ఉన్నత విద్య కోసం అమెరికాకు పరుగులు పెడుతున్న మనదేశ విద్యార్థుల్లో హైదరాబాద్‌కు చెందినవారే ఎక్కువగా ఉన్నారట.
హూస్టన్: ఉన్నత విద్య కోసం అమెరికాకు పరుగులు పెడుతున్న మనదేశ విద్యార్థుల్లో హైదరాబాద్‌కు చెందినవారే ఎక్కువగా ఉన్నారట. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీ, ముంబైలను కలిపి లెక్కించినా హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లేవారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్టు బ్రూకింగ్స్ ఇన్ స్టిట్యూషన్ ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. 2008 నుంచి 2012 మధ్య కాలంలో అమెరికా కాలేజీలకు, యూనివర్సిటీలకు విద్యార్థులను పంపినవాటిలో సియోల్, బీజింగ్, షాంగైల తర్వాతి స్థానంలో హైదరాబాద్ నగరం నిలిచింది.
ఐదో స్థానంలో రియూద్ ఉంది. హైదరాబాద్ నుంచి 26,220 మంది విద్యార్థులు (ఎఫ్1 వీసా) వెళ్లగా, మన దేశంలో హైదరాబాద్ తర్వాతి స్థానంలో ఉన్న ముంబై నుంచి 17,294 మంది వెళ్లారు. హైదరాబాద్ జంట నగరం సికింద్రాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం కూడా బ్రూకింగ్స్ జాబితా లో చోటు సంపాదించుకున్నారుు. ముంబై, న్యూఢిల్లీ వంటి నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్ విద్యార్థులను చేర్చుకుంటున్న కొన్ని విద్యాసంస్థలు అంత సుపరిచితమైనవి కావని కూడా అధ్యయనం వెల్లడించింది.