పనాజి: వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ఎందరో ప్రేమికుల్లో కొత్త జోష్‌ని నింపుతోంది. డెస్టినేషన్ ప్రేమికుల రోజు జరుపుకోవాలనుకునే ప్రేమికులకు ఈసారి ఊహించని విధంగా పోలింగ్ దెబ్బ తగిలింది. కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఎంచక్కా గోవా వెళ్లి ఎంజాయ్ చేయాలనుకునే ప్రేమికుల హుషారుపై ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నీళ్లు చల్లాయి. ఫిబ్రవరి 14నే గోవా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండటంతో అక్కడ ఆ రోజు డ్రై డే.
ఎన్నికల నియమావళి ఉండడంతో నైట్ క్లబ్బులు కూడా మూసేశారు. రాత్రి 11 గంటల తర్వాత మద్యం ఉండదు. హోటల్స్, బార్లలో ఫిబ్రవరి 12 సాయంత్రం 5 గంటల నుంచి, 15వ తేదీ వరకు మందు దొరికే ప్రసక్తే లేదు. దీంతో చలో గోవా అనుకున్న జంటలు నిరాశకు లోనవుతున్నారు. సాధారణంగా వాలెంటైన్స్ డే సమయంలో గోవాకి పర్యాటకులు పోటెత్తుతారు. కరోనాతో ఇన్నాళ్లూ అల్లాడిపోయిన రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పట్టి ఆంక్షల్ని సడలిస్తున్నారు.
(చదవండి: చలికాలంలో చుండ్రు బాధా? జుట్టు మెరవాలంటే ఏం చేయాలి?)
దీంతో పర్యాటక రంగం గాడిలో పడుతుందనుకుంటే ఇప్పుడు ఎన్నికలు వచ్చేశాయి. ‘‘ఎన్నికలు మా ఆదాయాన్ని దెబ్బ తీస్తున్నాయి. నెల రోజుల పాటు నైట్ క్లబ్బుల్ని ఎందుకు మూసేశారు ? గోవా ప్రశాంతమైన రాష్ట్రం. ఎప్పుడూ ఘర్షణలు చెలరేగే యూపీలో కూడా ఇంత కఠిన నిబంధనలు లేవు’’ అని కాండోలిమ్‌లో వాటర్ ఫ్రంట్ యజమాని నందన్ కుడ్‌చద్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల విషయం తెలియక హోటల్స్‌ని బుక్ చేసుకున్నవారు ఇప్పుడు రద్దు చేసుకుంటున్నారని, కరోనా థర్డ్ వేవ్, ఆ వెంటనే ఎన్నికలు గోవా ఆదాయాన్ని బాగా దెబ్బ తీశాయని గోవా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ రాల్ఫా డిసౌజా చెప్పారు. ప్రతీ ఏడాది వాలెంటైన్స్ డేకి గోవాలో హోటల్స్ 90% వరకు నిండిపోతాయి. కానీ ఈసారి పావు వంతు కూడా నిండే అవకాశం లేదన్న అంచనాలున్నాయి.
(చదవండి: ‘లాక్‌డౌన్’ కోసం పక్కా ప్లాన్.. రూ.2 లక్షలు ఇచ్చి కిడ్నాప్, ప్రేమతోనే అలా?)
Comments
Please login to add a commentAdd a comment