జైపూర్: పాకిస్థాన్‌కి పంపించండి అంటూ వచ్చిన ఓ మైనర్ బాలిక జైపూర్ ఎయిర్‌పోర్టులో అధికారులను షాక్‌కు గురిచేసింది. పాక్‌లో ఉన్న తమ ప్రియున్ని కలవడానికి వెళ్తున్నట్లు బాలిక చెప్పుకొచ్చింది. ఎలాంటి పాస్‌పోర్టు, వీసాగానీ లేకుండానే ఎయిర్‌పోర్టుకు వచ్చిన బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మూడేళ్ల క్రితమే వచ్చా..
ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన బాలిక పాకిస్థాన్‌కు టిక్కెట్టు అడిగింది. అనుమానంతో విచారించగా.. మూడేళ్ల క్రితమే ఇస్లామాబాద్ నుంచి భారత్‌కు వచ్చినట్లు కట్టుకథను చెప్పింది. తన ఆంటీతో పాటే వచ్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం వారితో సఖ్యతలేదని తెలిపిన బాలిక.. మళ్లీ పాకిస్థాన్‌కు వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పింది. కానీ దర్యాప్తులో తేలిన విషయాలు చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు.
ఎయిర్‌పోర్టులో మైనర్ బాలికను అదుపులోకి తీసుకున్నాం. తన ప్రియున్ని కలవడానికి లాహోర్‌కు వెళ్లాలని చెప్పింది. ఎయిర్‌పోర్టులోని టిక్కెట్ కౌంటర్ వద్దకు వచ్చి పాకిస్థాన్‌కు టిక్కెట్టు ఇవ్వమని అడిగినప్పుడు అందరం షాక్‌గు గురయ్యాం. బాలిక మొదట జోక్ చేస్తోందని టికెట్ మాస్టర్, సెక్యూరిటీ అధికారులు అనుకున్నారు. కానీ అది నిజమని తెలిసి ఆశ్చర్యపోయాం.' అని అధికారులు తెలిపారు.
ప్లాన్ ఇచ్చింది ఆయనే..
పాకిస్థాన్‌లో ఉన్న బాలుడు కొన్ని విషయాలు తెలిపినట్లు బాలిక దర్యాప్తులో అధికారులకు చెప్పింది. పాకిస్థాన్‌కు రావడానికి పాటించాల్సిన నియమాలను ఆ బాలుడు చెప్పినట్లు తెలిపింది. అధికారులతో మాట‍్లడేప్పుడు కొన్ని విషయాలు మైండ్‌లో పెట్టుకోవాలని ఆ బాలుడే తెలిపినట్లు వెల్లడించింది. అందుకు భాగంగానే ఆ కట్టుకథను అధికారులకు చెప్పినట్లు పేర్కొంది.
కానీ దర్యాప్తులో బాలిక స్థానికంగా రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలోని రత్నపుర గ్రామానికి చెందినదని అధికారులు గుర్తించారు. చివరికి తల్లిదండ్రులను పిలిచి వారి ముందే మళ్లీ ప్రశ్నించగా.. అందరూ గుర్తించాలని ఇలా చేశానని బాలిక చెప్పుకొచ్చింది. దీంతో తల్లిదండ్రులతో పాటే బాలికను ఇంటికి పంపించారు.
ఇదీ చదవండి: కేరళ గవర్నర్ కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన కారు..
Comments
Please login to add a commentAdd a comment