బైక్ ఢీ.. ఒకరి దుర్మరణం | Collided with the bike. One killed | Sakshi
Sakshi News home page

బైక్ ఢీ.. ఒకరి దుర్మరణం

Published Tue, Sep 24 2013 2:20 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM

Collided with the bike. One killed

జి.తిర్మలగిరి(చివ్వెంల), న్యూస్‌లైన్: అతివేగంగా వస్తున్న మోటార్‌సైకిల్ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని జి.తిర్మలగిరి ఆవాసం గుంపుల గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన సందా సుధాకర్‌రెడ్డి(32) తన వ్యవసాయ పొలం వద్దకు నడుచుకుంటూ వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈదే క్రమంలో పెన్‌పహాడ్ మండలం ధర్మాపురం ఆవాసం గంగ్లీ తండాకు చెందిన మాలోతు వెంకన్న తన ఇద్దరు కూతుళ్లతో మోటార్‌సైకిల్‌పై జి.తిర్మలగిరి వైపు వెళ్తూ రోడ్డు దాటుతున్న సుధాకర్‌రెడ్డిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సుధాకర్‌రెడ్డికి తీవ్రగాయాలై మృతిచెందా డు. వెంకన్న అతని కూతుళ్లకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అంగోతు భోజ్యనాయక్ కేసు  దర్యాప్తు జరుపుతున్నారు.
 
 బస్సు, కారు ఢీ..
 ప్రమాద స్థలంలో రోడ్డుపై బైక్ పడి ఉండటంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సు డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న కారు, బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement