అనుకోని అతిథి! | Ranveer Singh visits sets of Salman Khan, Jacqueline Fernandez's Race 3 | Sakshi
Sakshi News home page

అనుకోని అతిథి!

Published Thu, Nov 23 2017 1:23 AM | Last Updated on Thu, Nov 23 2017 1:23 AM

Ranveer Singh visits sets of Salman Khan, Jacqueline Fernandez's Race 3 - Sakshi

ముంబైలో ఓ ప్రముఖ స్టూడియో అది. జోరుగా షూటింగ్‌ జరుగుతోంది. కెమెరా, యాక్షన్, కట్, టేక్‌.. ఇలాంటి వర్డ్స్‌ తప్ప లొకేషన్లో ఇంకో మాట వినబడటంలేదు. టీమ్‌ అంతా సీరియస్‌గా వర్క్‌లో నిమగ్నమైపోయారు. సడన్‌గా ఓ వ్యక్తి అనుకోని అతిథిలా వచ్చాడు. అంతే వారి సీరియస్‌నెస్‌లో హుషారు నింపాడు. సెట్‌లో నవ్వులు పంచాడు. అతను రణ్‌వీర్‌ సింగ్‌. ఇతగాడికి ‘లైవ్‌ వైర్‌’ అనే పేరుంది. రణ్‌వీర్‌ ఎక్కడ ఉంటే అక్కడ సందడే. సల్మాన్‌ ఖాన్‌ ‘రేస్‌ 3’ సినిమా సెట్‌లో రణ్‌వీర్‌ చేసిన సందడి ఇప్పుడు బీటౌన్‌లో ఓ హాట్‌ టాపిక్‌.

‘ఏబీసిడి (ఎనీబడీ కెన్‌ డ్యాన్స్‌), ఏ ప్లైయింగ్‌ జాట్‌’ వంటి చిత్రాలను తెరకెక్కించిన రెమో డిసౌజా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, బాబీ డియోల్, సలీమ్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ స్పాట్‌కు వెళ్లారు రణ్‌వీర్‌సింగ్‌. ఇన్‌సెట్‌లో మీరు చూస్తున్న పిక్‌ అదే. ‘‘రణ్‌వీర్‌సింగ్‌ ‘రేస్‌3’ షూటింగ్‌ లొకేషన్‌లోకి వచ్చాడు. వస్తూ వస్తూ నవ్వులు మోసుకొచ్చి మా అందరికీ పంచాడు’’ అని పేర్కొన్నారు నిర్మాత రమేశ్‌. వచ్చే ఏడాది రంజాన్‌ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement