పత్రీకాత్మక చిత్రం
భోపాల్: తన మాట కాదని ప్రేమ పెళ్లి చేసుకుందన్న కోపంతో తండ్రి.. కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక అమెను గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘోర ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని సంస్‌గఢ్ అడవుల్లో ఓ మహిళ, ఆమె ఎనిమిది నెలల కుమారుడి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా మృతదేహం సెహోర్ జిల్లాలోని బిల్కిస్‌గంజ్‌లో నివసిస్తున్న మహిళ, ఆమె ఎనిమిది నెలల కొడుకుదని తేలింది.
చదవండి: ఘోరం: కడియాల కోసం మహిళ కాళ్లను నరికి.. ఆపై..
దీని ఆధారంగా పోలీసులు విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కన్న కూతురిపై తండ్రి అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. కూతురు తమను కాదని పెళ్లి చేసుకోవడంతో సమాజంలో కుటుంబ పరువు పోయిందని, అది భరించలేకే కూతురిని హత్య చేసినట్లు తండ్రి పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.
చదవండి: సపరివార సమేతంగా.. కుటుంబ సభ్యులంతా కలిసి చోరీలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్‌లోని రాతిబాద్‌కు చెందిన 55ఏళ్ల వ్యక్తి కూతురు ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఇది తల్లిదండ్రులకు నచ్చలేదు. దీంతో కూతురికి తండ్రికి మధ్య నిత్యం గొడవలు అయ్యేవి. పెళ్లైనప్పటి నుంచి కూతురు కూడా ఇదే కారణంతో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లలేదు. అయితే ఈ దీపావళికి తన అక్క ఇంటికి వెళ్లగా అక్కడ తన కొడుకు అనారోగ్యంతో మృతి చెందాడు. ఆమె అక్క తన తండ్రిని సంప్రదించి సహాయం కోరింది.
సమాచారం అందుకున్న తండ్రి తన కుమారుడితో కలిసి రతీబాద్ చేరుకుని చనిపోయిన శిశువుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు తమతో పాటు అటవీ ప్రాంతానికి రావాల్సిందిగా కూతురిని కోరాడు. దీంతో ఆమె తన తండ్రితో కలిసి అడవికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన తండ్రి కూతురిపై దాడి చేసి, ఆమెపై అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం కొడుకుతో కలిసి ఇంటికి చేరుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment