షిల్లాంగ్: మరి కొద్దిరోజుల్లో 2021 ఏడాది ముగియనుంది. అయితే క్రమంలో కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకడానికి జనాలు పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నారు. అయితే మరోవైపు కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత ఏడాది చివరి రోజు, కొత్త సంవత్సరం మొదటి రోజు మద్యం గిరాకీ బాగా పెరుగుతుందన్న విషయం తెలిసిందే.
అయితే మేఘాలయలో మాత్రం ఈ నెల 24, 25 తేదీలతో పాటు కొత్త సంవత్సరం మొదటి రోజైన జవనవరి 1న కూడా మద్యం దుకాణాలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించి మందు బాబులకు షాకిచ్చింది. అయితే ఈ నిషేధం రాష్ట్ర మొత్తం లేకుండా ఈస్ట్ ఖాసి హిల్స్ జిల్లాలో మాత్రమే ఉండనున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించి జీవోను మేఘాలయ ప్రభుత్వం బుధవారం జారీ చేసింది.
(చదవండి: నళినికి నెల రోజుల పెరోల్)
Comments
Please login to add a commentAdd a comment