నాకు ఫాలోయింగ్ ఉంటే ఎంత బాగుండు...
వరుణ్ సందేశ్.. చిన్నారులకు, యువతకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. తొలి చిత్రంతోనే యూత్‌ను ఆకట్టుకున్న కుర్ర హీరో. చిన్నప్పుడు వేసవి సెలవులను ఎలా ఎంజాయ్ చేశారో ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘సవ్ముర్ అంటే వూకు ‘హ్యాపీడేసే’. అమెరికాలో చదువుకొనే రోజుల్లో ప్రతి సంవత్సరం వేసవి సెలవుల కోసం అమ్మా, నేను, మా చెల్లెలు తప్పనిసరిగా హైదరాబాద్ వచ్చేవాళ్లం. ఉద్యోగరీత్యా నాన్న ప్రతి సంవత్సరం రావడానికి వీలయ్యేది కాదు. అలా ప్రతి యేటా ఒక నెల రోజులు హైదరాబాద్‌లో నానమ్మ, తాతయ్య దగ్గర, మరో నెల వైజాగ్ సీతమ్మధారలో అమ్మమ్మ వాళ్లింట్లో గడిపేవాళ్లం. హైదరాబాద్ వచ్చామంటే నానమ్మ, తాతయ్యతో కలిసి టూర్లు తిరిగే వాళ్లం.
షిరిడీ, తిరుపతి మా పర్యటనలో తప్పనిసరిగా ఉండేవి. వైజాగ్‌లో నా ప్రపంచమంతా ఆర్‌కే బీచ్. చాలాసేపు అక్కడే గడిపేవాణ్ని. ఆ జ్ఞాపకాలు ఇప్పుడు తలుచుకుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. సవ్ముర్ సందడిలో అసలు సమయమే తెలిసేది కాదు. అప్పుడే సెలవులు అయిపోయాయా.. అనిపించేది. హైదరాబాద్‌లో మా తాతయ్య జీడిగుంట రామచంద్రమూర్తి, బాబాయ్ శ్రీధర్‌కు ఎక్కడికి వెళ్లినా జనం ఫాలోయింగ్ ఉండేది.
చాలా మంది ఆసక్తిగా చూసేవారు.. దగ్గరకు వచ్చి పలకరించేవాళ్లు. అదంతా నాకు ఎంతో ఇంట్రస్ట్‌గా అనిపించేది. బాబాయ్ సినిమాలు, సీరియళ్లలో నటిస్తున్నారు. వారినలా చూసినప్పుడు నాక్కూడా జనం ఫాలోయింగ్ ఉంటే ఎంత బాగుండు అనిపించేది. అమెరికాలో ఉన్న రోజుల్లో బాస్కెట్‌బాల్ బాగా ఆడేవాణ్ని. లెవెంత్ క్లాస్ పూర్తయ్యాక ‘హ్యాపీడేస్’ సినిమా కోసం హైదరాబాద్ వచ్చేశా. తరువాత ‘కొత్త బంగారు లోకం’ తెలిసిందే కదా’..!