
ముంబై: ప్రియుడి కోసం సొంత ఇంటికే కన్నం వేసిందో యువతి. రూ.10 లక్షల నగదుతో ఇంటి నుంచి ఉడాయించింది. వివరాలు.. మహారాష్ట్ర కందివాలి ప్రాంతానికి చెందిన రాధ గుప్తా(19) అనే యువతికి గోవండి ప్రాంతానికి చెందిన అమీర్ నౌషాద్ ఖాన్‌తో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అమీర్ ఇంకా జీవితంలో స్థిరపడకపోవడంతో.. అతనికి సాయం చేయాలని భావించింది రాధ. అందుకోసం సొంత ఇంటికే కన్నం వేసింది. తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లో ఉంచిన రూ. 10 లక్షల నగదు తీసుకుని ప్రియుడితో ఉడాయించింది. దొంగతనం జరిగిందని గుర్తించిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రాధ, ఆమె ప్రియుడు అమీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి రాధను ప్రశ్నించగా.. అమీర్ ఇంకా జీవితంలో స్థిరపడలేదని.. డబ్బు సాయం చేస్తే వ్యాపారం ప్రారంభించి అభివృద్ధి చెందుతాడని భావించి డబ్బు తీసుకెళ్లానని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment