బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫుల్ జోష్లో ఉన్నాడు. వరుస బ్లాక్ బస్టర్స్తో బాలీవుడ్ టాప్ స్టార్గా ఎదుగుతున్నాడు. ఇటీవల బజరంగీ బాయ్జాన్ సినిమాతో సత్తా చాటిన సల్మాన్ త్వరలో ఓ యాక్షన్ సినిమాకు రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో ఓ యాక్షన్ డ్రామాలో నటించనున్నాడు.
సుల్తాన్ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాను యష్రాజ్ ఫిలింస్ బ్యానర్పై బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్యచొప్రా నిర్మిస్తున్నాడు. సల్మాన్ రెజలర్ గా నటిస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ లార్నెల్ స్టొవల్ ఫైట్ సీక్వన్స్ను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రేమ్ రతన్ ధన్ పాయో షూటింగ్ పూర్తి చేసిన సల్మాన్, ఇప్పటికే సల్మాన్ ఖాన్ లాస్ ఏంజిల్స్లో ట్రైనింగ్ తీసుకుంటుండగా అక్కడికి చేరుకున్న డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.
విశాల్ - శేఖర్లు సాంగ్స్ రికార్డింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఎట్టిపరిస్థితుల్లో 2016 ఈద్కు రిలీజ్ ప్లాన్ చేస్తున్న యూనిట్ పక్కాప్లానింగ్తో సినిమా కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇంత వరకు హీరోయిన్ ఎంపిక మాత్రం పూర్తి కాలేదు. వచ్చే ఏడాది ఈద్ బరిలో తన సినిమాను కూడా ప్లాన్ చేస్తున్న షారూఖ్కు గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు సల్మాన్.
సల్మాన్ కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్
Published Wed, Sep 9 2015 8:21 AM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM
Advertisement
Advertisement