Young Woman Committed Ends Life Due To Lover Refused To Marry Her In Mahabubabad- Sakshi
Sakshi News home page

పెళ్లికి నిరాకరించిన ప్రేమికుడి బొమ్మగీసి.. 

Published Wed, Mar 16 2022 3:19 AM | Last Updated on Wed, Mar 16 2022 9:28 AM

Mahabubabad: Young Woman Committed Ends Life Due To Lover Refused To Marry Her - Sakshi

శరణ్య (ఫైల్‌), శరణ్య గీసిన ప్రేమికుడి చిత్రం 

నర్సింహులపేట: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని సూసైడ్‌ నోట్‌ రాసి యువతి అత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన కొండ లింగమల్లు అనే యువకుడు, పోలేపల్లి శరణ్య మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ప్రియుడు ఒక ప్రజా ప్రతినిధి వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పెళ్లి గురించి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ కూడా చేశారు. కొంత సమయం కావాలని ప్రియుడు కోరాడు. ఇచ్చిన సమయం అయిపోయినా లింగమల్లు పెళ్లికి నిరాకరించడంతో శరణ్య (23) ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్‌ నోట్‌ రాసి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన యువకుడి ఫొటో బొమ్మ గీసింది. కాగా.. యువతి శవాన్ని యువకుడి ఇంటి ముందుకు తీసుకొచ్చి బంధువులు ఆందోళన చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement