హైదరాబాద్ : భారత్ స్కౌట్క్ అండ్ గైడ్స్ తెలంగాణ చీఫ్ కమిషనర్గా నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత సోమవారం దోమలగూడలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోనే స్కౌట్క్ అండ్ గైడ్స్కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. స్కౌట్క్ అండ్ గైడ్స్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని కవిత తెలిపారు.
గతంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ వేలల్లో ఉండగా, ప్రస్తుతం వందల సంఖ్యకు తగ్గిపోయారని ఎంపీ కవిత అన్నారు. స్కౌట్క్ అండ్ గైడ్స్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఏపీ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్ శశిధర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.