
ప్రేమ జంటలు ఒకరినొకరు చితకబాదుకున్నారు. తమ పార్టనర్స్ మోసం చేశారని ఆరోపిస్తూ పొట్టు పొట్టు తన్నుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. న్యూయార్క్‌లోని ఓ క్రూయిజ్ షిప్‌లోని ఐదో అంతస్తులో అర్ధర్రాతి ఫుల్ జోష్‌లో పార్టీ జరుగుతోంది. ఆ పార్టీలో దాదాపు 60-70 మంది ప్రయాణికులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు ప్రేమికులు.. తమ పార్టనర్స్ తమను మోసం చేశారని ఆరోపిస్తూ కేకలు వేశారు. దీంతో, వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా దాడులకు దారి తీసింది.
ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రేమికులు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. బట్టలు చింపుకుంటూ.. జుట్టు పట్టుకుని పొట్టుపొట్టు కొట్టుకున్నారు. ఒకరిపై మరోకరు పడిపోయి పిడిగుద్దులు కురిపించుకుంటున్నారు. దాదాపు గంట పాటు ఇలా కొట్టకున్నారు. దీంతో, షిప్ సిబ్బంది నోరెళ్లబెట్టారు. చేసేదేమీ లేక చూస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదేం ఫైట్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
last nights festivities on my carnival cruise 🥳🛳 pic.twitter.com/uehhfmCfaC
— naim (@nyeem0) June 28, 2022