
అని.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను అడిగి మరీ, కెమెరా క్లిక్‌మనిపించారు వరుణ్ ధావన్. ఈ యంగ్ హీరో ఫొటోగ్రాఫర్‌గా మారారేమో అనుకుంటున్నారా? అదేం కాదు. సరదాగా సెల్ కెమెరాని క్లిక్‌మనిపించారు. సల్మాన్ నటిస్తోన్న ‘రేస్ 3’ షూటింగ్ జరుగుతున్న లొకేషన్‌ను సందర్శించారు వరుణ్. షూటింగ్ గ్యాప్‌లో ఇలా ఆట విడుపుగా ఫొటోలు తీసి, సందడి చేశారు. ‘మంచి పోజ్ ఇవ్వు భాయ్’ అని వరుణ్ ఫొటోలు క్లిక్‌మనిపించారు. ఈ ఫొటోని సల్మాన్ తన టిట్టర్ అకౌంట్‌లో షేర్ చేసుకున్నారు. ‘రేస్ 3’ మరియు బిగ్ బాస్ రియాలిటి షోలతో బిజీ బిజీగా గడుపుతున్నారు సల్మాన్.
Comments
Please login to add a commentAdd a comment