్లెట్‌గా ఎదిగింది. 25 ఏళ్ల కెరీర్లో జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో ఉష మొత్తం 102 పతకాలను గెలుచుకుంది. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ (1984)లో 400 మీటర్ల హర్డిల్స్‌లో త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. The remarkable PT Usha Ji is an inspiration for every Indian. Her accomplishments in sports are widely known but equally commendable is her work to mentor budding athletes over the last several years. Congratulations to her on being nominated to the Rajya Sabha. @PTUshaOfficial pic.twitter.com/uHkXu52Bgc— Narendra Modi (@narendramodi) July 6, 2022 కానీ అంతకుముందు... ఆ తర్వాత జరిగిన ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌లలో ఎదురేలేని స్ప్రింటర్‌గా ఎదిగింది. ప్రత్యేకించి 1985 నుంచి 1989 వరకు కువైట్, జకార్తా, సియోల్, సింగపూర్, న్యూఢిల్లీల్లో జరిగిన ఆసియా పోటీల్లో ఆమె 16 స్వర్ణాలు (ఓవరాల్‌గా 18 బంగారు పతకాలను) సాధించింది. కెరీర్ తదనంతరం అకాడమీ నెలకొల్పి.. తన జీవితాన్నే భారత అథ్లెటిక్స్‌కి అంకితం చేసింది. ఆమె సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం 1984లో ‘అర్జున అవార్డు’తో పాటు ‘పద్మశ్రీ’పురస్కారాన్ని అందజేసింది. 58 ఏళ్ల ఉష తాజాగా రాజ్యసభకు నామినేట్ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ ఉష పేరును ఎగువసభకు ప్రతిపాదించారు. ఉష ప్రతి భారతీయుడికి స్ఫూర్తిప్రదాత అని మోదీ స్వయంగా ట్వీటర్ వేదికగా శుభాకంక్షలు తెలిపారు. ఉష (కేరళ) సహా తమిళనాడు నుంచి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయారాజా, కర్ణాటక నుంచి ధర్మస్థల ఆలయ పాలక మండలి అధినేత, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్గడే, ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ కథా రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌లను బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ ఎగువసభకు నామినేట్ చేసింది. -
రాజ్యసభకు నలుగురు దక్షిణాది ప్రముఖులు
న్యూఢిల్లీ: దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు పెంచుకొని, కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు పన్నుతున్న భారతీయ జనతా పార్టీ అందులో భాగంగా మరో అస్త్రం సంధించింది. నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నలుగురు ప్రముఖులను రాజ్యసభకు పంపిస్తూ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ నుంచి ప్రముఖ అథ్లెట్ పీటీ ఉషా, తమిళనాడు నుంచి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయారాజా, కర్ణాటక నుంచి ధర్మస్థల ఆలయ పాలక మండలి అధినేత, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్గడే, ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ కథా రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌ను పార్లమెంట్ ఎగువసభకు నామినేట్ చేసింది. పెద్దల సభలో అడుగుపెట్టబోతున్న నలుగురు ప్రముఖులకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. సంబంధిత రంగాల్లో వారు అందించిన సేవలను కొనియాడారు. పీటీ ఉషా ప్రతి భారతీయుడికి స్ఫూర్తిప్రదాత అని తెలిపారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. ఇళయరాజా మధురమైన సంగీతంతో ప్రజలను రంజింపజేశారని గుర్తుచేశారు. భిన్నతరాల ప్రజలు ఆయన సంగీతాన్ని ఆస్వాదించారని పేర్కొన్నారు. విద్య, వైద్యం, సాంస్కృతిక రంగాల్లో వీరేంద్ర హెగ్గడే అందిస్తున్న సేవలు చిరస్మరణీయం అని చెప్పారు. విజయేంద్ర ప్రసాద్‌కు సృజనాత్మక ప్రపంచంతో దశాబ్దాల అనుబంధం ఉందని, భారతదేశ ఘనమైన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పారని ప్రశంసించారు. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన కొద్ది రోజులకే నలుగురు దక్షిణాది ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేయడం గమనార్హం. పాటల ‘పెద్ద’రాజా ‘పచ్చని చేల పావడ గట్టి...కొండమల్లెలే కొప్పున బెట్టి.. వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని..’వంటి అత్యద్భుత గీతానికి అంతే అద్భుతంగా బాణీలు సమకూర్చి పాటకు అమృతత్వాన్ని సాధించిపెట్టారు ఇళయరాజా. ఇలాంటి పాటలెన్నో ఆయన పాటల పూదోటలో అలా వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ పాటలోని ‘పచ్చని చేల’కు ఇళయరాజా జీవితానికి మధ్య సంబంధం ఎంతో బలమైంది. ఇళయరాజాకు పాటపై మక్కువ ఏర్పడింది, ఆయన్ను సంగీతం వైపు అడుగులేయించింది ఈ పచ్చని చేలల్లో రైతులు, కూలీలు పాడే పాటలే. ‘అన్నక్కిళి’తర్వాత బిజీ సంగీత కచేరీల్లో పాల్గొంటూ మరోవైపు పశ్చిమ బెంగాల్‌కి చెందిన సలీల్ చౌదరి వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా, కీ బోర్డు కళాకారుడిగా చేశారు ఇళయరాజా. కన్నడ సంగీత దర్శకుడు జీకే వెంకటేష్ దగ్గర దాదాపు 200 సినిమాలకు (చాలావరకు కన్నడ చిత్రాలే) సహాయకుడిగా చేశారు. ఇక తమిళ చిత్రం ‘అన్నక్కిళి’తో (1976)తో పూర్తిస్థాయి సంగీతదర్శకుడిగా మారారు. ‘అన్నక్కిళి’నిర్మాత పంజు అరుణాచలం రాజాకి ‘ఇళయ’(యంగ్ అని అర్థం) అని చేర్చి ‘ఇళయరాజా’గా మార్చారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, మరాఠీ, ఇంగ్లిష్ భాషల్లో దాదాపు 1,500 చిత్రాలకు 7 వేల పాటలకు పైగా స్వరపరిచారు ఇళయరాజా. 2010లో భారత ప్రభుత్వం ఇళయరాజాను ‘పద్మభూషణ్‘, 2018లో ‘పద్మ విభూషణ్‘పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వాలు సత్కరించాయి. ‘సాగర సంగమం’, ‘రుద్రవీణ’, తమిళ చిత్రం ‘సింధుభైరవి’, మలయాళ ‘పళసి రాజా’చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకున్నారు. మధురైలోని పన్నైపురమ్‌లో జననం 1943 జూన్ 3న తమిళనాడులోని మధురైలో గల పన్నైపురమ్‌లో రామస్వామి, చిన్నతాయమ్మాళ్ దంపతులకు మూడవ సంతానంగా జ్ఞాన దేశిగన్ (ఇళయరాజా) జన్మించారు. స్కూల్లో చేర్చేటప్పుడు ‘రాసయ్యా’అని మార్చారు. 14వ ఏటనే ఇళయరాజాకి సంగీతం పట్ల మక్కువ ఏర్పడింది. దాంతో సోదరుడు పావలార్ వరదరాజన్ నిర్వహించే సంగీత బృందంతో ఊరూరూ తిరుగుతూ కచేరీలు ఇచ్చేవారు. ఆ సమయంలోనే భారతదేశపు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు నివాళిగా తమిళ కవి కన్నదాసన్ రాసిన పాటకు బాణీ కట్టారు. తీవ్ర వేదనతో సాగే ఈ పాట ఎంతోమంది మనసుల్ని కదిలించింది. 1968లో మద్రాసులో ధన్‌రాజ్ మాస్టర్ వద్ద సంగీతం అభ్యసించారు. ధన్‌రాజ్ మాస్టర్ రాసయ్యా పేరుని ‘రాజా’గా మార్చారు. రాజ్యసభకు ‘కథ’ల బాహుబలి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయిన ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు వి.విజయేంద్ర ప్రసాద్ తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరులో 1942 మే 27న జన్మించారు. ఆయన పూర్తిపేరు కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్. కొవ్వూరు, ఏలూరు, విశాఖపట్ణణంలో చదువుకున్న విజయేంద్ర ప్రసాద్ తన అన్నయ్యతో కలసి విశాఖపట్టణంలో కాంట్రాక్ట్ పనులు చేసేవారు. అక్కడే రాజనందినిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత చెన్నైలో ఉన్న తన దగ్గరి బంధువు, అన్నయ్య అయిన పాటల రచయిత శివశక్తి దత్తా (సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి) వద్దకు చేరారు. దర్శకుడు రాఘవేంద్రరావు వద్ద విజయేంద్ర ప్రసాద్‌ని అసిస్టెంట్ రైటర్‌గా చేర్పించారు శివశక్తి దత్తా. మూడేళ్లు అసిస్టెంట్ రైటర్‌గా చేసిన ఆయన శివశక్తి దత్తాతో కలిసి ‘జానకి రాముడు’సినిమాకి తొలిసారి కథ రాశారు. ‘బంగారు కుటుంబం’, ‘బొబ్బిలి సింహం’సినిమాలకు కథలు రాశారు. ‘బొబ్బిలి సింహం’చిత్రం తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాలకు కథలు అందించారు. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’చిత్రాలకు కథలు అందించారు. 1996లో అన్నయ్య శివశక్తి దత్తాతో కలిసి ‘అర్ధాంగి’, ‘శ్రీకృష్ణ 2006, రాజన్న, శ్రీవల్లీ’చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘రాజన్న’చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నంది అవార్డు అందుకున్నారు. హిందీ ‘బజరంగీ భాయీజాన్’సినిమాకి బెస్ట్ స్టోరీ విభాగంలో ‘ఫిల్మ్‌ఫేర్’తో పాటు, ‘ది ఐకానిక్ ట్రేడ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ 2015’, ‘సోనీ గిల్డ్ 2016’అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. విజయేంద్ర ప్రసాద్ సతీమణి రాజనందిని 2012 అక్టోబర్ 21న మరణించారు. ఆయనకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు. ‘‘విజయేంద్రప్రసాద్ రచనలు భారతదేశ అద్భుతమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఒక ముద్ర వేశాయి. రాజ్యసభకు ఎంపికైనందుకు ఆయనకు అభినందనలు’’అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. సమాజ సేవే శ్వాసగా.. లక్షల మందికి ఆరాధ్యుడు డాక్టర్ వీరేంద్ర హెగ్గడే కర్ణాటకలోని ప్రఖ్యాత ధర్మస్థల ఆలయ ధర్మాధికారిగా సేవలందిస్తూ సామాజిక సేవా రంగంలోనూ విశేషమైన పేరు ప్రఖ్యాతలు ఆర్జించిన డాక్టర్ వీరేంద్ర హెగ్గడేను 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఆయన 1948 నవంబర్ 25న దక్షిణ కన్నడ జిల్లాలోని బంట్వాల్లో జన్మించారు. తల్లిదండ్రులు రత్నమ్మ, రత్నవర్మ హెగ్గడే. వీరేంద్ర హెగ్గడేకు భార్య హేమావతి హెగ్గడే, కుమార్తె శ్రద్ధ హెగ్గడే ఉన్నారు. విద్యాభ్యాసం అనంతరం కేవలం 20 ఏళ్ల వయసులో 1968 అక్టోబర్ 24న ధర్మస్థల ఆలయ ధర్మాధికారిగా(పాలకుడు) బాధ్యతలు స్వీకరించారు. గత ఐదు దశాబ్దాలుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. గ్రామీణాభివృద్ధి, ప్రజల స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలు ప్రారంభించారు. రూరల్ డెవలప్మెంట్, సెల్ఫ్–ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(ఆర్డీఎస్ఈటీఐ)ని నెలకొల్పారు. ఈ సంస్థ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన కల్పిస్తున్నారు. వారికి తగిన శిక్షణ అందిస్తున్నారు. అలాగే కర్ణాటకలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా శ్రీక్షేత్ర ధర్మస్థల రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కింద 6 లక్షలకుపైగా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తున్నాయి. 49 లక్షల మందికిపైగా సభ్యులు ఉన్నారు. అంతేకాకుండా శ్రీధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషనల్ ట్రస్టును డాక్టర్ హెగ్గడే నెలకొల్పారు. 25కు పైగా పాఠశాలలు, కళాశాలల ద్వారా నాణ్యమైన విద్యనందిస్తున్నారు. హెగ్గడేకు ధర్మరత్న, ధర్మభూషణ అనే పేర్లు కూడా ఉన్నాయి. లక్షలాది మందికి ఆరాధ్యుడిగా కొనసాగుతున్నారు. పరుగుల రాణికి ‘రాజ్య’ యోగం ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ప్రపంచ వేదికలపై భారత్ సత్తా చాటిన అథ్లెట్ పీటీ ఉష. చిరుత కూడా చిన్నబోయే వేగం ఉష సొంతం. ట్రాక్‌పై ఆమె అడుగు పెట్టిందంటే పందెం కోడె! అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో ఉష ప్రతిభ ఎన్నో పతకాలను తెచ్చిపెట్టింది. అమ్మాయిలకు చదువెందుకనే ఆ రోజుల్లో ఆటల పోటీల్లోకి వెళ్లడమంటే సాహసం. అలాంటి పరిస్థితుల్లో ‘పయ్యోలి’అనే పల్లెటూరులో నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది. ప్రపంచవేదికపై ‘పరుగుల రాణి’గా నిలిచింది. పతకాలతో ‘గోల్డెన్ గర్ల్’గా మారింది. ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస్’గా ఎదిగింది. ఆమె పరుగు ఎందరో అమ్మాయిలకు ప్రేరణ. ఊరి పేరునే.. ఇంటిపేరుగా మార్చుకున్న పయ్యోలి తెవరపరంపిల్ ఉష (పీటీ ఉష) 1976 నుంచి 2000 వరకు రెండున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘంగా ‘పరుగు’ప్రయాణాన్ని కొనసాగించింది. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 4–400 మీటర్ల రిలే, 400 మీటర్ల హర్డిల్స్‌లో అలుపెరగని పరుగుతో దిగ్గజ అథ్లెట్‌గా ఎదిగింది. 25 ఏళ్ల కెరీర్లో జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో ఉష మొత్తం 102 పతకాలను గెలుచుకుంది. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ (1984)లో 400 మీటర్ల హర్డిల్స్‌లో త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. కానీ అంతకుముందు... ఆ తర్వాత జరిగిన ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌లలో ఎదురేలేని స్ప్రింటర్‌గా ఎదిగింది. ప్రత్యేకించి 1985 నుంచి 1989 వరకు కువైట్, జకార్తా, సియోల్, సింగపూర్, న్యూఢిల్లీల్లో జరిగిన ఆసియా పోటీల్లో ఆమె 16 స్వర్ణాలు (ఓవరాల్‌గా 18 బంగారు పతకాలను) సాధించింది. కెరీర్ తదనంతరం అకాడమీ నెలకొల్పి.. తన జీవితాన్నే భారత అథ్లెటిక్స్‌కి అంకితం చేసింది. ఆమె సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం 1984లో ‘అర్జున అవార్డు’తో పాటు ‘పద్మశ్రీ’పురస్కారాన్ని అందజేసింది. 58 ఏళ్ల ఉష తాజాగా రాజ్యసభకు నామినేట్ అయ్యింది. ఇళయరాజాపై అభినందనల వర్షం రాజ్యసభకు వెళ్లబోతున్న సంగీత దిగ్గజం ఇళయరాజాపై అభినందనల వర్షం కురుస్తోంది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, సూపర్‌స్టార్ రజనీకాంత్ అభినందనలు తెలిపారు. అసాధారణ సంగీత కళాకారుడు ఇళయరాజా వివిధ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నారని రాజ్‌భవన్ ట్వీట్ చేసింది. ప్రియమైన మిత్రుడు ఇళయరాజాకు అభినందనలు అని రజనీకాంత్ పేర్కొన్నారు. ఇళయరాజాను ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్ కూడా అభినందించారు. దేశాన్ని గర్వపడేలా చేశారు: అమిత్ షా ప్రముఖులు పీటీ ఉషా, ఇళయరాజా, డాక్టర్ వీరేంద్ర హెగ్గడే,విజయేంద్ర ప్రసాద్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందనలు తెలియజేశారు. అంకితభావం, నిరంతర శ్రమతో వారు దేశాన్ని గర్వపడేలా చేశారని కొనియాడారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఎగువ సభకు వెళ్లబోతున్న వారికి అభినందనలు తెలిపారు. Shri V. Vijayendra Prasad Garu is associated with the creative world for decades. His works showcase India's glorious culture and have made a mark globally. Congratulations to him for being nominated to the Rajya Sabha. — Narendra Modi (@narendramodi) July 6, 2022 Shri Veerendra Heggade Ji is at the forefront of outstanding community service. I have had the opportunity to pray at the Dharmasthala Temple and also witness the great work he is doing in health, education and culture. He will certainly enrich Parliamentary proceedings. pic.twitter.com/tMTk0BD7Vf — Narendra Modi (@narendramodi) July 6, 2022 The creative genius of @ilaiyaraaja Ji has enthralled people across generations. His works beautifully reflect many emotions. What is equally inspiring is his life journey- he rose from a humble background and achieved so much. Glad that he has been nominated to the Rajya Sabha. pic.twitter.com/VH6wedLByC — Narendra Modi (@narendramodi) July 6, 2022 The remarkable PT Usha Ji is an inspiration for every Indian. Her accomplishments in sports are widely known but equally commendable is her work to mentor budding athletes over the last several years. Congratulations to her on being nominated to the Rajya Sabha. @PTUshaOfficial pic.twitter.com/uHkXu52Bgc — Narendra Modi (@narendramodi) July 6, 2022 -
క్రీడా దిగ్గజం కన్నుమూత: విషాదంలో అథ్లెటిక్స్ ప్రపంచం
తిరువనంతపురం: పరుగుల రాణి పీటీ ఉష గురువు, అథ్లెటిక్స్ దిగ్గజం ఓమ్ నంబియార్ (89) గురువారం కన్నుమూశారు. తనకు శిక్షణనిచ్చిన గురువు కన్నుమూయడంతో ఆమె దిగ్ర్భాంతి చెందారు. ఈ విషయాన్ని చెబుతూ ఆమె ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గురువుతో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నారు. కేరళకు చెందిన నంబియార్ 1980- 90 కాలంలో పీటీ ఉషకు శిక్షణ ఇచ్చారు. ఆయన శిక్షణలోనే పీటీ ఉష రాటుదేలారు. 1985లో ఆయనకు ద్రోణాచార్య అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది పద్మశ్రీతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ( చదవండి: పసిపాప కోసం ‘ఒలింపిక్ మెడల్’ వేలానికి ) కోచ్ కాక ముందు నంబియార్ 1955-70 మధ్య భారత వాయుసేనలో పని చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ క్రీడా సంస్థలో కోచింగ్ కోర్సు పూర్తి చేశారు. అనంతరం కేరళ క్రీడా మండలిలో చేరారు. తిరువనంతపురంలో తొలిసారిగా పీటీ ఉష నంబియార్‌ను కలిసింది. పీటీ ఉషతో పాటు షైనీ విల్సన్, వందనా రావు అంతర్జాతీయ పతకాలు సాధించడంలో నంబియార్ పాత్ర మరువలేనిది. గురువు మృతిపై పీటీ ఉష ట్వీట్ చేశారు. ‘నా గురువు, శిక్షకుడు, మార్గదర్శిని కోల్పోవడం తీరని లోటు. నా జీవితానికి ఆయన చేసిన మేలు మాటల్లో చెప్పలేనిది. మిమ్మల్ని మిస్సవుతున్నాం నంబియార్ సార్. మీ ఆత్మకు శాంతి చేకూరుగాక’ అని చెబుతూ పోస్టు చేశారు. ఈ సందర్భంగా గురువు నంబియార్‌తో ఉన్న ఫొటోలను ఉష పంచుకుంది. The passing of my guru, my coach, my guiding light is going to leave a void that can never be filled. Words cannot express his contribution to my life. Anguished by the grief. Will miss you OM Nambiar sir. RIP 🙏🏽 pic.twitter.com/01ia2KRWHO — P.T. USHA (@PTUshaOfficial) August 19, 2021 నంబియార్ మృతిపై భారత అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఏఎఫ్ఐ) అధ్యక్షుడు అడిలి జె. సుమారివల్ల సంతాపం ప్రకటించారు. భారత అథ్లెటిక్స్ నంబియార్ సేవలను మరువలేరని పేర్కొన్నారు. 1984 లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో పీటీ ఉష నంబియార్ సారథ్యంలోనే సత్తా చాటింది. అథ్లెటిక్స్ తరఫున వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని తెలిపారు. Sad to inform that Dronacharya Awardee coach OM Nambiar sir passed away a while back. He was coach of @PTUshaOfficial RIP Nambiar Sir, You gave us the Golden Girl. Your contribution to sports in India has been tremendous. Our condolences to the family- AFI President @Adille1 pic.twitter.com/VBVNqBPhzT — Athletics Federation of India (@afiindia) August 19, 2021 చదవండి: తనయుడి గిఫ్ట్‌కు తన్మయత్వంతో కన్నీళ్లు రాల్చిన తల్లి -
'37 ఏళ్ల నా కలను నిజం చేశావు బేటా'
ఢిల్లీ: నీరజ్ చోప్రా.. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా జావెలిన్ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి దేశానికి అథ్లెటిక్స్ విభాగంలో తొలి స్వర్ణం అందించి చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణంతో జపాన్ గడ్డపై మువన్నెల జెండాను రెపరెపలాడించాడు. ఈ నేపథ్యంలో 'పరుగుల రాణి' పీటీ ఉష నీరజ్ చోప్రాను అభినందిస్తూ అతనితో దిగిన పాత ఫోటోను తన ట్విటర్లో షేర్ చేసింది. '' 37 ఏళ్ల తర్వాత నా కలను నిజం చేశావు.. థ్యాంక్యూ బేటా.. ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయానన్న బాధను ఈరోజుతో మర్చిపోయేలా చేశావు. నేను సాధించకుంటే ఏంటి.. ఒక భారతీయుడిగా నువ్వు దానిని చేసి చూపించావు'' అంటూ ఎమోషనల్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం పీటీ ఉష ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా '' పయ్యోలి ఎక్స్‌ప్రెస్'' .. '' పరుగుల రాణిగా'' పేరు పెందిన పీటీ ఉష.. 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో తృటిలో పతకం సాధించే అవకాశం కోల్పోయింది. ఆ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హార్డిల్స్ విభాగంలో పోటీ పడిన ఆమె సెకనులో వందోవంతులో కాంస్య పతకం కోల్పోవాల్సి వచ్చింది. పీటీ ఉష 400 మీ హార్డిల్స్‌ను 55. 42 సెకన్లలో పూర్తి చేయగా.. రోమానియాకు చెందిన క్రిస్టియానా కోజోకారు 55.41 సెకన్లలో గమ్యాన్ని చేరి కాంస్యం గెలుచుకోవడంతో ఉష నాలుగో స్థానంలో నిలిచింది. అలా ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు పతకం అందించాలనేది కలగానే మిగిలిపోయింది. ఈ విషయాన్ని పీటీ ఉష స్వయంగా చాలా ఇంటర్య్వూల్లో పేర్కొంది. అయితే ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా మాత్రం పీటీ ఉష రికార్డు పదిలంగా ఉంది. అంతకముందు 1986 సియోల్ ఆసియా క్రీడలలో 4 బంగారు పతకాలతో పాటు రజతం సాధించింది. అలాగే 1982 ఢిల్లీ ఆసియా క్రీడలలో 2 రజతాలు, 1990 ఆసియాడ్ లో 3 రజతాలు, 1994 ఆసియాడ్‌లో ఒక రజత పతకాన్ని సాధించింది. Realised my unfinished dream today after 37 years. Thank you my son @Neeraj_chopra1 🇮🇳🥇#Tokyo2020 pic.twitter.com/CeDBYK9kO9 — P.T. USHA (@PTUshaOfficial) August 7, 2021 THE THROW THAT WON #IND A #GOLD MEDAL 😍#Tokyo2020 | #StrongerTogether | #UnitedByEmotion @Neeraj_chopra1 pic.twitter.com/F6xr6yFe8J — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 7, 2021 -
తృటిలో ఒలింపిక్ పతకాన్ని చేజార్చుకున్న కేరళ కుట్టి ఎవరో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్ క్రీడలు, మహిళలు, బంగారు పతకాలు అనగానే క్రీడాభిమానులకు ఠక్కున గుర్తొచ్చేపేరు పరుగుల రాణి పీటీ ఉష. అభిమానులు పయోలి ఎక్స్‌ప్రెస్‌గా పిల్చుకునే పీటీ ఉష పేరు తెలియని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. దేశ కీర్తి కిరీటాన్ని ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా చేసిన ఉష అంతర్జాతీయ క్రీడా జీవితంలో మొత్తం 101 స్వర్ణ పతకాలను సాధించారంటే ఆమె ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. భారత మహిళా ట్రాక్ అండ్కే ఫీల్డ్‌లో కేరళ కుట్టీ పిలావుళ్ళకండి తెక్కే పఱంబిల్ ఉష 1979 నుంచి దేశానికి పలు విజయాలను అందించారు. 1986 సియోల్ ఆసియా క్రీడలలో 4 బంగారు పతకాలు, రజిత పతకం సాధించి రికార్డు సృష్టించిన ఉష తృటిలో ఒలంపిక్స్ పతకాన్నిచేజార్చుకున్నారు. అవును నిజం. 1980 రష్యా ఒలంపిక్స్ ఉషకుపెద్దగా కలిసిరాలేదు. అయితే 1984 ఒలింపిక్స్‌లో ఎలాగైనా పతకం సాధించాలని ఆశించారు. అమెరికా లోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన క్రీడలలో ఉష సెమీఫైనల్స్‌లో ప్రథమస్థానంలో నిలిచినా, పైనల్స్ లో వెంట్రుకవాసిలో పతకం పొందే అవకాశం కోల్పోయారు. సెకనులో వందోవంతు (0.01) తేడాతో కాంస్య పతకం పొందే అవకాశం జారవిడుచుకున్న విషయం అప్పట్లో భారతీయులను చాలా కాలం వెంటాడింది. 1960లో ప్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్‌కు కలిగిన దురదృష్టమే పీటీ ఉషకు కూడా ఎదురైందని భావించారు. అయితే ఒలింపిక్ క్రీడల అథ్లెటిక్స్ లో పైనల్స్ చేరిన తొలి మహిళా క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించారు. ఆమె దేశానికి సాధించిపెట్టిన ఖ్యాతికి గుర్తుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ,అర్జున అవార్డులతో సత్కరించింది. కాగా టోక్యో ఒలింపిక్ భారత్‌కు తొలి పతకాన్ని అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను చరిత్రలో తన పేరును చిరస్థాయిగా నిలుపుకున్నారు. ఒలింపిక్స్ ప్రారంభం రోజునే పతకం సాధించిన తొలి భారతీయురాలిగా ఖ్యాతి గడించారు. -
పరుగుల రాణికి యువీ బర్త్‌డే విషెస్
పరుగుల రాణి పీటీ ఉష జన్మదినం సందర్భంగా పలువురు క్రీడా, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నేడు 56వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజు ఆమెకు ట్విటర్ వేదికగా పుట్టనరోజలు శుభాకాంక్షలు తెలిపారు. ‘ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పరుగుల రాణిగా మన్నలందుకున్న పీటీ ఉషకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ పోరాట పటిమ, అద్భుతమైన విజయాలు చూస్తూ పెరిగాం. మీ స్ఫూర్తి మమ్మల్ని భారతీయులుగా గర్వించేలా చేసింది. యువతను ప్రోత్సహించడానికి మీరు అంకితభావంతో పనిచేస్తున్నారు. మీకు ఆయురారోగ్యాలు సిద్ధించాలి’అని యువీ ట్వీట్ చేశాడు. ‘లెజండ్, భారతీయ నిజమైన గోల్డె్ గర్ల్ పీటీ ఉషకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె ఇప్పటికీ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆమెకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా’అని కిరణ్ రిజుజు ట్విటర్లో పేర్కొన్నారు. దాంతోపాటు పీటీ ఉషతో ఉన్న ఫొటోలను పోస్టుకు జత చేశారు. కాగా, పీటీ ఉష 1979 నుంచి భారతదేశం తరపున అథ్లెటిక్స్‌లో పాల్గొని దేశానికి పలు అద్భుత విజయాలను అందించారు. 1986 సియోల్ ఆసియా క్రీడలు, 1982 ఢిల్లీ ఆసియా క్రీడలు, 1990 ఆసియాడ్‌లో పాల్గొని 4 బంగారు పతకాలు, 7 రజత పతకాలు సాధించారు. 2000 సంవత్సరంలో రిటైర్ అయిన ఉష భావి అథ్లెట్ల శిక్షణ కోసం ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ను నెలకొల్పి సేవలందిస్తున్నారు.