
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
కంచికచర్ల, న్యూస్‌లైన్ : స్థానిక పేరకలపాడు అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. స్థానిక ఎస్సై అల్లు దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వేములపల్లి గ్రామానికి చెందిన ధర్మవరపు రామకృష్ణ(24) మోటార్‌సైకిల్‌పై కంచికచర్ల వచ్చాడు. స్వగ్రామం తిరిగి వెళుతూ పేరకలపాడు అడ్డరోడ్డుకు సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్‌లోకి ఆయిల్ కోసం వెళేందుకు బైక్‌ను అకస్మాతుగా తిప్పాడు. అదే సమయంలో విజయవాడ వైపు వేగంగా వెళ్తున్న కారు అతడి వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో రామకృష్ణ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెం దాడు. పోలీసులు వచ్చి, వివరాలు సేకరించా రు. మృతదేహాన్ని నందిగామ ప్రభుత్వాస్పత్రి కి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై చెప్పారు.
ట్రాక్టర్ పైనుంచి పడి మరొకరు..
కోరుకొల్లు (కలిదిండి) : ట్రాక్టర్‌పై నుంచి పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మం డలంలో జరిగింది. స్థానికుల కధనం ప్రకా రం.. మండలంలోని సానారుద్రవరం గ్రామాని కి చెందిన ట్రాక్టర్‌పై భాస్కరరావుపేట గ్రామానికి చెందిన కడలి నాగప్రసాద్ (25) కూలి పనికి వెళ్ళాడు. తోటి కూలీలతో డ్రమ్ముల్లో చేప పిల్లలను వేసి వాటిని చైతన్యపురం గ్రామానికి తీసుకువెళ్లాడు. అక్కడ చేపల చెరువుల వద్ద అన్‌లోడ్ చేసి తిరుగు ప్రయాణమయ్యాడు. కోరుకొల్లు పంచాయతీ శివారు బొబ్బిలిగూడెం వద్ద ఉన్న మలుపులో ట్రక్కుపై ఉన్న నాగప్రసాద్ జారి రహదారిపై పడిపోయాడు. తీవ్రం గా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెం దాడు. నాగప్రసాద్ తండ్రి సత్యనారాయణ పో లీసులకు ఫిర్యాదు మేరకు ఎస్సై బాలశౌరి సిబ్బందితో ఘటనాస్థలికి వెళ్లి, వివరాలు సేకరించారు. పోస్టుమార్డం నిమిత్తం కైకలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
లారీ చెట్టును ఢీకొని డ్రైవర్..
రెడ్డిగూడెం : శ్రీరామపురం క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో లారీ చెట్టును ఢీకొంది. తాతకుంట్లకు చెందిన షేక్ మౌలాలీ(50) ఎ.కొండూరు నుంచి లారీ న డుపుకుంటూ విస్సన్నపేట వైపు వస్తున్నాడు. మార్గమధ్యంలో శ్రీరామపురం క్రాస్ రోడ్డు వద్ద మరో లారీని ఓవర్‌టేక్ చేసేందుకు యత్నిం చాడు. దీంతో లారీ అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మౌలాలీ కాళ్లు విరిగిపోయాయి. ఆ ప్రాంతంలో ఉన్న వారు అందించిన సమాచారంతో 108 సి బ్బంది వచ్చి, అతడిని విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మరణించాడు. ఆస్పత్రిలో మౌలాలీ ఇచ్చిన వాగ్మూలంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై తులసీ రామకృష్ణ తెలిపారు.