సాక్షి: ముంబై: వాలెంటైన్స్ డే సందర్భంగా ఏఐ సంచలనం చాట్‌జీపీటీ క్రేజ్‌ను లవ్‌బర్డ్స్ కూడా బాగానే క్యాష్ చేసుకుంటున్నారు.లవర్స్ ఇంప్రెస్ చేసేందుకు చాట్‌జీపీటీ సాయం తీసుకుంటున్నారట అబ్బాయిలు. ప్రేమలేఖలు రాయడానికి భారతీయ పురుషులు, టీనేజర్లు చాట్ జీపీటీ సహాయం తీసుకుంటున్నారని తాజాగా ఒక సర్వే వెల్లడించింది. అంతేకాదు 73 శాతం మంది డేటింగ్ యాప్‌లలో తమ ప్రొఫైళ్లను మార్చుకునేందుకు ఏఐ టూల్‌ని వాడుకోవాలని చూస్తున్నారట.
(ఇది కూడా చదవండి: Valentines Day2023: జియో బంపర్ ఆఫర్స్)
తమ స్వీటీలను ఎలాగైనా ఆకర్షించాలనే ఉద్దేశంతో 60 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులు ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమ లేఖలు రాయడానికి చాట్‌జీపీటీ సహాయం తీసుకోవాలని భావించారని సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ తేల్చింది 'మోడరన్ లవ్' పేరుతో జరిపిన అధ్యయనంలో 78 శాతం మంది భారతీయ వయోజనులు చాట్‌జీపీటీలో రాసిన ప్రేమ లేఖల పట్ల మక్కువ చూపుతున్నారని, అసలు దానినిఏఐ లెటర్‌గా గుర్తించలేకపోతున్నారని మెకాఫీ స్టడీ తేల్చింది. అంతేకాదు ప్రేమలేఖలు రాయడానికి చాట్‌జీపీటీని వాడుకున్న ఎనిమిది దేశాలలో భారతీయులే ఎక్కువమంది ఉన్నారని కూడా తెలిపింది.
తమ ప్రేమను వ్యక్తం చేయడానికి మాటలు రాని , ప్రేమలేఖలు రాయలేని లేదా దానికి పదాలు దొరకని వారు ఈ ఓపెన్ ఏఐని ఆశ్రయిస్తున్నారట. వాలెంటైన్స్ డేసందర్భంగా నిర్వహించిన ‘మోడరన్ లవ్’ పరిశోధనలో 9 దేశాల నుండి 5000 మందికి పైగా వ్యక్తులను సర్వే చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 27 శాతం మంది వ్యక్తులు చాట్‌జీపీటీ లేఖను పంపడం వల్ల తమకు మరింత ఆత్మవిశ్వాసం ఉందని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. 49 శాతం మంది చాట్‌జీపీటీ రాసిన ప్రేమ లేఖలు అందుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా గగుల్‌కు షాకిస్తూ ఇటీవలి కాలంలో చాట్‌జీపీటీ దూసుకు పోతోంది. దీంతో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కూడా చాట్ జీపీటీకి పోటీగా ఏఐటూల్ బార్డ్‌ను తీసుకిచ్చింది. అయితే, ఒక తప్పిదం కారణంగా బార్డ్ భవిష్యత్తులో చాట్‌జీపీటీతో ఎలా పోటీ పడుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది.
అప్రమత్తత చాలా అవసరం
ప్రపంచవ్యాప్తంగా, నలుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది (26 శాతం) ఏఐ ద్వారా నోట్‌ను రాయాలని ప్లాన్ చేస్తున్నారనీ, ఆన్‌లైన్ డేటింగ్ ప్రపంచంలోఇది రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటిదని మకాఫీ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ప్రేమికులు టార్గెట్ చేసే ప్రమాదం ఉందని, మనుషులు, ఏఐ మధ్య తేడాను గుర్తించగలరో లేదో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని నివేదికలో పేర్కొంది. అలాగేపార్ట్‌నర్‌తో మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా డబ్బులు, వ్యక్తిగత వివరాలపై అనుమానాస్పదంగా అడిగినప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని బమెకాఫీ స్టీవ్ గ్రోబ్‌మాన్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment