dry day
-
ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
ఛత్తీస్‌గఢ్‌లో లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ మే 7న జరగనుంది. రాష్ట్రంలోని రాయ్‌పూర్, దుర్గ్, బిలాస్పూర్, జాంజ్‌గిర్-చంపా, కోర్బా, రాయ్‌గఢ్, సుర్గుజా మొదలైన ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ఈ ప్రాంతాల్లో మే 5 నుండి 7 వరకు డ్రై డేగా ప్రకటించారు. అంటే ఈ రెండు రోజూలూ ఈ లోక్‌సభ నియోజకవర్గాల్లో మద్యం విక్రయాలు ఉండవు. డ్రై డేకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఓటింగ్‌కు 48 గంటల ముందు సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాలను మూసివేస్తారు. అంతే కాదు మద్యం రవాణాను కూడా నిషేధించారు. ఈ సమయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాయ్‌పూర్, దుర్గ్, బిలాస్పూర్, జాంజ్‌గిర్-చంపా, కోర్బా, రాయ్‌గఢ్, సుర్గుజా లోక్‌సభ నియోజకవర్గాల్లో మే 5 నుండి మే 7 వరకు వైన్ షాపులు మూసివేయనున్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గాలకు మూడు కిలోమీటర్ల పరిధిలోగల అన్ని మద్యం దుకాణాలు మూసివేస్తారు. ఎవరైనా మద్యం దుకాణాన్ని తెరిచి, విక్రయాలు సాగిస్తున్నారని తేలితే సంబంధిత అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. -
రామరాజ్యమే ఆదర్శంగా.. ఆ రాష్ట్రంలో 22న డ్రై డే!
అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా ఆ రోజు చత్తీస్‌గఢ్‌లో డ్రై డే అమలవుతుందని ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ప్రకటించారు. రాష్ట్రంలో డిసెంబర్ 25 నుంచి జనవరి రెండు వరకు జరిగిన గుడ్ గవర్నెన్స్ వీక్ చివరి రోజున ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ఈ ప్రకటన చేశారు. రాష్ట్రంలో సుపరిపాలన వారోత్సవాలు జరుపుకుంటున్నామని, సుపరిపాలనే తమ సంకల్పం అని, రామరాజ్యమే తమ ఆదర్శమని సీఎం సాయి అన్నారు. అయోధ్యలో జరగబోయే శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రాష్ట్రంలోని వరి ఉత్పత్తి సంస్థల ద్వారా సుమారు మూడు వేల టన్నుల బియ్యాన్ని పంపించామని సీఎం చెప్పారు. త్వరలో కూరగాయలు కూడా పంపించబోతున్నామన్నారు. జనవరి 22న అయోధ్యలో జరిగే శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని ప్రతి ఇంటిలో ప్రత్యేకంగా దీపాలు వెలిగించనున్నారు. అలాగే రాష్ట్రమంతటా జనవరి 22ని డ్రై డేగా పాటిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఆరోజు రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరగవు. ఇది కూడా చదవండి: శ్రీరాముని సేవలో ట్రిపుల్ తలాక్ బాధితులు -
‘ప్రేమ’కు శాపంగా మారిన గోవా ఎన్నికలు! ఆ రోజు డ్రై డే.. మరి ఎలా?
పనాజి: వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ఎందరో ప్రేమికుల్లో కొత్త జోష్ని నింపుతోంది. డెస్టినేషన్ ప్రేమికుల రోజు జరుపుకోవాలనుకునే ప్రేమికులకు ఈసారి ఊహించని విధంగా పోలింగ్ దెబ్బ తగిలింది. కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఎంచక్కా గోవా వెళ్లి ఎంజాయ్ చేయాలనుకునే ప్రేమికుల హుషారుపై ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నీళ్లు చల్లాయి. ఫిబ్రవరి 14నే గోవా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండటంతో అక్కడ ఆ రోజు డ్రై డే. ఎన్నికల నియమావళి ఉండడంతో నైట్ క్లబ్బులు కూడా మూసేశారు. రాత్రి 11 గంటల తర్వాత మద్యం ఉండదు. హోటల్స్, బార్లలో ఫిబ్రవరి 12 సాయంత్రం 5 గంటల నుంచి, 15వ తేదీ వరకు మందు దొరికే ప్రసక్తే లేదు. దీంతో చలో గోవా అనుకున్న జంటలు నిరాశకు లోనవుతున్నారు. సాధారణంగా వాలెంటైన్స్ డే సమయంలో గోవాకి పర్యాటకులు పోటెత్తుతారు. కరోనాతో ఇన్నాళ్లూ అల్లాడిపోయిన రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పట్టి ఆంక్షల్ని సడలిస్తున్నారు. (చదవండి: చలికాలంలో చుండ్రు బాధా? జుట్టు మెరవాలంటే ఏం చేయాలి?) దీంతో పర్యాటక రంగం గాడిలో పడుతుందనుకుంటే ఇప్పుడు ఎన్నికలు వచ్చేశాయి. ‘‘ఎన్నికలు మా ఆదాయాన్ని దెబ్బ తీస్తున్నాయి. నెల రోజుల పాటు నైట్ క్లబ్బుల్ని ఎందుకు మూసేశారు ? గోవా ప్రశాంతమైన రాష్ట్రం. ఎప్పుడూ ఘర్షణలు చెలరేగే యూపీలో కూడా ఇంత కఠిన నిబంధనలు లేవు’’ అని కాండోలిమ్‌లో వాటర్ ఫ్రంట్ యజమాని నందన్ కుడ్చద్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల విషయం తెలియక హోటల్స్‌ని బుక్ చేసుకున్నవారు ఇప్పుడు రద్దు చేసుకుంటున్నారని, కరోనా థర్డ్ వేవ్, ఆ వెంటనే ఎన్నికలు గోవా ఆదాయాన్ని బాగా దెబ్బ తీశాయని గోవా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ రాల్ఫా డిసౌజా చెప్పారు. ప్రతీ ఏడాది వాలెంటైన్స్ డేకి గోవాలో హోటల్స్ 90% వరకు నిండిపోతాయి. కానీ ఈసారి పావు వంతు కూడా నిండే అవకాశం లేదన్న అంచనాలున్నాయి. (చదవండి: ‘లాక్డౌన్’ కోసం పక్కా ప్లాన్.. రూ.2 లక్షలు ఇచ్చి కిడ్నాప్, ప్రేమతోనే అలా?) -
మందు బాబులకు షాక్.. కొత్త ఏడాది లిక్కర్ బంద్..!
షిల్లాంగ్: మరి కొద్దిరోజుల్లో 2021 ఏడాది ముగియనుంది. అయితే క్రమంలో కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకడానికి జనాలు పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నారు. అయితే మరోవైపు కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత ఏడాది చివరి రోజు, కొత్త సంవత్సరం మొదటి రోజు మద్యం గిరాకీ బాగా పెరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే మేఘాలయలో మాత్రం ఈ నెల 24, 25 తేదీలతో పాటు కొత్త సంవత్సరం మొదటి రోజైన జవనవరి 1న కూడా మద్యం దుకాణాలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించి మందు బాబులకు షాకిచ్చింది. అయితే ఈ నిషేధం రాష్ట్ర మొత్తం లేకుండా ఈస్ట్ ఖాసి హిల్స్ జిల్లాలో మాత్రమే ఉండనున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించి జీవోను మేఘాలయ ప్రభుత్వం బుధవారం జారీ చేసింది. (చదవండి: నళినికి నెల రోజుల పెరోల్) -
పంచాయతీల్లో ‘డ్రై డే’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణను చేపట్టనున్నారు. దోమలు వృద్ధి చెందకుండా నిరోధించేందుకు వారానికి ఒకరోజు ‘డ్రై డే’నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పంచాయతీ సిబ్బంది వారానికి ఒకరోజు ఇంటింటికి వెళ్లి డ్రై డే పాటించాల్సిన ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇళ్లు.. వాటి చుట్టూ పరిసరాల్లోని గుంటలు, తొట్టెలు, పాత టైర్లు.. తదితరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసేలా ప్రజల్లో చైతన్యం కల్పిస్తారు. కలెక్టర్లు, డీపీవోలకు ఆదేశాలు.. పంచాయతీల్లో పారిశుధ్యం, హరితహారం, వీధిలైట్లు, పన్నుల వసూలు తదితరాలకు సంబంధించి గత నెలలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలకు కొనసాగింపుగా జిల్లా కలెక్టర్లు, డీపీవోలకు పంచాయతీరాజ్ శాఖ మరిన్ని ఉత్వర్వులిచ్చింది. ఈ ఆదేశాలను అన్ని గ్రామ పంచాయతీలకు పంపించి, వాటిని కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ కమిషనర్ నీతూ కుమారి ఇటీవల ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రంలోని అన్ని పల్లెలను పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన గ్రామాలుగా తీర్చిదిద్దడంలో భాగంగా అన్ని జిల్లాల్లో మూడు నెలల ప్రత్యేక కార్యాచరణను చేపట్టాలని గతంలోనే ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం వివిధ రూపాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు (క్యాంపెయిన్) చేపట్టాలని సూచించింది. కార్యక్రమంలో భాగంగా 90 రోజుల పాటు ప్రతీ గ్రామ పంచాయతీలో వివిధ చర్యలు చేపట్టాలని నిర్దేశించింది. తాజా ఆదేశాలు... అన్ని గ్రామాల్లోని రోడ్లను ప్రతిరోజూ శుభ్రపరచాలి. చెత్తను డంపింగ్ యార్డులకు తరలించాలి. ఘనవ్యర్థాల నిర్వహణ షెడ్ నిర్మించి ఉంటే కంపోస్ట్ తయారీకి చర్యలు ప్రారంభించాలి. ఠి రోజు విడిచి రోజు మురుగుకాల్వలు శుభ్రపరచాలి. ఖాళీ ప్రదేశాల్లో పొదలు, తుప్పలను తొలగించాలి. ఠి ఉపయోగించని బావులను పూడ్చాలి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా వాటిని పూడ్చేయాలి. ఠి స్కూళ్లు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, మార్కెట్లు శుభ్రపరిచేందుకు ఒకరోజు కేటాయించాలి. ఠి రాష్ట్రం లోని 12,751 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి. ఠి రైతులు తమ పొలాల్లోని గట్లు, బావుల చుట్టూ మొక్కలు నాటేలా చూడాలి. ఠి గ్రామాల్లోని అన్ని రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలి. ఠి గ్రామ పంచాయతీల పరిధిలో జరిగే వివాహాలను తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి. -
తెరచాటుకు మద్యం నిల్వలు
నేడు విక్రయానికి వ్యాపారుల సన్నాహాలు నెల్లూరు(క్రైమ్): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జిల్లా వ్యాప్తంగా జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. మహాత్ముల త్యాగాలను స్మరించుకునేందుకు అందరూ సమాయత్తమయ్యారు. జాతీయ పండగ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు డ్రైడేగా ప్రకటించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు మద్యం దుకాణాలకు సీల్ వేయనున్నారు. ఈ క్రమంలో మద్యం వ్యాపారులు డ్రైడే రోజు అక్రమంగా విక్రయాలు సాగించేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా పెద్దఎత్తున మద్యం నిల్వలను దుకాణాల సమీపంలోని గోదాములు, ఇళ్లు, కూల్‌డ్రింక్ షాపుల్లోకి తరలిస్తున్నారు. ఈ విషయం తెలిసినా ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వ్యాపారులతో కుదుర్చుకున్న ముందస్తు ఒప్పందంతోనే వారు మౌనం దాలుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ఏటా జాతీయ పండగల సమయంలో అక్రమంగా మద్యం అమ్మకాలు సాగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. మరోవైపు అధికార పార్టీ నేతలు కూడా కొందరు రంగంలోకి దిగి ఈ ఏడాది వ్యాపారులు నష్టాల్లో ఉన్నారని, డ్రైడే రోజు చూసీచూడనట్లు పోవాలని ఆదివారమే అధికారులకు సూచించినట్లు తెలిసింది. నిబంధనలు మీరితే చర్యలు: టి.శ్రీనివాసరావు, ఎక్సైజ్ డీసీ స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా జిల్లాలో డ్రైడే ప్రకటించాం. ఆదివారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు మద్యం విక్రయాలు సాగించరాదని ఇప్పటికే వ్యాపారులను ఆదేశించాము. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటాం.