
పొడవాటి మోటార్ సైకిల్
తిక్క లెక్క
మోటార్ సైకిల్ ఎంత పొడవుంటుందేంటి? మహా అయితే కాస్త అటూ ఇటుగా ఆరడుగులు ఉంటుందేమో! అంటారా..? మోటార్ సైకిల్ మీద ఎంత మంది కూర్చోగలరు..? చట్టబద్ధంగా అయితే ఇద్దరు... అయినా ఇండియాలో నలుగురైదుగురు కూడా కూర్చుంటుంటార్లెండి అనుకుంటున్నారా..? ఇదిగో ఈ మహా మోటార్ సైకిల్‌ను చూడండి.
దీని పొడవు ఏకంగా 72 అడుగులు. ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్ సైకిల్‌గా గిన్నెస్ రికార్డు సాధించిన ఈ వాహనం మీద ఏకంగా పాతిక మంది సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. బ్రిటన్‌లోని లింకన్‌షైర్‌కు చెందిన కోలిన్ ఫర్జ్ అనే ప్లంబర్ దీనిని రూపొందించాడు. దీని తయారీకి ఒక 125 సీసీ ఇంజన్ మోపెడ్‌ను పూర్తిగా, మరో మోపెడ్‌లోని సగభాగాన్ని ఉపయోగించాడు.