న్యూ టాలెంట్‌ | Salman Khan to turn lyricist for 'Race 3'? | Sakshi
Sakshi News home page

న్యూ టాలెంట్‌

Published Sat, Mar 17 2018 12:28 AM | Last Updated on Sat, Mar 17 2018 12:28 AM

Salman Khan to turn lyricist for 'Race 3'? - Sakshi

సల్మాన్‌ ఖాన్‌లోని నటుడు మనందరికీ ఎప్పటినుంచో పరిచయమే. ఆ తర్వాత పెయింటర్‌గా, సింగర్‌గా మారి ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు తనలో దాగున్న మరో కొత్త టాలెంట్‌ను బయటకు తీశారు సల్మాన్‌. తాజా చిత్రం ‘రేస్‌ 3’ కోసం ఆయన పాటల రచయితగా మారారు. ఈ సినిమాలో హీరో,హీరోయిన్‌ మధ్యలో వచ్చేఓ రొమాంటిక్‌ సాంగ్‌ను ఒక ప్రముఖ రచయితతో రాయించాలని చిత్రబృందం చూస్తుంటే ‘నేను రాసుకున్న పాట ఒకటి ఉంది’ అని, తను రాసుకున్న పాటను చదివి వినిపించారట సల్మాన్‌. టీమ్‌ అందరికీ ఆ పాట బాగా నచ్చిందట.

వెంటనే ఆ పాటకు మ్యూజిక్‌ కంపోజ్‌ చేసే పనిలో పడ్డారట సంగీత దర్శకుడు విశాల్‌ మిశ్రా. ఈ రొమాంటిక్‌ సాంగ్‌ను సల్మాన్, జాక్వెలిన్‌పై నృత్యదర్శకుడు రెమో డిసౌజా చిత్రీకరించనున్నారట. ఈ చిత్రాన్ని ఈ ఏడాది రంజాన్‌కి విడుదల చేయాలనుకుంటున్నారు. సో.. సల్మాన ్‌ ఖాన్‌లోని ఈ న్యూ టాలెంట్‌ను మనం రంజాన్‌కు వినొచ్చన్నమాట. ఆ సంగతలా ఉంచితే.. సల్మాన్‌ లవర్స్‌ లిస్ట్‌ చాలానే ఉంది. సంగీతా బిజలానీ, ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్, లూలియా వంటూర్‌.. ఇంకా కొంతమంది ఉన్నారు. మరి.. వీళ్లల్లో ఎవరి కోసం సల్మాన్‌ ఆ రొమాంటిక్‌ సాంగ్‌ రాశారో?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement