హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇన్‌కం ట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ గా సురేష్ బాబు నియమితులైయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆయన్ను ఇరు రాష్ట్రాల ఇన్‌కం ట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
దీంతో ఇక నుంచి ఆయన ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపన్ను చీఫ్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 1979 బ్యాచ్ కు చెందిన సురేష్ బాబుది చిత్తూరు జిల్లా. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ నుంచి ఎకనమిక్స్ లో ఆయన పీజీ చేశారు.