Polaris India
-
పొలారిస్ లగ్జరీ బైక్ ‘ రూ.32 లక్షలు
న్యూఢిల్లీ: పొలారిస్ ఇండియా మరో కొత్త లగ్జరీ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. అమెరికా లగ్జరీ బైక్ బ్రాండ్ ‘ఇండియన్ మోటార్ సైకిల్’ను ఈ సంస్థ భారత్‌లో విక్రరుుస్తోంది. తాజాగా ఈ బ్రాండ్‌లో ‘ఇండియన్ చెఫ్టెరుున్ డార్క్‌హార్స్’ పేరుతో లగ్జరీ బైక్‌ను రూ.31.99 లక్షల ధర(ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)కు అందిస్తోంది. ఈ బైక్‌లో సోలో సీట్, ఏబీఎస్, ఎలక్ట్రానిక్ క్రూరుుజ్ కంట్రోల్, ఇంటిగ్రేటెడ్ ప్రీమియమ్ ఆడియో సిస్టమ్, రిమోట్ కీ తదితర ఫీచర్లు ఉన్నాయని పొలారిస్ ఇండియా సీఈఓ పంకజ్ దుబే చెప్పారు. ఈ కంపెనీ తాజాగా రూ.31 లక్షల ఖరీదుండే ఇండియన్ స్ప్రింగ్ఫీల్డ్ క్రూరుుజర్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. -
పొలారిస్ నుంచి ఇండియన్ స్ప్రింగ్ఫీల్డ్ బైక్
ధర రూ. 31 లక్షలు న్యూఢిల్లీ: పొలారిస్ ఇండియా కంపెనీ అంతా కొత్తదైన ఇండియన్ స్ప్రింగ్ఫీల్డ్ క్రూరుుజర్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ.31.07(ఎక్స్‌షోరూమ్ గుర్గావ్) లక్షలని పొలారిస్ ఇండియా తెలిపింది. తమ ఉత్పత్తుల్లో అత్యుత్తమైన బైక్‌ల్లో ఇండియన్ స్ప్రింగ్ఫీల్డ్ బైక్ ఒకటని కంపెనీ సీఈఓ, డెరైక్టర్ పంకజ్ దుబే చెప్పారు. అధిక బరువును భరించగలిగే చాసిస్, ఏబీఎస్, క్రూరుుజ్ కంట్రోల్, కీలెస్ స్టార్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, అడ్జెస్టబుల్ ప్యాసింజర్ ఫ్లోర్‌బోర్డ్స్, ట్యాంక్‌పై ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ గేజ్; టైమ్ క్లాక్ తదితర ప్రత్యేకతలున్నాయని వివరించారు. -
మార్కెట్లోకి పొలారిస్ ‘స్కౌట్ సిక్స్టీ’
♦ ధర రూ. 12.21 లక్షలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వాహనాల తయారీ దిగ్గజం పొలారిస్ ఇండియా తాజాగా ఇండియన్ బ్రాండ్ కింద ‘స్కౌట్ సిక్స్ టీ’ మోటార్‌సైకిల్‌ను హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.12.21 లక్షలు (హైదరాబాద్ ఎక్స్ షోరూం). పొలారిస్ ఇండియా ఎండీ పంకజ్ దూబే, మహావీర్ డెక్కన్ ఆటో సంస్థ డెరైక్టర్ వికాస్ జబక్ మంగళవారమిక్కడ ఈ బైక్‌ను ఆవిష్కరించారు. స్కౌట్ సిక్స్టీతో కలిపి దేశీయంగా మొత్తం ఏడు మోడల్స్‌ను విక్రయిస్తున్నట్లవుతుందని దూబే తెలిపారు. ఇప్పటిదాకా వెయ్యి సీసీపైగా సామర్ధ్యం గల బైక్‌లే విక్రయిస్తుండగా... ఇతర వర్గాలకు కూడా అందుబాటులో ఉండే విధంగా 999 సీసీ సామర్ధ్యం గల స్కౌట్‌ను మార్కెట్లోకి తెచ్చినట్లు ఆయన తెలియజేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 7 షోరూమ్లున్నాయని, ఈ ఏడాది ఆఖరు నాటికి వీటిని పదికి పెంచుకోనున్నామని దూబే చెప్పారు. అలాగే అక్టోబర్ లేదా నవంబర్‌లో మరో కొత్త మోడల్‌ను ప్రవేశపెడతామన్నారు. సూపర్‌బైక్‌లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో వీటి మార్కెట్ పరిమాణం ప్రస్తుతం 8,000-10,000 యూనిట్ల స్థాయికి చేరిందని తెలిపారు. 1,400 పైగా సీసీ సామర్ధ్యం గల బైక్‌ల విభాగంలో తమకు దాదాపు 10 శాతం వాటా ఉందని దూబే చెప్పారు. వాహనాల ధరల శ్రేణి రూ. 12 లక్షల నుంచి రూ. 38 లక్షల దాకా ఉందన్నారు.