ఫైట్‌ కోసం డైట్‌ | Jacqueline Fernandez gears up for Race 3 goes on a strict diet | Sakshi
Sakshi News home page

ఫైట్‌ కోసం డైట్‌

Published Sat, Feb 17 2018 4:50 AM | Last Updated on Sat, Feb 17 2018 4:50 AM

Jacqueline Fernandez gears up for Race 3 goes on a strict diet  - Sakshi

సీరియస్‌ యాక్షన్‌కు సిద్ధం అయ్యారు జాక్వెలిన్‌.  సల్మాన్‌ ఖాన్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ జంటగా రెమో డిసౌజా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రేస్‌ 3’. ‘రేస్‌’ సిరీస్‌లో ఇది థర్డ్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌. లాస్ట్‌ రెండు సినిమాల కంటే ఈ సినిమాలో యాక్షన్‌ మోతాదు కొంచెం ఎక్కువగా ఉంటుందట. ఒక హై ఓల్టేజ్‌ యాక్షన్‌ షెడ్యూల్‌ని బ్యాంకాక్‌లో, ఆ తర్వాత అబుదబీలో షూట్‌ చేయనున్నారట. ఈ సినిమా యాక్షన్‌ సీన్స్‌ గురించి దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ కేవలం స్టంట్స్‌ మాత్రమే కాదు, జాక్వెలిన్‌ ఈ సినిమాలో డైరెక్ట్‌గా విలన్స్‌తో తలపడనున్నారు. దానికి కోసం మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారు’’ అని అన్నారు.

జాక్వెలిన్‌ ఎప్పుడూ ఫిట్‌గానే ఉంటారు. కానీ ఈ సినిమాలో ఉన్న యాక్షన్‌ సన్నివేశాలను ఇంకా కాన్ఫిడెంట్‌గా, పర్ఫెక్షన్‌తో కంప్లీట్‌ చేయటం కోసం కొన్ని రోజుల పాటు స్ట్రిక్ట్‌ డైట్‌లో ఉంటారట. కొన్ని రోజుల పాటు మార్నింగ్‌ సాలిడ్‌ ఫుడ్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టి ఓన్లీ ఫ్లూయిడ్స్‌ మీదే ఉంటారట. లంచ్‌కి ఎగ్స్, స్పినాచ్‌ (పాల కూర)ని ఎక్కువగా తీసుకుంటున్నారట. ఈవినింగ్స్‌ ఓన్లీ మిల్క్‌ షేక్స్‌. సో ఈ నెల మొత్తం జాక్వెలిన్‌ ఫైట్‌ కోసం డైట్‌లో ఉండబోతున్నారన్న మాట. తన పాత్ర కోసం ఇంత కష్టపడుతున్నారంటే వర్క్‌ మీద ఎంత డెడికేషనో ఊహించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement