ప్రతీకాత్మకచిత్రం
బెంగళూరు: ప్రేమించిన అమ్మాయిని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఓ కుటుంబంలో విషాదాన్ని నింపిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. హసన్ జిల్లా చన్నరాయపట్నానికి చెందిన సాకమ్మ.. యశ్వంతపూర్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో పనిచేస్తోంది. అదే చోట అరుణ్ అనే వ్యక్తి కూడా పనిచేస్తున్నాడు. వీరివురి మధ్య రెండేళ్లుగా ప్రేమాయణం సాగుతోంది. ఈ విషయాన్ని పెద్దలకు చెప్పి, ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ప్రేమ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పగా.. ఇరు కుటుంబాలు వారి నిర్ణయాన్ని వ్యతిరేకించాయి.
చదవండి: (ఫోన్ మాట్లాడొద్దన్నా వినలేదు.. షాపుకు వెళ్లొస్తానని చెప్పి..)
అయితే.. అరుణ్ ఇటీవల తన తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించాడు. కానీ సాకమ్మ కుటుంబం ససేమిరా అన్నది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో అరుణ్ తన స్నేహితుడితో ఒక చిన్న అబద్ధం ఆడించాడు. తన ఫ్రెండ్ గోపాల్ చేత పోలీసులమని చెప్తూ.. సాకమ్మ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించాడు. 'అరుణ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అందుకు కారణం మీ కుటుంబమే. అతడికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి లేకపోతే అరెస్ట్ చేస్తాం’ అంటూ తన స్నేహితునితో చెప్పించాడు.
చదవండి: (హైదరాబాద్: నవ వధువు ఆత్మహత్య)
దీంతో బయపడిపోయిన సాకమ్మ ఓ లెటర్ రాసిపెట్టి ఆత్మహత్యకు పాల్పడింది. ‘అరుణ్‌తో పెళ్లికి మా రెండు కుటుంబాలు వ్యతిరేకించడం నాకు బాధ కలిగించింది. అతడు లేకుండా నేను జీవించలేను’ అని సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకుంది. అరుణ్ చేయించిన ఒక్క ఫోన్ కాల్ సాకమ్మ ప్రాణాలు తీసుకునేలా చేసింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తమ కుమార్తె మృతికి ఆ ఫోన్ కాల్ కారణమంటూ అరుణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరుణ్, గోపాల్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment