Chief Commissioner
-
సీఐసీ చీఫ్ కమిషనర్‌గా హీరాలాల్ సమారియా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్ (సెంట్రల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్) ప్రధాన కమిషనర్‌గా హీరాలాల్ సమారియా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో ద్రౌపదీ ముర్ము సమక్షంలో హీరాలాల్ ప్రమాణ స్వీకారం చేశారు. వైకే సిన్హా పదవీ కాలం అక్టోబర్ 3న ముగియడంతో.. సమాచార కమిషన్ నియామకాలను చేపట్టాలంటూ కేంద్రానికి ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌కు చెందిన హీరాలాల్ సమారియాను సీఐసీ చీఫ్ కమిషనర్‌గా రెండేళ్ల కాలానికి గాను కేంద్రం నియమించింది. ఈ పదవిని దళిత వర్గానికి చెందిన అధికారి చేపట్టడం ఇదే మొదటిసారి. 1985వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి హీరాలాల్ సమారియా గతంలో కేంద్ర కారి్మక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పలు విభాగాల్లో కూడా ఆయన సేవలందించారు. -
'చీఫ్ కమిషనర్‌ను నియమించాలి'
ఒంగోలు : సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్‌ను వెంటనే నియమించాలని ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు సంఘం రాష్ట్ర కార్యదర్శి జి. బాలకృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి పుష్కర కాలమైనా ఇంకా బాలారిష్టాలను ఎదుర్కొంటూనే ఉందని విచారం వ్యక్తం చేశారు. 2010లో నియమించిన చీఫ్ కమిషనర్ జన్నత్‌హుస్సేన్ అనంతరం ఇప్పటివరకు ఎవరినీ నియమించలేదన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఉమ్మడి కమీషన్ కార్యాలయం హైదరాబాద్‌లోనే కొనసాగుతోందన్నారు. చిన్న చిన్న సమస్యలు కూడా స్థానికంగా పరిష్కారం కాకపోవడంతో సంబంధిత వ్యక్తులు హైదరాబాద్ వెళ్లలేక మధ్యలోనే ఆగిపోతున్నారన్నారు. కమిషనర్ల సంఖ్యను పెంచి చీఫ్ కమిషనర్ కార్యాలయాన్ని రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేసులు వాయిదా వేయకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. సమాచార హక్కు చట్టం అమలుచేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లా కో ఆర్డినేషన్ కమిటీని కలెక్టర్ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
ఏపీ, టీఎస్ ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ గా సురేష్ బాబు
-
ఏపీ, టీఎస్ ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ గా సురేష్ బాబు
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇన్‌కం ట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ గా సురేష్ బాబు నియమితులైయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆయన్ను ఇరు రాష్ట్రాల ఇన్‌కం ట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఇక నుంచి ఆయన ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపన్ను చీఫ్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 1979 బ్యాచ్ కు చెందిన సురేష్ బాబుది చిత్తూరు జిల్లా. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ నుంచి ఎకనమిక్స్ లో ఆయన పీజీ చేశారు. -
కొత్త అవతారంలో కవిత
-
స్కౌట్స్ అండ్ గైడ్స్ టీ.చీఫ్ కమిషనర్‌గా కవిత
హైదరాబాద్ : భారత్ స్కౌట్క్ అండ్ గైడ్స్ తెలంగాణ చీఫ్ కమిషనర్‌గా నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత సోమవారం దోమలగూడలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోనే స్కౌట్క్ అండ్ గైడ్స్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. స్కౌట్క్ అండ్ గైడ్స్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని కవిత తెలిపారు. గతంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ వేలల్లో ఉండగా, ప్రస్తుతం వందల సంఖ్యకు తగ్గిపోయారని ఎంపీ కవిత అన్నారు. స్కౌట్క్ అండ్ గైడ్స్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఏపీ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్ శశిధర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఎగుమతుల్లో ఉమ్మడి రాష్ట్రానిది ఐదోస్థానం
కస్టమ్స్ చీఫ్ కమిషనర్ దీప బి దాస్‌గుప్తా కాకినాడ: పోర్టు ఎగుమతుల్లో అవిభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదో స్థానంలో నిలిచిందని కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ చీఫ్ కమిషనర్ దీప బి దాస్ గుప్తా పేర్కొన్నారు. కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్‌కు సంబంధించిన పలు అంశాలపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఐఈఓ), ది కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్, ఆంధ్రాబ్యాంకు, కృష్ణపట్నం పోర్టు సంయుక్తంగా మంగళవారం కాకినాడలోని హెలికాన్ టైమ్స్‌లో చర్చా గోష్టి ఏర్పాటు చేశాయి. ముఖ్య అతిథిగా దీప విచ్చేశారు. కార్యక్రమంలో ఎఫ్ఐఈఓ సదరన్ రీజియన్ చైర్మన్ వాల్టర్ డిసౌజా మాట్లాడుతూ గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక తర్వాతి స్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్దని అన్నారు. ఆంధ్రా పోర్టుల నుంచి ఈ ఏడాది సుమారు రూ.60 వేల కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయన్నారు. కాకినాడలో కస్టమ్స్ కమిషనరేట్ తొలి కమిషనర్‌గా శివనాగ కుమారి కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ కమిషనరేట్ కాకినాడలో ఏర్పాటు కానుంది. కమిషనరేట్ ఏర్పాటుకు ప్రక్రియ పూర్తయ్యిందని, విశాఖలో ఉన్న కమిషనరేట్-2 కార్యాలయాన్ని కాకినాడకు తరలించడం ఒక్కటే మిగిలి ఉందని బుధవారం కాకినాడలో ఎగుమతి, దిగుమతిదారుల సమావేశానికి వచ్చిన చీఫ్ కమిషనర్ దీపా బి దాస్‌గుప్తా ‘సాక్షి’కి ధ్రువీకరించారు. విశాఖపట్నం-2 కమిషనరేట్ కమిషనర్‌గా పనిచేస్తున్న బీవీ శివనాగ కుమారి అదే హోదాలో ఇక్కడకు రానున్నారు.