అనకాపల్లి అర్బన్ - మల్కాపురం, న్యూస్‌లైన్: అనారోగ్యంతో బాధపడుతున్న బంధువును పరామర్శించేందుకు వెళ్తున్న తల్లీకొడుకులను లారీ రూపం లో మృత్యువు కబళించింది. మోటారు సైకిలుపై వెళ్తున్న వారిని మరో మోటా రు సైక్లిస్టు డీకొట్టిన ప్రమాదంలో కిందపడిన వీరిపై నుంచి వెనుక వస్తున్న లా రీ వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పండగ వేళ మృతుల కుటుంబాన్ని విషాదం చుట్టుముట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలావున్నాయి.
గాజువాక సమీపంలోని మల్కాపురం క్రాంతినగర్‌కు చెందిన తోట పైడమ్మ (45), కొడుకు నానాజీ (25)లు ఆదివారం ఉదయం చోడవరం మండలం చౌడువాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు మోటారు సైకిల్‌పై బయలుదేరారు. 11 గంటల సమయం లో అనకాపల్లి మండల పరిధిలోని జల గల మదుం సమీపాన వీరి మోటారు సైకిల్‌ను ఎదురుగా వస్తున్న మరో మో టారు సైక్లిస్టు ఢీకొట్టాడు.
ఘటనానంతరం ప్రమాదానికి కారకుడైన మోటా రు సైక్లిస్టు రోడ్డు ఎడమ వైపునకు పడిపోగా, పైడమ్మ, నానాజీలు ఎడమవైపు పడిపోయారు. అదే సమయంలో వెను క నుంచి వస్తున్న లారీ వీరు తేరుకునేలోగానే వారిని ఢీకొట్టి 15 అడుగుల దూరం ఈడ్చుకుంటూ వెళ్లిపోవడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఈ దుర్ఘటనతో దిగ్భ్రమకు గురైన మోటా రు సైక్లిస్టు, లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడ నుంచి పరారయ్యారు. అనకాపల్లి పట్టణ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాలను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.
క్రాంతినగర్‌లో విషాదం
పైడమ్మ, నానాజీల మృతి దుర్ఘటన క్రాంతినగర్‌లో విషాదాన్ని నింపింది. సోమవారం వినాయక చవితి కావడంతో కుటుంబ సభ్యులంతా ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లలో మునిగి ఉండగా అందిన సమాచారంతో దిగ్భ్రమకు గురయ్యారు. బంధువులు హుటాహుటిన ఘటనా స్థలికి బయలుదేరి వెళ్లారు. అప్పారావు, పైడమ్మ దంపతులకు నా నాజీ, మంగ కొడుకూ కూతురు.
కుమార్తెకు పెళ్లయింది. నానాజీ డాక్ యార్డు లో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. కొడుకు అందుకు రావడంతో అతన్ని ఓ ఇంటి వాడిని చేసి తమ బాధ్యత తీర్చుకోవాలని కలలు కంటున్న ఆ తండ్రి జరిగిన ఘటనతో షాకయ్యారు. భార్యా, బిడ్డ ఒకేసారి చనిపోయారన్న సమాచారం తో భోరుమంటూ కుప్ప కూలిపోయా రు. గుండెపగిలేలా ఏడుస్తున్న ఆయన ను చూసి పలువురు కంటతడిపెట్టారు.
విదేశాలకు వెళ్లాలనుకుని...
వృత్తి విద్యలో శిక్షణ పొందిన నానాజీ కొన్నాళ్లు విదేశాల్లో ఉద్యోగం చేసి గత ఏడాదే స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఒక్కగానొక్కకొడుకు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశించిన అప్పారావు దంపతులు తమ పాల వ్యాపారంతో వచ్చే అరకొర ఆదాయంతోనే కొడుకుని చదవించారు.
కొడుకు ప్రయోజకుడై విదేశాల్లో ఉపాధి పొందడంతో సంతోషించారు. గత ఏడాది స్వదేశానికి వచ్చి న ఆయన మళ్లీ విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగానే నానాజీతోపాటు అతని తల్లినీ మృత్యువు కబ ళించింది. ‘ఆదుకుంటాడనుకున్న కొడుకు, జీవితాంతం తోడుంటానని ప్రమా ణం చేసి నువ్వు నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయారా పైడమ్మా’ అంటూ వారి చిత్రపటాలు పట్టుకుని భోరుమంటున్న అప్పారావును ఆపడం ఎవరి తరమూ కాలేదు.
రోడ్డు ప్రమాదంలో తల్లీ కొడుకుల మృతి
Published Mon, Sep 9 2013 4:08 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
Advertisement