
అన్నానగర్ (తమిళనాడు): ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడితో స్కూల్ టీచర్ పరారైంది. భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిరుచ్చి జిల్లా కోంబైపూదూర్ గ్రామానికి చెందిన పుష్పరాజ్ రెండేళ్ల క్రితం నిత్య అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి పిల్లలు లేదు.
నిత్య కోంబైపూదూరులోని ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో నవీన్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రెండు రోజులక్రితం నిత్య అదృశ్యమైంది. ఆమె భర్త పుష్పరాజ్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
(ఆర్టీసీ బస్సులో మహిళకు వేధింపులు)
Comments
Please login to add a commentAdd a comment