దొంగల క్రియేటివిటికి ఏ ప్లస్‌ మార్కులు | Thiefs Robs Shop By Wearing Watermelon | Sakshi
Sakshi News home page

పుచ్చకాయ మాస్కులతో షాపులో చోరీ

Published Mon, May 18 2020 6:13 PM | Last Updated on Mon, May 18 2020 7:00 PM

Thiefs Robs Shop By Wearing Watermelon - Sakshi

ఈ దొంగలది మామూలు తెలివి కాదు! కొంపలు ముంచే తెలివి...

న్యూయార్క్‌ : ఈ దొంగలది మామూలు తెలివి కాదు! కొంపలు ముంచే తెలివి. దానికి తోడు వారివి సృజనాత్మకత నిండిన హృదయాలు. అందుకే దొంగతనం చేయటానికి కూడా వెరైటీగా గుజ్జు తీసేసిన పుచ్చకాయ మాస్కును తలకు తగిలించుకెళ్లారు. విజయం సాధించి, హమ్మయ్యా! పుచ్చకాయ సేఫ్‌ అనుకున్న వారికి పోలీసులు షాక్‌ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. వర్జీనియాకు చెందిన ఇద్దరు దొంగలు కొద్దిరోజుల క్రితం దొంగతనం చేయటానికి దగ్గరలోని షీట్జ్‌ స్టోర్‌కు వెళ్లారు. ముఖానికి గుజ్జు తీసేసిన పుచ్చకాయలను తగిలించుకున్నారు. అక్కడి వారు ఈ ఇద్దరి విచిత్ర వేషధారణ చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వారు ఆశ్చర్యంలో ఉండగానే ఎవ్వరికీ అనుమానం రాకుండా పనికానిచ్చేసి అక్కడినుంచి చక్కేశారు. (జూమ్‌ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో న‌గ్నంగా.. )

సీసీ కెమెరాల్లో వీరి భాగోతం బయటపడటంతో షాపు యాజమాన్యం ఖంగుతింది. పోలీసులను రంగంలోకి దింపింది. ప్రజల సహాయంతో త్వరగానే పోలీసులు దొంగలను అరెస్ట్‌ చేశారు. వీరికి సంబంధించిన కొన్ని ఫొటోలను తమ ఫేస్‌బుక్‌ ఖాతాలో షేర్‌ చేశారు. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. ‘‘ వారి సృజనాత్మకతకు ఏ ప్లస్‌ మార్కులు.. ఈ సీజన్‌లో పుచ్చకాయలు ఎక్కువ కదా! అందుకే’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ( ఆ ఫోటో వెనక ఇంత కథ ఉంది )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement