Happydays
-
హ్యాపిడేస్ హీరోకు గోల్డెన్ ఛాన్స్
హ్యాపిడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నటుడు రాహుల్ హరిదాస్. ఈ యంగ్ హీరో హ్యాపిడేస్ తరువాత ఒకటి రెండు సినిమాల్లో నటించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే తాజా వెంకటాపురం సినిమాతో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ యంగ్ హీరోకు ఓ గోల్డెన్ ఛాన్స్ తలుపు తట్టింది. బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమాను కోలీవుడ్‌లో రిలీజ్ చేసిన కె ప్రొడక్షన్ సంస్థ రాహుల్ హీరోగా ఓ సినిమాను నిర్మించనుంది. టాలీవుడ్లో పాగా వేసేందుకు ప్లాన్ చేస్తున్న కె ప్రొడక్షన్ సంస్థ ఇప్పటికే రానా, రెజీనా లీడ్ రోల్స్‌లో 1945 అనే బైలింగ్యువల్ సినిమాను ప్రారంభించింది. అదే సమయంలో రాహుల్ హీరోగా అడ్వంచరస్ డ్రామాను తెరకెక్కించడానికి రెడీ అవుతుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. రాహుల్ హీరోగా తెరకెక్కిన వెంకటాపురం మే 12న రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
నాకు ఫాలోయింగ్ ఉంటే ఎంత బాగుండు...
వరుణ్ సందేశ్.. చిన్నారులకు, యువతకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. తొలి చిత్రంతోనే యూత్‌ను ఆకట్టుకున్న కుర్ర హీరో. చిన్నప్పుడు వేసవి సెలవులను ఎలా ఎంజాయ్ చేశారో ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘సవ్ముర్ అంటే వూకు ‘హ్యాపీడేసే’. అమెరికాలో చదువుకొనే రోజుల్లో ప్రతి సంవత్సరం వేసవి సెలవుల కోసం అమ్మా, నేను, మా చెల్లెలు తప్పనిసరిగా హైదరాబాద్ వచ్చేవాళ్లం. ఉద్యోగరీత్యా నాన్న ప్రతి సంవత్సరం రావడానికి వీలయ్యేది కాదు. అలా ప్రతి యేటా ఒక నెల రోజులు హైదరాబాద్‌లో నానమ్మ, తాతయ్య దగ్గర, మరో నెల వైజాగ్ సీతమ్మధారలో అమ్మమ్మ వాళ్లింట్లో గడిపేవాళ్లం. హైదరాబాద్ వచ్చామంటే నానమ్మ, తాతయ్యతో కలిసి టూర్లు తిరిగే వాళ్లం. షిరిడీ, తిరుపతి మా పర్యటనలో తప్పనిసరిగా ఉండేవి. వైజాగ్‌లో నా ప్రపంచమంతా ఆర్కే బీచ్. చాలాసేపు అక్కడే గడిపేవాణ్ని. ఆ జ్ఞాపకాలు ఇప్పుడు తలుచుకుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. సవ్ముర్ సందడిలో అసలు సమయమే తెలిసేది కాదు. అప్పుడే సెలవులు అయిపోయాయా.. అనిపించేది. హైదరాబాద్‌లో మా తాతయ్య జీడిగుంట రామచంద్రమూర్తి, బాబాయ్ శ్రీధర్‌కు ఎక్కడికి వెళ్లినా జనం ఫాలోయింగ్ ఉండేది. చాలా మంది ఆసక్తిగా చూసేవారు.. దగ్గరకు వచ్చి పలకరించేవాళ్లు. అదంతా నాకు ఎంతో ఇంట్రస్ట్‌గా అనిపించేది. బాబాయ్ సినిమాలు, సీరియళ్లలో నటిస్తున్నారు. వారినలా చూసినప్పుడు నాక్కూడా జనం ఫాలోయింగ్ ఉంటే ఎంత బాగుండు అనిపించేది. అమెరికాలో ఉన్న రోజుల్లో బాస్కెట్‌బాల్ బాగా ఆడేవాణ్ని. లెవెంత్ క్లాస్ పూర్తయ్యాక ‘హ్యాపీడేస్’ సినిమా కోసం హైదరాబాద్ వచ్చేశా. తరువాత ‘కొత్త బంగారు లోకం’ తెలిసిందే కదా’..! -
హిందీలో హ్యాపీ డేస్?
ఈ ఏడేళ్లల్లో వచ్చిన యూత్‌ఫుల్ చిత్రాల్లో ‘హ్యాపీ డేస్’కి ప్రత్యేక స్థానం ఉంటుంది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా ఆస్వాదించేలా శేఖర్ కమ్ముల ఆ చిత్రాన్ని మలిచారు. ఇక్కడివారినే కాదు.. బాలీవుడ్వారిని సైతం ఆకట్టుకున్న చిత్రం ఇది. ఎంతగా ఆకట్టుకుందంటే కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ చిత్రాన్ని హిందీలో పునర్నిర్మించాలనుకుంటున్నారట. ఇటీవలే ఆయన ఓ సొంత సంస్థను ఆరంభించారు. సల్మాన్ ఆప్తమిత్రుల్లో ఒకరు ‘హ్యాపీ డేస్’ గురించి ఆయన దగ్గర చెప్పారట. దాంతో ఈ చిత్రం గురించి సల్మాన్ వాకబు చేసి, రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారని భోగట్టా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. -
బొద్దే ముద్దు
సాధారణంగా స్లిమ్‌గా, అందంగా ఉన్న భామల్ని చూసి ఎంత చక్కగున్నావే అంటూ పాడుకుంటుంటారు. అందు కు భిన్నంగా నటి తమన్న బొద్దుగా తయారయ్యే పనిలో పడడం విశేషం. నిజానికి ఈ బ్యూటీ సన్నగా, నాజుగ్గా ఉంటారు. కోలీవుడ్‌లో కేడీ చిత్రం ద్వారా ప్రతి నాయకిగా పరిచయమయ్యారు తమన్న. ఈ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో టాలీవుడ్లో హ్యాపీడేస్‌తో తొలి విజయాన్ని అందుకున్నారు. దీంతో మళ్లీ తమిళంలో అవకాశాలు వరించాయి. పైయ్యా, అయన్ వంటి చిత్రాలతో సక్సెస్ఫుల్ నటిగా వెలిగిన తమన్నకు వేంగై తర్వాత అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్‌పై దృష్టి సారించారు. అనంతరం బాలీవుడ్లో పరిచయమైన తమన్నకు ప్రస్తుతం ఈ మూడు భాషలలోనూ అవకాశాలు అంతంత మాత్రమే. తమిళంలో చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం వీరం జనవరి 10న విడుదలకు ముస్తాబవుతోంది. తదుపరి అవకాశాలేమీ లేవు. దీంతో ఆఫర్ల అన్వేషణలో పడ్డారు. సన్నగా నాజుగ్గా ఉన్న ఈ బ్యూటీని కొంచెం మార్పు కోసం కాస్త లావెక్కమని కొందరు దర్శక నిర్మాతలు సలహా ఇచ్చారట. బరువెక్కడం ఎంతపని మళ్లీ సన్నబడడమే కష్టం అనుకున్న తమన్న లావెక్కే విషయం గురించి మరి కొందరు సన్నిహిత దర్శకుల సలహాలు అడిగారట. అందుకు వారు కోలీవుడ్‌లో అవకాశాలు రాబట్టాలంటే బరువెక్కడంలో తప్పు లేదని, కోలీవుడ్ ప్రేక్షకులకు బొద్దుగుమ్మలనే అధికంగా ఇష్టపడే వారని హితవు పలికారట. దీంతో ఈ మిల్కీ బ్యూటీ కాస్త ఒళ్లుపెంచే పనిలో పడ్డారట.