Hyderabad: ఇంట్లో నుంచి ప్రేమికుల పరార్‌.. ఇద్దరి జాడ చెప్పాలంటూ.. | KPHB Colony: Lovers Elope From House, Girl Parents Attack On Lover Family | Sakshi
Sakshi News home page

Hyderabad: ప్రేమించిన యువతితో యువకుడి పరార్‌.. ఇద్దరి జాడ చెప్పాలంటూ..

Published Mon, May 2 2022 2:37 PM | Last Updated on Mon, May 2 2022 5:20 PM

KPHB Colony: Lovers Elope From House, Girl Parents Attack On Lover Family - Sakshi

గాయాలతో శాంతయ్య, రాజేశ్వరి

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమించిన యువతిని తీసుకెళ్లిన ఓ యువకుడి తల్లిదండ్రులపై యువతి బంధువులు దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలకు గురైన యువకుడి తండ్రిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. సర్దార్‌పటేల్‌ నగర్‌లో నివసించే గాయత్రి, నరేష్‌ ప్రేమించుకున్నారు. వారివారి ఇళ్లల్లో వివాహానికి అంగీకరించకపోవడంతో శనివారం రాత్రి గాయత్రి, నరేష్‌లు కలిసి ఇల్లు విడిచి వెళ్లిపోయారు.

విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు, బంధువులు, అర్ధరాత్రి శాంతయ్య ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న శాంతయ్య, రాజేశ్వరి దంపతులపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ ఇద్దరిని బలవంతంగా తమ ఇంటికి తీసుకొని వెళ్లిన గాయత్రి బంధువులు, వారిని ఓ గదిలో బంధించి నరేష్‌ ఆచూకీ తెలపాలని చిత్రహింసలకు గురి చేశారని బాధితురాలు రాజేశ్వరి తెలిపారు. నరేష్‌ ఆచూకీ తెలుపకుంటే చంపుతామని బెదిరించి వదిలేశారని, తన భర్త చెయ్యి, రెండు చేతి వేళ్లు విరిగాయని, తమకు రక్షణ కల్పించాలని బాధితులు వాపోతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని కేపీహెజ్‌బీ సీఐ కిషన్‌కుమార్‌ తెలిపారు.  
చదవండి: Hyderabad: మెట్రో స్టేషన్‌ వద్ద యువకుడి హంగామా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement