బాలకృష్ణ చెల్లెలు | katrinakaif have incident while Autograph | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ చెల్లెలు

Published Sat, Nov 25 2017 1:30 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

katrinakaif have incident while Autograph - Sakshi

ఒక కడుపులో పుట్టకపోయినా కత్రీనా బాలకృష్ణ చెల్లెలే! ఒక కడుపులో ఏంటి కర్మ, ఒక కాంటినెంట్‌లోనే పుట్టలేదు. ఇద్దరూ ఆన్‌ స్క్రీన్‌లో రొమాన్స్‌ చేసినా ఆఫ్‌ స్క్రీన్‌ మాత్రం ఒక్క విషయంలో కత్రీనా బాలకృష్ణ సిస్టరే. ఎలాగంటారా?   సల్మాన్‌ఖాన్‌ తెలుసు కదా. అబ్బా... బాలకృష్ణ, కత్రీనా మధ్యలో సల్మాన్‌ఖాన్‌ ఎక్కడి నుంచి వచ్చాడు? సల్మాన్‌ ఖాన్‌ ఫ్లయిట్‌లోంచి దిగి ఎయిర్‌పోర్ట్‌లోకి వచ్చాడు.

వెనకాలే కత్రీనా కూడా వస్తోంది. ఒక యంగ్‌ ఫ్యాన్‌ పరిగెత్తుకుంటూ వచ్చి మీ గ్రాఫ్‌ బాగుంది ఒక ఆటోగ్రాఫ్‌ పెడతారా అని అడిగాడు. సల్మాన్‌ఖాన్‌ వాణ్ణి వొడిలో కూచోబెట్టుకుని సంతకం పెట్టి పంపించాడు. అదే ఉత్సాహంలో వెనకాల కనబడిన కత్రీనా దగ్గర కూడా ఆటోగ్రాఫ్‌ కోసం ఈ యంగ్‌స్టర్‌ వెళ్లాడు. అలా వెళ్తే బాలకృష్ణ ఏం చేస్తాడు? ఫటాక్‌. ఢిషూం. ఢిష్కూం. అంతే కదా.  కత్రీనా కైఫ్‌ కూడా బాలకృష్ణ చెల్లెలే. చెయ్యి ఎత్తలేదు. పెన్ను పట్టలేదు. పట్టించుకోకుండా వెళ్లిపోయింది. బాలకృష్ణ సిస్టరైనా ఒక కడుపులో పుట్టకపోయినా, ఒకే కాంటినెంట్‌లో భూమ్మీద పడకపోయినా ఫ్యాన్స్‌ అంటే బేఖాతరు. జస్ట్‌ లైక్‌ బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement