మీరు ప్రేమిస్తున్న వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవాలంటే..! | Mom Epic Reaction To Trending Orange Peel Theory Goes Viral Relationship Test, Watch Video Inside - Sakshi
Sakshi News home page

Orange Peel Theory: మీరు ప్రేమిస్తున్న వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవాలంటే..!

Feb 11 2024 10:01 AM | Updated on Feb 11 2024 12:09 PM

Trending Orange Peel Theory Goes Viral Relationship Test  - Sakshi

‘మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తుంది లేదా ప్రేమిస్తున్నాడు అనేది క్షణాల్లో తెలుసుకోవాలనుకుంటున్నారా? దీనికి ఒక మార్గం ఉంది. అదే ఆరెంజ్‌ పీల్‌ థియరీ’ అంటూ ఇంటర్నెట్‌లో మొదలైన సందడి వైరల్‌ కావడానికి ఎంతో టైమ్‌ పట్టలేదు. లవ్‌ లిట్మస్‌ టెస్ట్‌గా భావించే ‘ఆరెంజ్‌–పీల్‌–థియరీ’ సోషల్‌ మీడియా వైరల్‌ ట్రెండ్‌గా మారింది. ఈ ట్రెండ్‌లో భాగంగా ఎన్నో మీమ్స్‌ వస్తున్నాయి. తాజాగా కమేడియన్‌ అంచల్‌ అగర్వాల్‌ ‘ఆరెంజ్‌ పీల్‌ థియరీ’పై తన తల్లితో కలిసి చేసిన వీడియో వైరల్‌ అయింది. 7 మిలియన్‌ల వ్యూస్‌ దక్కించుకుంది.

ఇంతకీ ఏమిటి ఆరెంజ్‌ పీల్‌ థియరీ?
సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఆరెంజ్‌ను లవర్‌కు చూపిస్తూ....‘నా కోసం ఈ ఆరెంజ్‌ తొక్క తీయగలవా?’ అని అడగాలి.లవర్‌ వెంటనే ‘ఓకే’ అంటే మనది నిజమైన ప్రేమ!
ఇది సిల్లీ టెస్ట్‌గా అనిపిస్తున్నప్పటికీ ఇంటర్‌నెట్‌ లోకవాసులలో చాలామంది దీన్ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నారు. ఈ వైరల్‌ ట్రెండ్‌ పుణ్యమా అని ఆరేంజ్‌ ఫలాలు తెగ అమ్ముడవుతున్నాయట! 

(చదవండి: షాకింగ్‌ ఘటన అసలు కంటి భాగమే ఏర్పడకుండా పుట్టిన చిన్నారి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement