
ఎందుకలా జరిగిందంటే...
సల్మాన్‌ఖాన్ ఒక్కసారి మాట ఇస్తే ఇక ఆ మాటకు తిరుగు ఉండదు. సరే, ఇదేదో బానే ఉంది గాని, ఆయన 'ఇచ్చిన మాట' పరిణితిచోప్రాకు ఇబ్బందికరంగా మారింది.
ముంబై : సల్మాన్‌ఖాన్ ఒక్కసారి మాట ఇస్తే ఇక ఆ మాటకు తిరుగు ఉండదు. సరే, ఇదేదో బానే ఉంది గాని, ఆయన 'ఇచ్చిన మాట' పరిణితిచోప్రాకు ఇబ్బందికరంగా మారింది. విషయం ఏమిటంటే... సల్మాన్‌ఖాన్ తన సొంత బ్యానర్ 'సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్' పై 'జుగల్బందీ' సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సమీర్‌శర్మ దర్శకత్వం వహించే ఈ సినిమాలో సైఫ్ ఆలిఖాన్ నటించనున్నారు. ఆయన సరసన హీరోయిన్‌గా పరిణితిచోప్రాను అనుకున్నారు.
ఈ సినిమా తన కెరీర్‌ను ఎక్కడికో తీసుకువెళుతుందని ఆమె కూడా ఆశ పడింది. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే తాజా వార్త ఏమిటంటే, పరిణితిచోప్రా స్థానంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటించనున్నారు. సల్మాన్ సినిమాలో నటించలేనంత బిజీగా ఉందా చోప్రా? ఆమె చేతిలో ఉన్న సినిమాలు చూస్తే అదేమీ లేదని అర్థమవుతుంది. మరోవైపు ఫెర్నాండేజ్ డేట్లు సర్దుబాటు చేయలేనంత బిజీలో ఉంది. అయినప్పటికీ జుగల్‌బందీలో నటించడానికి ఎందుకు ఒప్పుకున్నట్లు? దీనికి కారణం సల్మాన్‌ఖాన్.
తన నిర్మాణ సంస్థలో అవకాశం ఇస్తానని అప్పుడెప్పుడో సల్మాన్, ఫెర్నాండేజ్‌కు ప్రామిస్ చేశాడట. తన మాట కాస్త లేటుగా గుర్తుకువచ్చి చోప్రాను తప్పించాడట. వేరే సినిమాలతో చాలా బిజీగా ఉన్నప్పటికీ...'జుగల్‌బందీ' లో ఫెర్నాండేజ్ నటించడానికి కారణం...సల్మాన్ మాటకు గౌరవం ఇవ్వడంతో పాటు, ఈ మ్యూజికల్ డ్రామా స్క్రిప్ట్ కూడా ఆమెకు బాగా నచ్చడం. పాపం పరిణితి!