Liquor Stores Bandh
-
మద్యం అమ్మకాలు బంద్
కర్నూలు : గణేష్ నిమజ్జన వేడుకలు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ చేయించాలన్న కలెక్టర్ ఆదేశాల మేరకు ఎకై ్సజ్ అధికారులు చర్యలు చేపట్టారు. వెల్దుర్తి, ఎమ్మిగనూరులో ఈనెల 20వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 22 తేది ఉదయం 10 గంటల వరకు, ఆదోని, గూడూరులో 21వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 23వ తేదీ ఉదయం 10 గంటల వరకు, కర్నూలులో 25వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 27వ తేదీ ఉదయం 10 గంటల వరకు బార్లు, మద్యం దుకాణాల్లో విక్రయాలు జరగకుండా సీజ్ చేయనున్నట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. -
మందు బాబులకు షాక్.. కొత్త ఏడాది లిక్కర్ బంద్..!
షిల్లాంగ్: మరి కొద్దిరోజుల్లో 2021 ఏడాది ముగియనుంది. అయితే క్రమంలో కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకడానికి జనాలు పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నారు. అయితే మరోవైపు కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత ఏడాది చివరి రోజు, కొత్త సంవత్సరం మొదటి రోజు మద్యం గిరాకీ బాగా పెరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే మేఘాలయలో మాత్రం ఈ నెల 24, 25 తేదీలతో పాటు కొత్త సంవత్సరం మొదటి రోజైన జవనవరి 1న కూడా మద్యం దుకాణాలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించి మందు బాబులకు షాకిచ్చింది. అయితే ఈ నిషేధం రాష్ట్ర మొత్తం లేకుండా ఈస్ట్ ఖాసి హిల్స్ జిల్లాలో మాత్రమే ఉండనున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించి జీవోను మేఘాలయ ప్రభుత్వం బుధవారం జారీ చేసింది. (చదవండి: నళినికి నెల రోజుల పెరోల్) -
మద్యం దుకాణాల బంద్
విజయనగరం రూరల్: జిల్లాలో మద్యం వ్యాపారులపై ప్రభుత్వ పెద్దలు, ఎక్సైజ్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా జిల్లాలోని మద్యం వ్యాపారులు శనివారం మద్యం దుకాణాలు మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని 202 మద్యం దుకాణాలకు గత జూలైలో ఎక్సైజ్‌శాఖ అధికారులు లాటరీ నిర్వహించగా 201 మద్యం దుకాణాల లెసైన్సులను మద్యం వ్యాపారులు దక్కించుకున్నారు. వాస్తవంగా మద్యం వ్యాపారంలో లాభాలు ఆశించినంతగా లేవని సుమారు 60 మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తు చేసుకోకపోవడంతో ఎక్సైజ్ అధికారులు ప్రస్తుతం మద్యం బాటిళ్లపై వ్యాపారులకు ఇస్తున్న కమీషను పెంపుదల చేస్తామని హామీనివ్వడంతో మిగిలిపోయిన మద్యం దుకాణాలకు వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే లాటరీ వ్యవహారం ముగిసిన తర్వాత పెంచుతామన్న కమీషను నేటివరకు పెంచకపోవడంతో ఎంఆర్పీ కంటే అదనంగా అమ్మకాలు సాగించాలని మద్యం వ్యాపారులు అధికారులను కోరారు. ఇటీవల సంక్రాంతి పండగ, కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకుని మద్యం వ్యాపారులు ఎంఆర్పీపై అదనంగా ఐదు రూపాయలు పెంచి అమ్మకాలు సాగించారు. దీంతో జిల్లా మంత్రి ఆదేశాలతో ఎక్సైజ్ అధికారులు మద్యం దుకాణాలపై దాడులు ముమ్మురం చేశారు. ఎంఆర్పీ కంటే అదనంగా అమ్మిన 21 దుకాణాలపై కేసులు నమోదు చేసి రూ.21 లక్షతు అపరాధ రుసుం విధించారు. అలాగే ఇటీవల సీఎం చంద్రబాబు సైతం మద్యం అమ్మకాలపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో ఎక్సైజ్ అధికారులు ప్రతి మద్యం దుకాణం వద్ద ఎంఆర్పీకే మద్యం అమ్మకాలు సాగించాలని, ఫిర్యాదులు చేయడానికి ఎక్సైజ్ కార్యాలయంలో ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేశారు. అలాగే గతంలో ఎంఆర్పీకంటే అధికంగా అమ్మకాలు సాగిస్తే విధించే లక్ష రూపాయల అపరాధ రుసుంను రెండు లక్షలకు పెంచడంతో మద్యం వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మద్యం వ్యాపారుల అసోసియేషన్ రెండురోజులుగా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేస్తూ వారి ఇబ్బందులను ఏకరువు పెడుతున్నారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఎంఆర్పీకంటే అదనంగా రూ.10 పెంచి మద్యం అమ్మకాలు సాగిస్తున్నా ప్రభుత్వ పెద్దలకు కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఎంఆర్పీకంటే అదనంగా కొన్ని నెలలుగా అమ్మకాలు సాగిస్తున్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదన్నారు. కేవలం విజయనగరం జిల్లాలో మద్యం వ్యాపారులపై కక్ష సాదింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని వాపోయారు. కేవలం ఒక నెలలో పండగలను పురస్కరించుకుని ఐదు రూపాయలు పెంచి అమ్మకాలు సాగిస్తే ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారని అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారమయ్యే దాకా మద్యం దుకాణాలను తెరిచేది లేదని స్పష్టంచేశారు. ఎలాగూ మద్యం వ్యాపారంలో పూర్తిగా నష్ట పోయామని, ఇప్పుడు కొత్తగా వచ్చిన నష్టమేమీ లేదన్నారు. ఆదివారం కూడా మద్యం దుకాణాలు తెరిచేది లేదని, ప్రభుత్వ పెద్దలు స్పందించి తమకు న్యాయం చేసేవరకు నిరసన తెలుపుతూనే ఉంటామన్నారు. కోటి రూపాయల అమ్మకాలు బంద్ శనివారం మద్యం దుకాణాలు మూసివేయడంతో జిల్లా వ్యాప్తంగా కోటి రూపాయల వరకు మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. అలాగే రెండు రోజులుగా ఐఎంఎల్ డిపో నుంచి మద్యం వ్యాపారులు మద్యాన్ని తీసుకువెళ్లకపోవడంతో స్టాకు నిలిచిపోయింది. ఆదివారం మద్యం దుకాణాలు బంద్ అయితే మరో కోటి రూపాయల వరకు మద్యం అమ్మకాలు నిలిచిపోతాయి. -
మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా మద్యం దుకాణాలు బంద్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మంత్రి మృణాళిని వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసివేశారు. తాము లాభాలను కోల్పోయి వ్యాపారం చేస్తుంటే మంత్రి తమను తప్పుబట్టడం తగదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ అధికారులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించిన మంత్రి మృణాళిని... ఎంఆర్పీకి మించి విక్రయాలు, బెల్ట్‌షాపులపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మామూళ్లు తీసుకుని వదిలేస్తున్నారని ఎక్సైజ్ అధికారులపై, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని వ్యాపారులపై మండిపడ్డారు. ఇలా అయితే కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. మంత్రి వ్యాఖ్యలతో మద్యం వ్యాపారులు ఆవేదన చెందారు. జిల్లా వ్యాప్తంగా 202 దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు. తమకొస్తున్న 18 శాతం కమీషన్లో 16 శాతం ప్రభుత్వానికి లెసైన్సు రూపేణా చెల్లిస్తున్నామని, రెండు శాతం లాభంతో వ్యాపారం చేయలేమని, మా డబ్బులను రిఫండ్ ఇస్తే మద్యం అమ్మకాలకు స్వస్తి చెబుతామని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మిగతా 12జిల్లాలో ఎంఆర్పీకి మించి విక్రయాలు చేపడుతున్నారని, అటు వైపు ఒకసారి చూడాలని, అక్కడి కంటే తక్కువ ధరకు విక్రయిస్తున్న తమపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని వాపోయారు. బొబ్బిలిలోనైతే ఎక్సైజ్ కార్యాలయం వద్ద డివిజన్ వ్యాపారులంతా నిరసన తెలియజేశారు. తమపై మండిపడుతున్న మృణాళిని... తన సొంత ఊరులో ఎంఆర్పీకి మించి జరుగుతున్న విక్రయాల్ని, బెల్ట్‌షాపులను ఎందుకు నియంత్రించడం లేదని ప్రశ్నించారు. రాష్ర్టంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో అధికారులే వ్యాపారులతో టెండర్లు వేయించడం వల్ల నూటికి నూరుశాతం దుకాణాలకు వేలం పాటలు జరిగాయని చెప్పారు. ఏజెన్సీలో అమ్మకాలు చేయలేని పరిస్థితి ఉన్నా అధికారులు బలవంతంగా మాతో దుకాణాలు నడిపిస్తున్నారని వాపోయారు. ఇవన్నీ తెలిసి మంత్రి సీరియస్ అయ్యారో మరేంటో గాని దుకాణాలు మూసేసిన వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. మధ్యాహ్నం తరువాత ఒక్కొక్కరూ దుకాణాలు తెరిచారు. ఉదయం వరకూ దుకాణాలను బంద్ చేయడం వల్ల రూ.50 లక్షలమేర వ్యాపారం నిలిచిపోయింది.