హవ్వా.. 14 ఏళ్ల విద్యార్థి ఏం చేశాడో తెలుసా? | Student flees with teacher after steals cash from home | Sakshi
Sakshi News home page

హవ్వా.. 14 ఏళ్ల విద్యార్థి ఏం చేశాడో తెలుసా?

Published Mon, Dec 5 2016 2:56 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

హవ్వా.. 14 ఏళ్ల విద్యార్థి ఏం చేశాడో తెలుసా?

హవ్వా.. 14 ఏళ్ల విద్యార్థి ఏం చేశాడో తెలుసా?

బరేలి: ఇదో విచిత్ర సంఘటన. విన్నవారంతా ముక్కున వేలేసుకునే విషయం. ఇంకా చెప్పాలంటే ఔరా అని అవాక్కవుతారు కూడా. ఓ పద్నాలుగేళ్ల విద్యార్థి తన ఇంట్లోని డబ్బు నగలను తీసుకొని తన 22 ఏళ్ల టీచర్‌తో వెళ్లిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో చోటు చేసుకుంది. ఆ టీచర్‌ కూడా ఆ బాలుడు చదివే పాఠశాల యజమాని కూతురంట. ఈ నెల 1 నుంచి తమ కుమారుడు కనిపించకుండా పోవడంతో అతడి తల్లి దండ్రులు పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు.

‘మా కుమారుడు ఇంట్లో దొంగతనం చేసి రూ.8000, ఆభరణాలు దొంగిలించి అతడు చదివే పాఠశాల టీచర్‌తో కలిసి వెళ్లిపోయాడు. వాస్తవానికి వాడికి ఇలాంటివి తెలియదు. ఆమె చెప్పడం వల్లే అలా చేశాడు. ఆ టీచర్‌ది మంచి వ్యక్తిత్వం, ప్రవర్తన కాదు. అందుకే మా కుమారుడితో ఇలాంటి తప్పు చేయించింది’ అంటూ ఆ బాలుడి తండ్రి రామ్‌ వీర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను కుమారుడి కోసం తిరిగి తిరిగి అలిసిపోయానని, ఎక్కడా కనిపించలేదని, ఇంతపెద్ద ఆలోచన చేసే తెలివితేటలు, మానసిక పరిపక్వత తమ వాడికి లేదని వాపోయాడు. సోమవారం నాటికి తన కుమారుడిని గుర్తించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపాడు.కాగా, తమపై పాత కక్షను తీర్చుకునేందుకు ఆ కుటుంబం నాటకాలు ఆడుతుందని, ఒకసారి వారికి తమకు ఆ కుటుంబానికి గొడవ అయిందని టీచర్‌ తరుపు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనంతా బాలుడి కుటుంబ చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. ఆ బాలుడే తమ అమ్మాయిని తీసుకెళ్లాడని ఆరోపించారు.

కాగా, ఈ కేసుపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఇది కాస్తంత ఏవగింపు కలిగించే కేసు. అబ్బాయే టీచర్‌ను తీసుకెళ్లాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికి బాలుడిపైనే కేసు నమోదు చేశాం. బహుశా వారిద్దరికి ఏదో సంబంధం ఉండి ఉండొచ్చు. కుటుంబాలకు భయపడి వెళ్లిపోయి ఉండొచ్చు’ కేసు దర్యాప్తు చేస్తున్నాం’ అని పోలీసు ఉన్నతాధికారి తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement