Pooja Hegde: అలాంటి పాత్రలు చేయాలంటే చిన్నప్పుడు చాలా భయంగా ఉండేది | Pooja Hegde Opens Up On Her Film Industry Career - Sakshi
Sakshi News home page

చిన్నప్పుడు చేయాలంటే చాలా భయంగా ఉండేది: పూజా హేగ్డే

Apr 18 2023 7:03 AM | Updated on Apr 18 2023 8:43 AM

Pooja Hegde Open About Her Career  - Sakshi

పూజా హేగ్డే కంటే బుట్టబొమ్మ అంటేనే అభిమానులకు గుర్తు పట్టేస్తారు. టాలీవుడ్‌ ప్రేక్షకుల గుండెల్లో అంతలా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సల్లుభాయ్ సరసన 'కిసీ కా భాయ్.. కీసి కీ జాన్' సినిమాలో నటించింది. ఈనెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బుట్టబొమ్మ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. 

పూజా హేగ్డే మాట్లాడుతూ.. 'నేను కథలు చెప్పడానికే ఉన్నా. సినిమాల్లో ఒక పాట కూడా కథ చెబుతుంది. అందుకే నాకు నచ్చినప్పుడు పాటలూ చేస్తుంటా. చిన్నప్పుడు డాన్స్‌ చేయాలంటే భయంగా ఉండేది.  భరతనాట్యం నేర్చుకొమ్మని మా అమ్మ చెప్పారు. ఆ రోజు నుంచి ఆస్వాదించడం అలవాటు చేసుకున్నా. అప్పటి నుంచి ప్రత్యేకమైన పాటలపై ఆసక్తి పెరిగింది. ఇక నటన విషయాకొనిస్తే ప్రతి భాషలోనూ ఓ ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఏ భాషలోనైనా నటించడాన్ని గౌరవంగా భావిస్తా. నటిగా నాకు ఇంకా చాలా టార్గెట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మహిళల్లో  స్ఫూర్తిని నింపే పాత్రలు చేయాలని ఉంది.' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేశ్‌ బాబు సినిమాలో నటిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement