హిందీలో హ్యాపీ డేస్?
ఈ ఏడేళ్లల్లో వచ్చిన యూత్‌ఫుల్ చిత్రాల్లో ‘హ్యాపీ డేస్’కి ప్రత్యేక స్థానం ఉంటుంది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా ఆస్వాదించేలా శేఖర్ కమ్ముల ఆ చిత్రాన్ని మలిచారు. ఇక్కడివారినే కాదు.. బాలీవుడ్‌వారిని సైతం ఆకట్టుకున్న చిత్రం ఇది. ఎంతగా ఆకట్టుకుందంటే కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ చిత్రాన్ని హిందీలో పునర్నిర్మించాలనుకుంటున్నారట. ఇటీవలే ఆయన ఓ సొంత సంస్థను ఆరంభించారు. సల్మాన్ ఆప్తమిత్రుల్లో ఒకరు ‘హ్యాపీ డేస్’ గురించి ఆయన దగ్గర చెప్పారట. దాంతో ఈ చిత్రం గురించి సల్మాన్ వాకబు చేసి, రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారని భోగట్టా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే ఈ చిత్రం రూపొందనుందని సమాచారం.