గుంటూరు ఎడ్యుకేషన్ : కర్ణాటకలోని మైసూరులో ఈనెల 29 నుంచి జనవరి 4వ తేదీ వరకూ జరిగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ మహా సమ్మేళనంలో జిల్లా నుంచి 40 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులు రెడ్డి ఓప్రకటనలో తెలిపారు.
29 నుంచి కర్ణాటకలో స్కౌట్స్, గైడ్స్ జాతీయ సమ్మేళనం
Published Mon, Dec 26 2016 10:32 PM | Last Updated on Sat, Sep 15 2018 8:00 PM
గుంటూరు ఎడ్యుకేషన్ : కర్ణాటకలోని మైసూరులో ఈనెల 29 నుంచి జనవరి 4వ తేదీ వరకూ జరిగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ మహా సమ్మేళనంలో జిల్లా నుంచి 40 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులు రెడ్డి ఓప్రకటనలో తెలిపారు. మహా సమ్మేళనంలో దేశంలోని 29 రాష్ట్రాలతో పాటు అనేక దేశాల నుంచి దాదాపు 30 వేల మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, ఆహార అలవాట్లు తెలుసుకునేందుకు మహా సమ్మేళనం ద్వారా అవకాశముంటుందన్నారు. మహా సమ్మేళనంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని తెలిపారు. జిల్లాకు చెందిన 40 మంది విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్ తరఫున రాష్ట్రంలోనే పెద్ధ కంటింజెంట్‌గా పాల్గొంటున్నారని వివరించారు.
Advertisement
Advertisement