
‘రేస్’ సిరీస్‌లో మూడో సినిమా వస్తోంది. హిట్ సినిమాల్లో సాధారణంగా 1, 2 3.. అని సీక్వెల్స్ వస్తూ ఉంటాయి. ఆ సీక్వెల్స్‌లో ఉన్న పాత్రలు మొదటిదానికంటే రెండోది, రెండోదానికి కంటే మూడోది.. రేసులో ముందుండాలని చేసే ప్రయత్నం ముచ్చటగా అనిపిస్తుంది. మనకు ముచ్చటే గానీ, వారికి ముచ్చెమటలే. బాబీ డియోల్‌ను చూడండి.
మన ఐరన్ మ్యాన్ ధర్మేంద్ర కొడుకు. చాలా సినిమాల్లో చేశాడు. బొద్దుగా, రౌండుగా, లవ్లీగా ఉంటాడు. కానీ ‘రేస్ 3’ లో మాత్రం రేసు గుర్రంలా ఉన్నాడు. ఈ మాట మనం అనడం కాదు. షర్టు తీసి, కండలు చూపించే సల్లూ భాయే అంటున్నాడు. ‘బాబీ డియోల్ హాట్ బాడ్’ చూస్తే.. మీరందరూ నోరెళ్లబెడతారు’ అని సల్మాన్ అంటే.. ‘కష్టానికి తగిన ఫలితం ఇచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది’ అని బాబీ డియోల్ అన్నాడు. మీడియా మాత్రం ‘అచ్చు.. వాళ్ల డాడ్ బాడ్’ అని చమత్కరించింది.. బాబీ డియోల్ బాడీని చూసి.
Comments
Please login to add a commentAdd a comment