
అది ముంబైలో ‘రేస్ 3’ సినిమా కోసం వేసిన సెట్. ఫస్ట్ డే షూట్‌లో పాల్గొనడానికి అనిల్ కపూర్ ఆ సెట్‌లోకి అడుగుపెట్టారు. అంతే.. ‘రేస్ 3’ చిత్రబృందం సెల్‌ఫోన్ కెమెరాల్లో ఆయన్ను బంధించారు. డేట్స్ ఇచ్చిన అన్ని రోజులూ అనిల్ కపూర్ ‘రేస్ 3’ లొకేషన్‌కి వెళతారు కదా.. ఇలా ఆయనతో ఫొటోలు దిగడానికి తొలి రోజే ఎందుకంత తొందరపడ్డారు అంటే.. రీజన్ ఉంది. సోమవారం ఆయన బర్త్‌డే. ఏడాదిలో ఒక్కసారే బర్త్‌డే వస్తుంది కదా. అందుకే అందరూ ఫొటోలు దిగారు.
ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. బర్త్‌డే సెలబ్రేషన్స్‌తో పాటు క్రిస్మస్ వేడుకలను కూడా ఒకేసారి సెట్‌లో సెలబ్రేట్ చేసింది ‘రేస్ 3’ చిత్రబృందం. అంటే డబుల్ సెలబ్రేషన్స్ అన్నమాట. రెమో డిసౌజా దర్శకత్వంలో అనిల్ కపూర్, సల్మాన్‌ఖాన్, బాబీ డియోల్, అర్జున్ కపూర్, పూజా హెగ్డే కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘‘షూటింగ్ లొకేషన్స్‌లో బర్త్‌డే పార్టీలు బోరింగ్‌గా ఉంటాయన్న మాటలు అవాస్తవం. నా బర్త్‌డేను ఎక్స్‌ట్రా స్పెషల్‌గా సెలబ్రేట్ చేసిన చిత్రబృందానికి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు అనిల్ కపూర్.
Comments
Please login to add a commentAdd a comment