
భోపాల్: కని పెంచిన కుమార్తె.. తనకు ఇష్టం లేని వ్యక్తితో వెళ్లి పోయిందని ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అల్లారుముద్దగా పెంచిన కుమార్తెకు బతికుండగానే అంత్యక్రియలు నిర్వహించాడు. వివరాలు.. మండసోర్ సమీప గ్రామం కుచ్‌రోడ్‌కు చెందిన గోపాల్ మండోర కుమార్తె, శారద మండోర(19) గత నెల 25న ప్రేమించిన వ్యక్తితో కలిసి ఇంటి నుంచి వెళ్లి పోయింది. దాంతో ఆగ్రహించిన గోపాల్, కుమార్తె బతికుండగానే.. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించాడు. ఈ మేరకు గ్రామస్తులకు, బంధువులకు పత్రికలు ఇచ్చి మరి ఆహ్వానించాడు. అనంతరం గ్రామంలోని కమ్యూనిటీ హాల్‌లో అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment