elope
-
నిజామాబాద్‌లో అమానవీయ ఘటన.. కూతురు బతికుండగానే పెద్దకర్మ
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బతికున్న కూతురికి కన్నతండ్రి పెద్దకర్మ చేశాడు. పెళ్లి చేసిన అల్లుడికి బోన్ క్యాన్సర్ ఉండటంతో వివాహిత నందిని తల్లిగారింటికి వచ్చి జీవిస్తోంది. ఈక్రమంలో ప్రేమించిన ఓ వ్యక్తితో ఆమె పారిపోయింది. దీంతో కూతురిపై ఆగ్రహంతో తండ్రి మహేష్ ఆమె చనిపోయిందంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కూతురు బతికి ఉండగానే ‘మరణం 10 - 09 - 2023’ అంటూ గురువారం పెద్ద కర్మ చేశాడు. -
ప్రేమ పెళ్లి.. భర్తకు షాకిచ్చిన స్కూల్ టీచర్ భార్య, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్‌తో
అన్నానగర్ (తమిళనాడు): ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడితో స్కూల్ టీచర్ పరారైంది. భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిరుచ్చి జిల్లా కోంబైపూదూర్ గ్రామానికి చెందిన పుష్పరాజ్ రెండేళ్ల క్రితం నిత్య అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి పిల్లలు లేదు. నిత్య కోంబైపూదూరులోని ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో నవీన్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రెండు రోజులక్రితం నిత్య అదృశ్యమైంది. ఆమె భర్త పుష్పరాజ్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (ఆర్టీసీ బస్సులో మహిళకు వేధింపులు) -
Hyderabad: ఇంట్లో నుంచి ప్రేమికుల పరార్.. ఇద్దరి జాడ చెప్పాలంటూ..
సాక్షి, హైదరాబాద్: ప్రేమించిన యువతిని తీసుకెళ్లిన ఓ యువకుడి తల్లిదండ్రులపై యువతి బంధువులు దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలకు గురైన యువకుడి తండ్రిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. సర్దార్‌పటేల్ నగర్లో నివసించే గాయత్రి, నరేష్ ప్రేమించుకున్నారు. వారివారి ఇళ్లల్లో వివాహానికి అంగీకరించకపోవడంతో శనివారం రాత్రి గాయత్రి, నరేష్‌లు కలిసి ఇల్లు విడిచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు, బంధువులు, అర్ధరాత్రి శాంతయ్య ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న శాంతయ్య, రాజేశ్వరి దంపతులపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ ఇద్దరిని బలవంతంగా తమ ఇంటికి తీసుకొని వెళ్లిన గాయత్రి బంధువులు, వారిని ఓ గదిలో బంధించి నరేష్ ఆచూకీ తెలపాలని చిత్రహింసలకు గురి చేశారని బాధితురాలు రాజేశ్వరి తెలిపారు. నరేష్ ఆచూకీ తెలుపకుంటే చంపుతామని బెదిరించి వదిలేశారని, తన భర్త చెయ్యి, రెండు చేతి వేళ్లు విరిగాయని, తమకు రక్షణ కల్పించాలని బాధితులు వాపోతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని కేపీహెజ్‌బీ సీఐ కిషన్‌కుమార్ తెలిపారు. చదవండి: Hyderabad: మెట్రో స్టేషన్ వద్ద యువకుడి హంగామా -
ప్రేమికులపై పైశాచికం: మెడలో టైర్లు వేసి..
