సాధారణంగా కొందరు తమకు నచ్చినవి జరగకపోయినా లేదా ఇష్టం లేనివి జరుగుతున్న కొందరు నిరసనలు తెలపడం సహజమే. అయితే కొందరు మాత్రం వారి నిరసనను కాస్త ఢిఫరెంట్‌గా తెలుపుతుంటారు. ఒక్కోసారి అవి హాస్యాస్పదంగా, వివాదాస్పదంగా మారి వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా ఓ మహిళ తన నిరసనను వింతగా తెలియజేస్తూ కోర్టులో ఉన్న వారికి చుక్కలు చూపించింది. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఓ మహిళను స్థానికంగా గొడవలు చేసిందనే కారణంతో పోలీసులు అరెస్టు చేసి అల్బానీ నగరంలోని కోర్టులో హజరుపర్చారు. కోర్టులో.. ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఇందులో ఆ మహిళ తనపై వ్యతిరేక వాదనలే ఎక్కువగా వస్తున్న విషయాన్ని గమనించి కోపంతో ఊగిపోయింది. ఇంకేముంది తెలిసిన వారితో డబ్బాల నిండా బొద్దింకలను కోర్టుకు తెప్పించుకుంది. అదును చూసి కోర్టులో వాటిని వదిలేసింది. నిమిషంలో కోర్టు హాల్ మొత్తం బొద్దింకలతో నిండిపోయింది. ఒకటి, రెండు కాదండీ బాబు.. ఏకంగా వందల సంఖ్యలో బొద్దింకలు రావడంతో కేసును వాయిదా వేశారు.
దాంతో పాటు బొద్దింకలను తరిమేందుకు పొగపెట్టాలంటూ కోర్టును కూడా మూసివేశారు. మహిళ చర్య కారణంగా కోర్టు కార్యకలాపాల్లో తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. ఇదంతా మహిళ కావాలని చేసిన పనిగా బయటపడింది. దీంతో కోర్టు ఆమె చేసిన పనిని తీవ్రంగా పరిగణించింది. దీంతో ప్రస్తుతం ఆమెను పోలీసులు కస్టడీలోనికి తీసుకొని ఈ ఘటపై విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
చదవండి: చరిత్ర సృష్టించిన మాలావత్ పూర్ణ.. మౌంట్ డెనాలి ఎక్కి ప్రపంచ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment