paidamma
-
కేజీబీవీ విద్యార్థిని మృతి
బొండపల్లి: కూరగాయల మీద దోమలు, స్టోర్‌రూం, డైనింగ్ రూంలో చెత్త, గచ్చులపై మురికి, నీటి తొట్టెలో చనిపోయి కుళ్లిపోయిన ఎలుకలు, పందికొక్కుల శరీరభాగాలు... దేవుపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పరిస్థితులివి. ఈ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతున్న ఎస్టీ బాలిక బోయిన పైడమ్మ కడుపునొప్పితే శనివారం మృతి చెందింది. విద్యాలయంలో ఉన్న పరిస్థితుల వల్లే బాలిక అనారోగ్యానికి గురైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టోర్ రూమ్‌లో ఎవరు ప్రవేశించినా రూ.5 జరిమానా విధిస్తామని పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో ఆ రూమ్‌లోకి వెళ్లేందుకు విద్యార్థులు భయపడుతున్నారు. అలాగే బాలికలను పట్టించుకునే వారే అక్కడ కరువయ్యారు. పాఠశాల వాతావరణం దుర్గంధ భూయిష్టంగా మారాంది. దుర్భరమైన పరిస్థితుల మధ్య విద్యార్థినులు తప్పనిసరి పరిస్థితుల్లో చదువుకొనసాగిస్తున్నారు. పాఠశాలలో 200 మందిగాను 156 మంది విద్యార్థులను మాత్రమే ఉన్నారు. అధికారుల పరిశీలనలోనూ ఈ విషయాలే వెల్లడయ్యాయి... రామభద్రపురం మండలం ఆర్.చింతలవలస గ్రామానికి చెందిన 12 ఏళ్ల బోయిన పైడమ్మకు తల్లిదండ్రులు లేరు. ఆమె సంరక్షకుడు, మేనమామ కె.శేఖర్ జూన్ 25, 2014లో దేవుపల్లి కేజీబీవీలో ఆమెను చేర్పించాడు. ఆమెకు ఈ నెల నా లుగో తేదీన కేజీబీవీలో ఉండగా కడుపునొప్పి వచ్చింది. దీంతో విద్యాలయానికి చెందిన ఏఎన్ఎం ప్రథమ చికిత్స అందించి దేవుపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం పైడమ్మ ఆరోగ్యం ఇంకా క్షీణించింది. దీంతో బాలిక మేనమామ ఆమెను మార్చి 5న స్వగ్రామం తీసుకెళ్లిపోయారు. అయితే శనివారానికే పైడమ్మ చనిపోయింది. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ బండారు బాలాజీ,తహశీల్దార్ నీలకంఠరావు, ఈఓపీఆర్డీ రవికుమార్ విలేకరులతో పాటు కేజీబీవీకి వెళ్లి పరిస్థితులను కళ్లారా చూశారు. వారు వెళ్లిన సమయానికి ప్రత్యేకాధికారి లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయలపై ముసురుతున్న ఈగలు, అక్కడి అపారిశుద్ధ్యాన్ని చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటి తొట్టెలో చనిపోయి కుళ్లిపోయిన ఎలుకలు, పందికొక్కుల శరీరభాగాలు తేలడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా గర్ల్స్ అండ్ ైచె ల్డ్ డెవలప్ మెంట్ అధికారి సత్యవతి వచ్చి పరిశీలించారు. ప్రత్యేకాధికారి జి.సరస్వతిపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తానని తెలిపారు. అధికారుల ఎదుటే వాంతులు అధికారులు పరిశీలనకు వెళ్లిన సమయంలో ఓ విద్యార్థిని వాంతులు చేసుకుంటూ కనిపించింది. ఏఎన్ఎం అక్కడే ఆమెకు మాత్రలు మింగిస్తున్నారు. కేజీబీవీలో ఆహారం రుచిగా ఉండడం లేదని, నాసిరకం బియ్యం వండి పెడుతున్నారని, కుళ్లిపోయిన కూరగాయాలు పెడుతున్నారని సాక్షాత్తు తహశీల్దార్ నీలకంఠరావు తీవ్ర ఆగ్రహంతో చెప్పారు. కలెక్టర్‌తో చెప్పి సిబ్బందిపై, ప్రత్యేకాధికారిపై చర్యలు తీసుకుంటామని జెడ్పీటీసీ బాలాజీ హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో తల్లీ కొడుకుల మృతి
అనకాపల్లి అర్బన్ - మల్కాపురం, న్యూస్‌లైన్: అనారోగ్యంతో బాధపడుతున్న బంధువును పరామర్శించేందుకు వెళ్తున్న తల్లీకొడుకులను లారీ రూపం లో మృత్యువు కబళించింది. మోటారు సైకిలుపై వెళ్తున్న వారిని మరో మోటా రు సైక్లిస్టు డీకొట్టిన ప్రమాదంలో కిందపడిన వీరిపై నుంచి వెనుక వస్తున్న లా రీ వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పండగ వేళ మృతుల కుటుంబాన్ని విషాదం చుట్టుముట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలావున్నాయి. గాజువాక సమీపంలోని మల్కాపురం క్రాంతినగర్‌కు చెందిన తోట పైడమ్మ (45), కొడుకు నానాజీ (25)లు ఆదివారం ఉదయం చోడవరం మండలం చౌడువాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు మోటారు సైకిల్‌పై బయలుదేరారు. 11 గంటల సమయం లో అనకాపల్లి మండల పరిధిలోని జల గల మదుం సమీపాన వీరి మోటారు సైకిల్‌ను ఎదురుగా వస్తున్న మరో మో టారు సైక్లిస్టు ఢీకొట్టాడు. ఘటనానంతరం ప్రమాదానికి కారకుడైన మోటా రు సైక్లిస్టు రోడ్డు ఎడమ వైపునకు పడిపోగా, పైడమ్మ, నానాజీలు ఎడమవైపు పడిపోయారు. అదే సమయంలో వెను క నుంచి వస్తున్న లారీ వీరు తేరుకునేలోగానే వారిని ఢీకొట్టి 15 అడుగుల దూరం ఈడ్చుకుంటూ వెళ్లిపోవడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఈ దుర్ఘటనతో దిగ్భ్రమకు గురైన మోటా రు సైక్లిస్టు, లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడ నుంచి పరారయ్యారు. అనకాపల్లి పట్టణ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాలను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్రాంతినగర్‌లో విషాదం పైడమ్మ, నానాజీల మృతి దుర్ఘటన క్రాంతినగర్‌లో విషాదాన్ని నింపింది. సోమవారం వినాయక చవితి కావడంతో కుటుంబ సభ్యులంతా ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లలో మునిగి ఉండగా అందిన సమాచారంతో దిగ్భ్రమకు గురయ్యారు. బంధువులు హుటాహుటిన ఘటనా స్థలికి బయలుదేరి వెళ్లారు. అప్పారావు, పైడమ్మ దంపతులకు నా నాజీ, మంగ కొడుకూ కూతురు. కుమార్తెకు పెళ్లయింది. నానాజీ డాక్ యార్డు లో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. కొడుకు అందుకు రావడంతో అతన్ని ఓ ఇంటి వాడిని చేసి తమ బాధ్యత తీర్చుకోవాలని కలలు కంటున్న ఆ తండ్రి జరిగిన ఘటనతో షాకయ్యారు. భార్యా, బిడ్డ ఒకేసారి చనిపోయారన్న సమాచారం తో భోరుమంటూ కుప్ప కూలిపోయా రు. గుండెపగిలేలా ఏడుస్తున్న ఆయన ను చూసి పలువురు కంటతడిపెట్టారు. విదేశాలకు వెళ్లాలనుకుని... వృత్తి విద్యలో శిక్షణ పొందిన నానాజీ కొన్నాళ్లు విదేశాల్లో ఉద్యోగం చేసి గత ఏడాదే స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఒక్కగానొక్కకొడుకు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశించిన అప్పారావు దంపతులు తమ పాల వ్యాపారంతో వచ్చే అరకొర ఆదాయంతోనే కొడుకుని చదవించారు. కొడుకు ప్రయోజకుడై విదేశాల్లో ఉపాధి పొందడంతో సంతోషించారు. గత ఏడాది స్వదేశానికి వచ్చి న ఆయన మళ్లీ విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగానే నానాజీతోపాటు అతని తల్లినీ మృత్యువు కబ ళించింది. ‘ఆదుకుంటాడనుకున్న కొడుకు, జీవితాంతం తోడుంటానని ప్రమా ణం చేసి నువ్వు నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయారా పైడమ్మా’ అంటూ వారి చిత్రపటాలు పట్టుకుని భోరుమంటున్న అప్పారావును ఆపడం ఎవరి తరమూ కాలేదు.