భోపాల్: ప్రేమించి.. పెళ్లి చేసుకోవాలని భావించి ఇంటి నుంచి పారిపోయిన ఓ ప్రేమ జంటను దారుణంగా హింసించారు వారి గ్రామస్తులు. స్కూటర్ టైర్ మెడలో వేసి.. డ్యాన్స్ చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ ధార్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ధార్ ప్రాంతంలోని కుండి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి అదే ఊరికి చెందిన 23 ఏళ్ల వ్యక్తి ప్రేమించుకున్నారు. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో ఈ నెల మొదటి వారంలో ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. (చదవండి: ప్రేమికుల కిడ్నాప్.. అడవుల్లో తిప్పుతూ చిత్రహింసలు!) వారం రోజుల అనంతరం వారు గ్రామానికి తిరిగి వచ్చారు. ప్రేమికుల ప్రవర్తనపట్ల ఆగ్రహంగా ఉన్న గ్రామస్తులు వారి చేసిన పనికి తగిన శిక్ష విధించాలని భావించారు. రచ్చబండ వద్దకు వారిని పిలిపించారు. అనంతరం గ్రామ పెద్దగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి.. ఆ జంటను కర్రతో పలు మార్లు కొట్టాడు. అనంతరం వారి మెడలో స్కూటర్ టైర్ వేసి డ్యాన్స్ చేయించారు. (చదవండి: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త ట్విస్ట్ ) ఈ ప్రేమ జంటకు సాయం చేసిందనే ఆరోపణలతో 13 ఏళ్ల బాలికను కూడా ఇదే విధంగా హింసించారు. గ్రామస్తుల్లో కొందరు ఈ తతంగాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరలయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. ప్రేమికుల మీద దాడి చేసిన వారిలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. చదవండి: దారుణం: ‘మా అమ్మాయినే వేధిస్తావా?’ మెడకు బెల్ట్ బిగించి.. -
పదేళ్లలో 25 సార్లు లవర్స్‌తో జంప్: ‘నా భార్య నాకు కావాలి’
డిస్పూర్: భార్య పరాయి వ్యక్తితో అవసరం ఉండి మాట్లాడితేనే.. అనుమానంతో ఆమెను రాచి రంపాన పెట్టే భర్తలున్నారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త ఇందుకు పూర్తిగా భిన్నం. ఇక్కడ ఓ మహిళ పెళ్లైన నాటి నుంచి దాదాపు 25 సార్లు పరాయి మగాళ్లతో వెళ్లిపోయింది. భార్య ఇలాంటి నీచమైన పని చేసినప్పటికి ఆమె భర్త ఒక్కమాట అనలేదు. పైగా ఆమెతోనే కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ వివరాలు.. అసోంలోని నాగావ్ జిల్లా మారుమూల గ్రామం ధింగ్ లహ్కర్కు చెందిన ఓ వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. పదేళ్ల క్రితం అతడికి వివాహం అయ్యింది. ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి ఉన్నారు. భార్య అంటే అతడికి ప్రాణం. ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కానీ అతడి భార్యకు.. భర్త కన్నా పరాయి పురుషుల మీద ప్రేమ ఎక్కువ. (చదవండి: రెడ్ హ్యాండెడ్‌గా భార్యకు దొరికి..) ఈ క్రమంలో సదరు మహిళ పెళ్లైన నాటి నుంచి గ్రామంలోని పలువురు యువకులతో వివాహేతర సంబంధాలు నడిపేది. అంతటితో ఆగక వారితో కలిసి ఇంటి నుంచి పారిపోయేది. కొన్ని నెలల తర్వాత తిరిగి వచ్చేది. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. అలా తిరిగి వచ్చిన ప్రతిసారి భర్త ఆమెను ఆదరించాడు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా భార్యను స్వీకరించేవాడు. (చదవండి: భార్య ఊరికి వెళ్లగానే ఇంటికి పిలిపించుకుని..) ఇలా పదేళ్ల నాటి నుంచి సదరు మహిళ 24 సార్లు పలువురు వ్యక్తులతో వెళ్లిపోయి.. కొన్ని నెలల తర్వాత తిరిగి వచ్చింది. ఆమె ప్రవర్తన పట్ల అత్తింటివారు, ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా.. తిట్టినా.. ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. తాజాగా ఈ నెల 4న మరోసారి అనగా 25వ సారి మరో ప్రియుడితో పారిపోయింది. ఈ సందర్భంగా సదరు మహిళ భర్త మాట్లాడుతూ.. ‘‘నా భార్య అంటే నాకు చాలా ప్రేమ. తన మీద నాకు అసలు కోపం రాదు. ఇక ఇంటి నుంచి పారిపోయి తిరిగి వచ్చిన ప్రతిసారి నా భార్య ఇక మీదట ఇలా చేయను అని ప్రమాణం చేసేది. కానీ మాట మీద నిలబడలేకపోయేది. ఈ సారి కూడా అదే చేసింది. నా చిన్న కొడుక్కి మూడు నెలలుంటాయి. వాడిని పక్కింట్లో వదిలేసి ప్రియుడితో కలిసి పారిపోయింది. మేకలకు మేత తెస్తాను.. బాబును చూడమని వారికి చెప్పి వెళ్లిపోయింది. ఈ సారి 22 వేల రూపాయల డబ్బు, కొన్ని వస్తువులు తీసుకుని ఇంటి నుంచి పారిపోయింది. ఎవరితో వెళ్లిపోయిందో.. ఎన్నాళ్లకు తిరిగి వస్తుందో తెలియదు’’ అన్నాడు. అంతేకాక ‘‘నేను నా భార్యను నిజాయతీగా ప్రేమిస్తున్నాను. ఈసారి కూడా తను తిరిగి వస్తే ఆహ్వానిస్తాను. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడం.. పంచాయతీ పెట్టడం చేయను. పైగా మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి బాధ్యత ఎవరు తీసుకుంటారు. నా భార్య కోసం ఎదురు చూస్తున్నాను’’ అని తెలిపాడు. చదవండి: ఒక చేత్తో స్కూటీ.. మరో చేత్తో ఆమెను అసభ్యంగా -
‘జైలు నుంచి వచ్చాక ఆ ముగ్గురిని చంపుతాను’
జైపూర్: వివాహం అయిన ఓ మహిళ ప్రియుడితో కలిసి అత్తవారి ఇంటి నుంచి పారిపోయింది. ఈ విషయం తెలిసిన వివాహిత తండ్రి ఆగ్రహంతో సొంత ఊరి నుంచి వచ్చి కుమార్తె వెళ్లిపోయిన వ్యక్తి కుటుంబంలోని ఇద్దరిని దారుణంగా హత్య చేశాడు. రాజస్తాన్‌లోని జున్జును జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాలు.. హర్యానాకు చెందిన అనిల్ జాట్ కుమార్తెకు రాజస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. కాగా ఆమె స్థానికంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి అత్తవారి ఇంటి నుంచి వెళ్లి పోయింది. తమ కోడలు కనిపించడం లేదని అత్త ఇంటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన ఆ మహిళ తండ్రి అనిల్ జాట్, హర్యానా నుంచి బైక్‌పై రాజస్తాన్‌లోని ఈ గ్రామానికి వచ్చాడు. ఆగ్రహంతో తన కుమార్తెను తీసుకెళ్లిన వ్యక్తి ఇంటికెళ్లి డాబాపైన నిద్రిస్తున్న అతడి సోదరుడు దీపక్, స్నేహితుడు నరేశ్‌ను గొడ్డలితో నరికి హత్య చేశాడు. తెల్లారిన తర్వాత ఈ విషయాన్ని గ్రహించిన దీపక్ తండ్రి రాజ్వీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో డాగ్ స్క్వాడ్‌ను రప్పించడంతోపాటు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడు అనిల్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు. కాగా తన పరువు తీసిన కుమార్తెతో పాటు ఆమెను తీసుకెళ్లిన వ్యక్తిని, అతడి తండ్రిని జైలు నుంచి తిరిగొచ్చిన తర్వాత హత్య చేస్తానని అనిల్ పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రియుడి కోసం సొంత ఇంటికే కన్నం
ముంబై: ప్రియుడి కోసం సొంత ఇంటికే కన్నం వేసిందో యువతి. రూ.10 లక్షల నగదుతో ఇంటి నుంచి ఉడాయించింది. వివరాలు.. మహారాష్ట్ర కందివాలి ప్రాంతానికి చెందిన రాధ గుప్తా(19) అనే యువతికి గోవండి ప్రాంతానికి చెందిన అమీర్ నౌషాద్ ఖాన్‌తో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అమీర్ ఇంకా జీవితంలో స్థిరపడకపోవడంతో.. అతనికి సాయం చేయాలని భావించింది రాధ. అందుకోసం సొంత ఇంటికే కన్నం వేసింది. తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లో ఉంచిన రూ. 10 లక్షల నగదు తీసుకుని ప్రియుడితో ఉడాయించింది. దొంగతనం జరిగిందని గుర్తించిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రాధ, ఆమె ప్రియుడు అమీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి రాధను ప్రశ్నించగా.. అమీర్ ఇంకా జీవితంలో స్థిరపడలేదని.. డబ్బు సాయం చేస్తే వ్యాపారం ప్రారంభించి అభివృద్ధి చెందుతాడని భావించి డబ్బు తీసుకెళ్లానని చెప్పింది. -
అనంతపురంలో అమానుషం.. ప్రేమించినందుకు
సాక్షి, అనంతపూర్: ప్రేమించిన యువకుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయినందుకు గాను ఓ యువతి పట్ల గ్రామపెద్దలు అమానుషంగా ప్రవర్తించారు. పంచాయతీ పెట్టి.. కర్రలతో ఆ యువతిని కొడ్తూ, కిందపడేసి తంతూ చిత్ర హింసలకు గురి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అనంతపురం జిల్లాలో గురువారం చోటుచేసుకున్న ఈ సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. గుమ్మఘట్ట మండలం కేపీదొడ్డి గ్రామానికి చెందిన ఇద్దరు ప్రేమికులు పది రోజుల క్రితం గ్రామం వదిలి వెళ్లిపోయారు. ఇరువురి తల్లిదండ్రులు వారిని ఊరికి రప్పించి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. పంచాయతీ మాట విననందుకు గ్రామ పెద్ద ఆమెపై విరుచుకుపడ్డాడు. ఇష్టారాజ్యంగా చెంపదెబ్బలు కొట్టాడు.. పదేపదే కాలితో తన్నాడు.. పక్కనే ఉన్న కర్రతో పశువును బాదినట్లు చావబాదాడు. యువకుడిని కూడా చితకబాదాడు. అక్కడ సుమారు వంద మందికి పైగా ఉన్నా.. ఆ దృశ్యాన్ని కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప ఏ ఒక్కరూ ఆపటానికి ప్రయత్నించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాలికను అంత రాక్షసంగా కొడుతున్న దృశ్యాలను చూసిన వారంతా అయ్యో పాపం అంటున్నారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా దీని గురించి తమ దృష్టికి రాలేదన్నారు. వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులకు రక్షణ కల్పిస్తామన్నారు. ప్రస్తుతం ఓ మహిళా కానిస్టేబుల్ని బాధిత యువతి దగ్గరకి పంపి, సమాచారం తెలుసుకోవాల్సిందిగా కోరామన్నారు. -
బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు
భోపాల్: కని పెంచిన కుమార్తె.. తనకు ఇష్టం లేని వ్యక్తితో వెళ్లి పోయిందని ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అల్లారుముద్దగా పెంచిన కుమార్తెకు బతికుండగానే అంత్యక్రియలు నిర్వహించాడు. వివరాలు.. మండసోర్ సమీప గ్రామం కుచ్రోడ్కు చెందిన గోపాల్ మండోర కుమార్తె, శారద మండోర(19) గత నెల 25న ప్రేమించిన వ్యక్తితో కలిసి ఇంటి నుంచి వెళ్లి పోయింది. దాంతో ఆగ్రహించిన గోపాల్, కుమార్తె బతికుండగానే.. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించాడు. ఈ మేరకు గ్రామస్తులకు, బంధువులకు పత్రికలు ఇచ్చి మరి ఆహ్వానించాడు. అనంతరం గ్రామంలోని కమ్యూనిటీ హాల్లో అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించాడు. -
గృహిణి అదృశ్యం.. అనుమానంతో చెట్టుకు కట్టేసి..
-
గృహిణి అదృశ్యం.. చెట్టుకు కట్టేసి
భోపాల్ : ఓ గృహిణి అదృశ్యమవ్వడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఇందుకు కారకులన్న అనుమానంతో ముగ్గురిని చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు గ్రామస్తులు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. ధార్ ప్రాంతానికి చెందిన ఓ గృహిణి కొన్ని రోజుల నుంచి కనిపించకుండా పోయింది. ఓ యువకుడే ఇందుకు కారణం అని భావించిన గ్రామస్తులు అతనితో పాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులను కూడా చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ ఇద్దరు కుటుంబ సభ్యుల్లో ఒకరు మైనర్ కావడం గమనార్హం. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఏఎన్ఐ ప్రచురించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏఎన్ఐ పోస్ట్ చేసిన ఫోటోలో ఒక వ్యక్తిని, మహిళను చెట్టుకు కట్టేసి ఉండగా.. వారి చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు. ఈ సంఘటన ధార్ అర్జున్ కాలనీలో సంభవించినట్లు ఏఎన్ఐ వెల్లడించింది. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఓ ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేశామని.. తర్వలోనే మిగతావారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : గృహిణి అదృశ్యం.. అనుమానంతో చెట్టుకు కట్టేసి.. -
హవ్వా.. 14 ఏళ్ల విద్యార్థి ఏం చేశాడో తెలుసా?
బరేలి: ఇదో విచిత్ర సంఘటన. విన్నవారంతా ముక్కున వేలేసుకునే విషయం. ఇంకా చెప్పాలంటే ఔరా అని అవాక్కవుతారు కూడా. ఓ పద్నాలుగేళ్ల విద్యార్థి తన ఇంట్లోని డబ్బు నగలను తీసుకొని తన 22 ఏళ్ల టీచర్‌తో వెళ్లిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో చోటు చేసుకుంది. ఆ టీచర్ కూడా ఆ బాలుడు చదివే పాఠశాల యజమాని కూతురంట. ఈ నెల 1 నుంచి తమ కుమారుడు కనిపించకుండా పోవడంతో అతడి తల్లి దండ్రులు పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ‘మా కుమారుడు ఇంట్లో దొంగతనం చేసి రూ.8000, ఆభరణాలు దొంగిలించి అతడు చదివే పాఠశాల టీచర్‌తో కలిసి వెళ్లిపోయాడు. వాస్తవానికి వాడికి ఇలాంటివి తెలియదు. ఆమె చెప్పడం వల్లే అలా చేశాడు. ఆ టీచర్‌ది మంచి వ్యక్తిత్వం, ప్రవర్తన కాదు. అందుకే మా కుమారుడితో ఇలాంటి తప్పు చేయించింది’ అంటూ ఆ బాలుడి తండ్రి రామ్ వీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను కుమారుడి కోసం తిరిగి తిరిగి అలిసిపోయానని, ఎక్కడా కనిపించలేదని, ఇంతపెద్ద ఆలోచన చేసే తెలివితేటలు, మానసిక పరిపక్వత తమ వాడికి లేదని వాపోయాడు. సోమవారం నాటికి తన కుమారుడిని గుర్తించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపాడు.కాగా, తమపై పాత కక్షను తీర్చుకునేందుకు ఆ కుటుంబం నాటకాలు ఆడుతుందని, ఒకసారి వారికి తమకు ఆ కుటుంబానికి గొడవ అయిందని టీచర్ తరుపు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనంతా బాలుడి కుటుంబ చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. ఆ బాలుడే తమ అమ్మాయిని తీసుకెళ్లాడని ఆరోపించారు. కాగా, ఈ కేసుపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఇది కాస్తంత ఏవగింపు కలిగించే కేసు. అబ్బాయే టీచర్‌ను తీసుకెళ్లాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికి బాలుడిపైనే కేసు నమోదు చేశాం. బహుశా వారిద్దరికి ఏదో సంబంధం ఉండి ఉండొచ్చు. కుటుంబాలకు భయపడి వెళ్లిపోయి ఉండొచ్చు’ కేసు దర్యాప్తు చేస్తున్నాం’ అని పోలీసు ఉన్నతాధికారి తెలిపాడు. -
ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ప్రియుడితో వెళ్లిపోయింది
మంగళూరు: నిజ జీవితంలో ఏమోగానీ సినిమాలో పెళ్లి సీన్ వచ్చిందంటే అటు ప్రేక్షకుల మనసుల్లో.. ఆ సినిమాలోని పెళ్లి కుమార్తె తండ్రి గుండెల్లో వణుకు మొదలవుతుంది. ఈ పెళ్లి పీటల దాకా వెళ్లి విజయవంతం అవుతుందా.. చక్కగా పెళ్లి కూతురు తల్లిదండ్రులు చెప్పిన అబ్బాయి చేత్తో తాళి కట్టించుకుంటుందా అని.. ఆ సమయంలో పెళ్లి కూతురు వేసే ఎత్తులు కూడా భలే చిత్రంగా ఉంటాయి. అచ్చం అలాగే ఓ అమ్మాయి తన తల్లిదండ్రులను బురిడీ కొట్టించింది. ఏమాత్రం వారికి అనుమానం రాకుండా ఎత్తులు వేసింది. దుబాయ్ నుంచి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాడానికి వచ్చి మంగళూరు విమానాశ్రయంలో దిగగానే వారి కళ్లుగప్పి ప్రియుడితో కలిసి పారిపోయింది. నిమిషం ఆలస్యం చేయకుండా మంగళూరులోనే ఓ ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుంది. తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా అదే సమయంలో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయి వారికి నేరుగా ఫోన్ చేశాడు. తమకోసం వెతకొద్దని తాము పెళ్లి చేసుకున్నామని, కేరళలోని తమ ఇంటి వద్ద ఉన్నామని తాపీగా చెప్పి ఝలక్ ఇచ్చాడు. దాంతో తొలుత ఫిర్యాదు చేద్దామని వచ్చిన ఆ అమ్మాయి తల్లిదండ్రులు షాక్ తిని కేసు పెట్టే పని విరమించుకున్నారు. అయితే, ఆ యువతి చేసుకున్న అబ్బాయి వారి బంధువేనట. అంతేకాదు.. ఆ అమ్మాయితోపాటే దుబాయ్ లో అతడు ఉద్యోగం చేస్తుండటమే కాకుండా ఇండియాలో ఆమెకు జరిగే పెళ్లి కోసం వారికే తెలియకుండా అదే ఫ్లైట్ లో ఆ యువకుడు వచ్చాడంట.