ఎయిర్పోర్ట్లో దిగగానే ప్రియుడితో వెళ్లిపోయింది | Girl snubs parents, elopes with lover from airport | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్ట్లో దిగగానే ప్రియుడితో వెళ్లిపోయింది

Published Tue, Aug 2 2016 7:47 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

ఎయిర్పోర్ట్లో దిగగానే ప్రియుడితో వెళ్లిపోయింది

ఎయిర్పోర్ట్లో దిగగానే ప్రియుడితో వెళ్లిపోయింది

మంగళూరు: నిజ జీవితంలో ఏమోగానీ సినిమాలో పెళ్లి సీన్ వచ్చిందంటే అటు ప్రేక్షకుల మనసుల్లో.. ఆ సినిమాలోని పెళ్లి కుమార్తె తండ్రి గుండెల్లో వణుకు మొదలవుతుంది. ఈ పెళ్లి పీటల దాకా వెళ్లి విజయవంతం అవుతుందా.. చక్కగా పెళ్లి కూతురు తల్లిదండ్రులు చెప్పిన అబ్బాయి చేత్తో తాళి కట్టించుకుంటుందా అని.. ఆ సమయంలో పెళ్లి కూతురు వేసే ఎత్తులు కూడా భలే చిత్రంగా ఉంటాయి. అచ్చం అలాగే ఓ అమ్మాయి తన తల్లిదండ్రులను బురిడీ కొట్టించింది.

ఏమాత్రం వారికి అనుమానం రాకుండా ఎత్తులు వేసింది. దుబాయ్ నుంచి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాడానికి వచ్చి మంగళూరు విమానాశ్రయంలో దిగగానే వారి కళ్లుగప్పి ప్రియుడితో కలిసి పారిపోయింది. నిమిషం ఆలస్యం చేయకుండా మంగళూరులోనే ఓ ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుంది. తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా అదే సమయంలో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయి వారికి నేరుగా ఫోన్ చేశాడు.

తమకోసం వెతకొద్దని తాము పెళ్లి చేసుకున్నామని, కేరళలోని తమ ఇంటి వద్ద ఉన్నామని తాపీగా చెప్పి ఝలక్ ఇచ్చాడు. దాంతో తొలుత ఫిర్యాదు చేద్దామని వచ్చిన ఆ అమ్మాయి తల్లిదండ్రులు షాక్ తిని కేసు పెట్టే పని విరమించుకున్నారు. అయితే, ఆ యువతి చేసుకున్న అబ్బాయి వారి బంధువేనట. అంతేకాదు.. ఆ అమ్మాయితోపాటే దుబాయ్ లో అతడు ఉద్యోగం చేస్తుండటమే కాకుండా ఇండియాలో ఆమెకు జరిగే పెళ్లి కోసం వారికే తెలియకుండా అదే ఫ్లైట్ లో ఆ యువకుడు వచ్చాడంట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement