
వధువుల పరుగో పరుగు
బ్యాంకాక్: థాయ్ లాండ్లో వధువుల పరుగు పోటీలు ఆకట్టుకున్నాయి. ఇది ఏదో సరదాకోసం జరిగిన పరుగు పోటీలు అనుకుంటే పొరపాటే. ఈ పోటీల్లో విజేతలకు అక్షరాల 27,928 యూఎస్ డాలర్లు(దాదాపు రూ.18.62లక్షలు ) నగదు బహుమతి ఉండటంతో పోటీల్లో పాల్గొన్న వధువులు చాలా సీరియస్గానే ప్రయత్నించారు. అంతేకాకుండా ఈ పోటీల్లో పాల్గొనే వారు తప్పకుండా తమ వెడ్డింగ్ గౌన్లనే ధరించాలనే నిబంధన ఉంది. 'రన్నింగ్ ఆఫ్ ది బ్రైడ్స్' పేరుతో జరిగిన ఈ పోటీల్లో పొడగాటి గౌన్లను ధరించి తమ కాబోయే భర్తలతో కలిసి పరుగెత్తారు. ఎవరైతే ముందుగా లక్ష్యాన్ని చేరుకుంటారో ఆ జంటను విజేతగా ప్రకటిస్తారు.
అయితే ఈ పోటీల వేనుక మరోకోణం కూడా ఉంది. ఖరీదైన వివాహా వేడుకలకు అడ్డాగా చేసేందుకు, బ్యాంకాక్ ఇలాంటి పోటీలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. బ్యాంకాక్ టూరిజం ఆథారిటీ తెలిపిన లెక్కల ప్రకారం బ్యాంకాక్లో ఖరీదైన వివాహాలు చేసుకునే దేశాల్లో భారత్ ముందంజలో ఉంది.